E-Paper
Advertisement

Tollywood: వెంకీ మూవీ కమెడియన్‌కు తీవ్ర అనారోగ్యం.. పరామర్శించిన మంచు హీరో!

Tollywood: వెంకీ మూవీ కమెడియన్‌కు తీవ్ర అనారోగ్యం.. పరామర్శించిన మంచు హీరో!
Advertisement

Tollywood:మాస్ మహారాజా రవితేజ (Raviteja) హీరోగా వచ్చిన ‘వెంకీ’ సినిమాలో బొద్దుగా రమణ పాత్రలో కనిపించి.. అందరి దృష్టిని ఆకర్షించారు కమెడియన్ రామచంద్ర (Comedian Ramachandra). ఒకవైపు కమెడియన్ గా సినిమాలు చేస్తూ కెరీర్ ను కొనసాగిస్తున్న ఈయన.. గత నెల రోజుల క్రితం పెరాలసిస్ బారిన పడ్డ విషయం తెలిసిందే. తన కామెడీతో ప్రేక్షకులను మెప్పించిన రామచంద్ర.. ఇప్పుడు నడవలేని స్థితిలో మంచానికే పరిమితం అవడం చూసి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో పలువురు సెలబ్రిటీలు ఈయనను పరామర్శిస్తున్నారు.

కమెడియన్ రామచంద్రను పరామర్శించిన మంచు హీరో..

Advertisement

అందులో భాగంగానే ఇప్పుడు తాజాగా మంచు హీరో కూడా రామచంద్రను కలిసి పరామర్శించారు. విజయవాడ వెళ్తున్న మనోజ్ కి రామచంద్ర స్నేహితులలో ఒకరు వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపారట. విషయం తెలుసుకున్న మనోజ్ హుటాహుటిన రామచంద్ర ఇంటికి చేరుకున్నారు. అక్కడ ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. మరి రామచంద్ర పరిస్థితిని అర్థం చేసుకొని మనోజ్ ఆయనకు ఆర్థిక సహాయం చేస్తారా? లేదా అన్నది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. మొత్తానికైతే స్టార్ హీరో మనోజ్ ఇప్పుడు రామచంద్రను పరామర్శించడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే?

Advertisement

అసలు విషయంలోకి వెళ్తే.. ఒక మిత్రుడి కోరిక మేరకు ఒక సినిమా షూట్ కి వెళ్ళిన ఈయన.. అనూహ్యంగా షూటింగ్ సెట్లో జ్వరం రావడంతో అక్కడి నుండి ఇంటికి బయలుదేరారట. ఇంటికి వచ్చిన తర్వాత భోజనం చేస్తూ ఉండగా సడన్గా కాళ్ళు, చేతులు నొప్పి పుట్టాయట. ఏంటా అని డాక్టర్ వద్దకు వెళ్తే బ్రెయిన్ లో రెండు బ్లడ్ క్లాట్స్ ఏర్పడ్డాయని చెప్పారట. అలా చెప్పిన కొద్దిసేపటికి ఎడమ చేయి, ఎడమ కాలు పనిచేయడం ఆగిపోయాయని, బ్రెయిన్ లో ఉన్న ఆ క్లాట్స్ తగ్గిపోతేనే ఇవి మళ్లీ మామూలుగా పని చేస్తాయని వైద్యులు చెప్పారట. ప్రస్తుతం వైద్యుల సలహా మేరకు మెడిసిన్ తీసుకుంటున్నానని, రెండు నెలల పాటు బెడ్ రెస్ట్ కావాలని వైద్యులు చెప్పినట్లు ఒక వీడియో రిలీజ్ చేశారు రామచంద్ర.

ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్న రామచంద్ర..

అలా ఇంటికే పరిమితమై.. పక్షవాతంతో బాధపడుతున్న రామచంద్ర సెలెబ్రిటీల నుంచి ఆర్థిక సహాయం కోరుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ విషయం మాస్ మహారాజా రవితేజ, మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi ) వరకు చేరాలి అని, తనకు ఎవరైనా ఆర్థిక సహాయం చేస్తే త్వరగా తాను కోలుకొని మళ్లీ సినిమాలలో నటిస్తానని రామచంద్ర చెప్పుకొచ్చారు. ఇక రామచంద్ర పరిస్థితిని చూసి చలించి పోయిన కొంతమంది మిత్రులు సెలబ్రిటీలకు ఈ విషయాలను చేరవేసే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే.

రామచంద్ర సినిమాలు..

జూనియర్ ఎన్టీఆర్ (Jr.NTR) హీరోగా ఇండస్ట్రీకి తొలి పరిచయమైన ‘నిన్ను చూడాలని’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు రామచంద్ర..ఆ తర్వాత ఆనందం, సొంతం, వెంకీ, కింగ్, లౌక్యం, దుబాయ్ శీను ఇలా ఎన్నో చిత్రాలలో నటించారు. అలా దాదాపు 100కు పైగా సినిమాలలో నటించిన ఈయన.. తన కామెడీ టైమింగ్ తో అందరిని అలరించారు. వెంకీ సినిమాతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న ఈయన జీవితం ఇప్పుడు మలుపు తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒకప్పుడు తన కామెడీతో ఎంతోమందిని నవ్వించిన రామచంద్ర ఇప్పుడు నడవలేని స్థితిలో ఉండడంతో అభిమానులు సైతం తట్టుకోలేకపోతున్నారు.

ఫైనాన్షియల్ గా హామీ ఇచ్చిన మంచు మనోజ్..

ఇకపోతే రామచంద్రను పరామర్శించిన మంచు మనోజ్.. ఫైనాన్షియల్ గా అండగా నిలబడతానని హామీ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ALSO READ:Vetrimaran: డైరెక్టర్ సంచలన నిర్ణయం.. ఇదే చివరి సినిమా అంటూ!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×