E-Paper
Advertisement

కన్నప్ప మూవీకి ఏడాది.. మంచు విష్ణు ఎమోషనల్ పోస్ట్!

కన్నప్ప మూవీకి ఏడాది.. మంచు విష్ణు ఎమోషనల్ పోస్ట్!
Advertisement

Manchu Vishnu: మంచు విష్ణు ప్రెస్టేజియస్ మూవీగా గత ఏడాది అనగా 2025 జూన్ 27న థియేటర్లలో విడుదలైన చిత్రం కన్నప్ప. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ తో పాటు ఏవీఏ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషించగా.. మోహన్ లాల్ , అక్షయ్ కుమార్ , ప్రభాస్, కాజల్ అగర్వాల్ , ప్రీతి ముకుందన్, మోహన్ బాబు, ఆర్ శరత్ కుమార్, మధు , ముఖేష్ రిషి , అర్పిత్ కారన్ కా తదితరులు కీలకపాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకోవడం గమనార్హం.

కన్నప్ప మూవీకి ఏడాది..

ముఖ్యంగా మంచు విష్ణు తన తండ్రి మోహన్ బాబు సహకారంతో హిందూ పురాణాలలోని శివ భక్తుడు తన కళ్లను త్యాగం చేసిన కన్నప్ప గాథ నుండి ఈ ప్రాజెక్టు ప్రేరణ పొందింది. ఇకపోతే ఈ సినిమా విడుదలయ్యి సరిగ్గా నేటికి ఏడాది కావడంతో ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పంచుకున్నారు మంచు విష్ణు. మంచు విష్ణు కన్నప్ప పోస్టర్ ను షేర్ చేస్తూ..” సరిగ్గా ఏడాది క్రితం.. ఇదే రోజున కన్నప్ప మీ అందరి ముందుకు వచ్చింది. సాధారణంగా కొన్ని సినిమాలు వినోదాన్ని అందిస్తాయి.

మీ ప్రేమకు ధన్యవాదాలు..

Advertisement

మరికొన్ని సినిమాలు మిమ్మల్ని మార్చేస్తాయి. కన్నప్ప నాలో ఈ రెండింటిని కూడా కలిగించింది. విశ్వాసం, త్యాగం, నమ్మకంతో కూడిన ప్రయాణం ఇది. నన్ను అన్ని విధాలుగా పరీక్షించి జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలను ఇచ్చిన ప్రయాణం. ముఖ్యంగా థియేటర్లలో చూసి, ఆ తర్వాత ఓటీటీలో కనుగొని, ఆదరించి, విమర్శించి , కన్నప్ప గురించి మాట్లాడుతూనే ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.

కన్నప్ప రీ రిలీజ్..

Advertisement

మీ ప్రేమ కన్నప్ప విడుదల తర్వాత కూడా ఎంతో కాలంగా సజీవంగా ఉంచింది. సరిగ్గా ఈ సినిమా విడుదలై ఏడాది అవుతున్నా ఇంకా నా హృదయం ఆనందంతో నిండిపోయింది.. హర హర మహాదేవ్” అంటూ నమస్కరిస్తున్న ఏమోజీ పోస్ట్ చేస్తూ తన భావాలను వ్యక్తపరిచారు. ఇకపోతే కన్నప్ప మూవీకి ఏడాది అయిన సందర్భంగా మంచు విష్ణు షేర్ చేసిన ఈ ఎమోషనల్ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన ఈ నాటకానికి మంచు విష్ణు స్వయంగా స్క్రిప్టును అందించారు. ఇదిలా ఉండగా మరొకవైపు ఈ సినిమాను థియేటర్లలో రీ రిలీజ్ చేయడం జరిగింది. తొలుత మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా.. ఇప్పుడు ఈ రీ రిలీజ్ లో ఎలాంటి అంచనాలను అందుకుంటుందో చూడాలి.

Related News

అదే నడక.. అదే స్వాగ్.. యమదొంగను గుర్తు చేసిన తారక్!

సినిమా మీద సినిమా.. ఫలితం మాత్రం అదే! కయాదు కష్టాలు కంటిన్యూ

డ్రాగన్ కోసం వెయిటింగ్.. ఎన్టీఆర్ సినిమా జక్కన్న కామెంట్స్!

‘ఏష నాగుల కట్ట’ పాటతో ఫేమస్.. జంగి రెడ్డి పారితోషికం ఎంతో తెలిస్తే షాక్!

సాయి పల్లవి ఫస్ట్ మూవీ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

AI కంపెనీకి  షాక్ ఇచ్చిన ఊర్వశి రౌతేలా.. రూ. 7 వేల కోట్ల దావా!

ప్యారడైజ్ ప్యాకప్ అయినట్టేనా?

తేజ సజ్జా ‘ ది ట్రైటర్స్ ‘ రియాలిటీ షో కోసం కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్!

Big Stories

Advertisement
×