E-Paper
Advertisement

మా లాయర్లలో మంచి నటులున్నారు.. వారితో సినిమా తీయండి: సుప్రీంకోర్టు

మా లాయర్లలో మంచి నటులున్నారు.. వారితో సినిమా తీయండి: సుప్రీంకోర్టు
Advertisement

Rajpal Yadav: స్వేచ్చ బ్యూరో: బాలీవుడ్​ నటుడు రాజ్​ పాల్​ యాదవ్​ చెక్​ బౌన్స్​ కేసులో సుప్రీం కోర్టు కొన్ని సరదా వ్యాఖ్యలు చేసింది. మా లాయర్లలో మంచి నటులున్నారు..వారితో సినిమా తీయండి అంటూ పేర్కొంది. రాజ్​ పాల్​ యాదవ్​ తన స్వీయ దర్శకత్వంలో ‘అతా పతా లాపతా’ సినిమా తీసిన విషయం తెలిసిందే. దీని కోసం మురళీ ప్రాజెక్ట్స్​ సంస్థ నుంచి రాజ్​ పాల్​ యాదవ్​ 5కోట్లు అప్పుగా తీసుకున్నాడు. వడ్డీతో కలిపి 11కోట్లు చెల్లించేలా అగ్రిమెంట్​ చేశాడు. అయితే, చెప్పిన సమయానికి డబ్బు ఇవ్వలేకపోయాడు.

మురళీ ప్రాజెక్ట్స్​ సంస్థ..

2013లో ఆయన ఇచ్చిన 1.05కోట్ల విలువైన ఏడు చెక్కులు బౌన్స్​ అయ్యాయి. దాంతో మురళీ ప్రాజెక్ట్స్​ సంస్థ ఆయనపై కోర్టులో కేసు వేసింది. దీనిని విచారించిన కిందికోర్టు 3నెలల జైలు శిక్ష విధించగా ఢిల్లీ హైకోర్టు దానిని జూలైలో సమర్థించింది. ప్రతి కేసులో కోటి రూపాయల చొప్పున ఫిర్యాదీకి చెల్లించాలని ఆదేశించింది. రాజ్​ పాల్​ తోపాటు ఆయన భార్య రాధా రాజ్​ పాల్​ కు ఒక్కో కేసులో 5.5లక్షల జరిమానా విధించింది. కాగా, జైలు శిక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని రాజ్​ పాల్ సుప్రీం కోర్టులో పిటిషన్​ దాఖలు చేశాడు. దీనిపై బుధవారం విచారణ జరుగగా ఆయన స్వయంగా కోర్టుకు వచ్చాడు. తన మొదటి దర్శకత్వ చిత్రం అతా పతా లాపతా వల్ల భారీగా డబ్బు నష్టపోయినట్టు తెలిపాడు. దాదాపు 250 చిత్రాల్లో నటించిన తాను గడిచిన పదమూడేళ్లలో 250 కోట్లకు పైగా నష్టపోయినట్టు చెప్పాడు.

కొత్త సినిమా ఏదైనా వస్తోందా?

Advertisement

12వందల థియేటర్లలో రిలీజ్ కావాల్సిన తన సినిమా ఒక్క థియేటర్​ లో కూడా విడుదల కాలేదని తెలిపాడు. నా దగ్గర ప్రస్తుతం ఒక్క రూపాయి కూడా లేదు. జైలుకు వెళ్లటానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. దీనిపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ సూర్యకాంత్ స్పందిస్తూ కొత్త సినిమా ఏదైనా వస్తోందా? మంచి సినిమా తీసి మళ్లీ మీ ఇమేజ్​ పెంచుకోండి అని వ్యాఖ్యానించారు. మా దగ్గర మంచి నటులైన లాయర్లు ఉన్నారు. వాళ్లతో ఓ సినిమా తీయొచ్చు కదా అని వ్యాఖ్యానించారు. దాంతో కోర్టు హాల్లో నవ్వులు విరిశాయి.

Also read: తెలంగాణలో కాంగ్రెస్ భారీ ఆందోళనకు పిలుపు.. ‘చలో రాజ్‌భవన్’ ఎప్పుడంటే?

Tags

Related News

సీఈసీ నియామక వివాదంలో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి దిగిన సీజేఐ బెంచ్!

పెట్రోల్ బంక్ సీజ్ వివాదం.. ఇండియన్ ఆయిల్ అధికారి దారుణ హత్య.. కేంద్రమంత్రి కీలక ఆదేశాలు!

నడిరోడ్డుపై పడుకుని ప్రియాంక నిరసన.. రాహుల్‌ను ఎత్తుకెళ్లిన పోలీసులు, ఢిల్లీలో హైటెన్షన్!

ఇన్‌స్టాగ్రామ్‌ పరిచయం.. హిందూ పద్ధతిలో పెళ్లి.. 6 నెలల తర్వాత బయటపడ్డ భర్త అసలు రంగు!

ట్రక్కును ఢీకొట్టిన కారు.. ముగ్గురు టెన్నిస్‌ ప్లేయర్లు దుర్మరణం!

పసి పిల్లలపై తాంత్రికుడి పైశాచికత్వం.. శ్మశానం సమీపంలో ఏం చేశాడంటే.. బీహార్‌లో వెలుగు చూసిన దారుణం

విమర్శలు ఏ మాత్రం పట్టించుకోను.. నా జీవితాశయం అదే, తేల్చిచెప్పిన పీఎం నరేంద్రమోదీ

Big Stories

Advertisement
×