Hollywood Actor Death..ఫిలిం ఇండస్ట్రీలో వరుస విషాదాలు అభిమానులను ఒక్కసారిగా కలవరపాటుకు గురి చేస్తున్నాయి. నిన్నటికి నిన్న ప్రముఖ హాలీవుడ్ నటుడు అకీ అలియోంగ్ (Aki Aleong)వింత వ్యాధితో బాధపడుతూ తుది శ్వాస విడిచినట్లు ఆయన భార్య స్పష్టం చేసింది. ఈ విషాదం నుండి బయటపడక ముందే మరో హాలీవుడ్ నటుడు కన్నుమూయడం నిజంగా బాధాకరమని చెప్పాలి. ఆయన ఎవరో కాదు ప్రముఖ అమెరికన్ నటుడు రాబర్ట్ మారినెల్లి(Robert Marinelli) కన్నుమూశారు. గత కొంతకాలంగా స్టమక్ క్యాన్సర్ తో పోరాడుతున్న రాబర్ట్.. క్యాన్సర్ చివరి స్టేజ్ కి చేరుకోవడంతో ఆయన మరణించినట్లు సమాచారం. ముఖ్యంగా క్యాలిఫోర్నియాలోని బర్బాంక్ లో ఆయన తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఈయన పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు నిర్ధారించారు. ప్రస్తుతం ఈయన మరణంతో పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు
రాబర్ట్ ను నటుడిగా నిలబెట్టిన చిత్రాలు..
శాంటా బార్బరా, జనరల్ హాస్పిటల్, ది మార్నింగ్ షో వంటి సినిమాలతో రాబర్ట్ మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు.ముఖ్యంగా టెలివిజన్ ధారావాహికలలో తన చిరస్మరణీయ నటనకు మారినెల్లి మరింత ప్రసిద్ధి చెందారు. శాంటా బార్బరా లో దాదాపు 171 ఎపిసోడ్లలో కనిపించిన ఈయన.. ఇందులో క్రాస్ డ్రెస్సింగ్ మాబ్ స్టర్ బన్నీ టాగ్లియాట్టి అనే పాత్ర ద్వారా అభిమానుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఇక జనరల్ హాస్పిటల్లో జోసెఫ్ సోరెల్ పాత్ర ద్వారా క్రేజ్ దక్కించుకున్నారని చెప్పవచ్చు. అంతేకాదు ది మార్నింగ్ షో లో కూడా తన నటనతో మార్క్ చూపించారు. ఇక 2004 లో వచ్చిన డ్రామా సైడ్ వేస్ లో కూడా ఒక పాత్ర పోషించారు.
సినీ ప్రముఖుల సంతాపం..
ఇకపోతే హాలీవుడ్ అమెరికన్ నటుడుగా పేరు సొంతం చేసుకున్న రాబర్ట్ మరణంతో అటు పరిశ్రమ ఇటు స్నేహితులు, తోటి నటీనటులు నివాళులు అర్పించారు.. ప్రముఖ నటుడు లీ మెక్ క్లోస్కీ తన ఫేస్బుక్ ఖాతా ద్వారా..” మీరు కనుగొనలేని మధురమైన వ్యక్తి నా స్నేహితుడు” అంటూ అభివర్ణించారు.
మరొక సన్నిహితుడు..” ఉదార ప్రదర్శనకారుడు.. అందమైన మానవుడు.. విశాల దృష్టి గల సానుకూలవాది” అంటూ గుర్తు చేసుకున్నారు.
ఇక మరొక డైరెక్టర్ రాబర్ట్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ “అసాధారణ కళాకారుడు” అంటూ సంబోధించారు. మారినెల్లి వినోద ప్రపంచంలో గొప్ప, సంక్లిష్టమైన ప్రదర్శనల వారసత్వాన్ని పొంది ప్రియమైన వ్యక్తిగా ఖ్యాతిని పొందారు.
ALSO READ: Theatre Ceiling Collapsed: సినిమా చూస్తుండగా కుప్పకూలిన థియేటర్ సీలింగ్..