E-Paper
Advertisement

Balakrishna: అప్పుడు ఊ కొడతారా ఉలిక్కి పడతారా.. ఇప్పుడు NBK 111.. హిట్ కొట్టేనా?

Balakrishna: అప్పుడు ఊ కొడతారా ఉలిక్కి పడతారా.. ఇప్పుడు NBK 111.. హిట్ కొట్టేనా?
Advertisement

Balakrishna: నటసింహ నందమూరి బాలకృష్ణ (Balakrishna) ఆరుపదుల వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు. ఒకవైపు తన విలక్షణమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే.. మరొకవైపు వరుస లైనప్ తో అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ క్రమంలోనే చివరిగా అఖండ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ చవి చూసిన బాలయ్య.. ఇప్పుడు తనకు వీరసింహారెడ్డి సినిమాతో మంచి విజయాన్ని అందించిన గోపీచంద్ మలినేని(Gopichandh malineni) దర్శకత్వంలో NBK 111 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా ప్రకటించారు . ఇక రెగ్యులర్ షూటింగు ఈరోజు నుంచి హైదరాబాద్ లో ప్రారంభం అయింది. ఇకపోతే ఈ సినిమాను దసరా సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

బాలయ్య కోసం రంగంలోకి మంచు వారసుడు..

మరోవైపు ఈ సినిమా నుండి వినిపిస్తున్న మరో వార్త ప్రకారం ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం మంచు వారసుడిని ఎంపిక చేసుకున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన ఎవరో కాదు మంచు మనోజ్ (Manchu Manoj). ప్రస్తుతం ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే.. మరికొన్ని చిత్రాలలో కీలకమైన పాత్రలు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే బాలయ్య సినిమాకి మంచు మనోజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే అని అందరూ భావిస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే అప్పట్లో ‘ఊ కొడతారా ఉలిక్కిపడతారా’ ఇప్పుడు NBK 111 కోసం వీరిద్దరూ పనిచేస్తున్నారు అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అప్పుడు ఊకొడతారా ఉలిక్కిపడతారా

Advertisement

అసలు విషయంలోకి వెళ్తే.. గతంలో మంచు మనోజ్ నటించిన ఊకొడతారా ఉలిక్కిపడతారా సినిమాలో మనోజ్ కోసం బాలయ్య ఒక ముఖ్యపాత్ర చేశారు. ఇప్పుడు బాలకృష్ణ కోసం మనోజ్ ఓకే చెప్పారని సమాచారం. ఇక దీన్ని బట్టి చూస్తే మంచు , నందమూరి కుటుంబాల మధ్య ఉన్న సాన్నిహిత్యానికి ఇది మరో నిదర్శనం అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.. మరి ఇందులో మంచు మనోజ్ కీలక పాత్రలో కనిపిస్తారా లేక విలన్ పాత్ర పోషిస్తారా అన్న విషయం తెలియాల్సి ఉంది. మొత్తానికి అయితే పదేళ్ల తర్వాత మళ్లీ వీళ్ళిద్దరిని కలిపి స్క్రీన్ మీద చూడబోతుండడంతో నందమూరి, మంచు అభిమానులు ఈ సినిమా కోసం తెగ ఎగ్జైట్ అవుతున్నారు.

ALSO READ:Tollywood: 16 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ కోసం కుస్తీ పడుతున్న చిరంజీవి హీరోయిన్.. సక్సెస్ అవుతుందా?

NBK 111 సినిమా విశేషాలు..

Advertisement

బాలకృష్ణ సినిమా విషయానికి వస్తే.. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న రెండవ చిత్రం ఇది. ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. పీరియాడికల్ మైథాలజీ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. త్వరలోనే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం . ఏది ఏమైనా బాలకృష్ణ కోసం ఇప్పుడు మంచు మనోజ్ రంగంలోకి దిగబోతున్నారు అనే వార్త సోషల్ మీడియాలో కొత్త అంచనాలకు తెరలేపింది. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×