BigTV English

Kannappa Movie : శివయ్యా… కన్నప్ప కలెక్షన్స్ పోస్టర్స్ ఏవి ?

Kannappa Movie : శివయ్యా… కన్నప్ప కలెక్షన్స్ పోస్టర్స్ ఏవి ?

Kannappa Movie : మంచు విష్ణు కెరీర్‌లోనే భారీ మూవీ కన్నప్ప. ఈ మూవీ ఈ నెల 27న గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఒక్కో ఏరియాలో ఒక్కో రకమైన టాక్‌ను సొంతం చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద డల్ ఫర్ఫామెన్స్ కొనసాగిస్తుంది. మూవీ ఫస్టాఫ్ వీక్ గా ఉండటం, మూడు గంటలకు పైగా సినిమా నడివి ఉండటం వల్ల ఆడియన్స్ థియేటర్స్ వరకు రాలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య కన్నప్ప మూవీ ఫస్ట్ వీకెండ్ రన్‌ను కంప్లీట్ చేసుకుంది. ఈ ఫస్ట్ వీకెండ్ తర్వాత పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం…


కన్నప్ప మూవీని నిర్మించడానికి మంచు విష్ణు దాదాపు 300 కోట్ల వరకు ఖర్చు చేశాడట. ఇక ఈ సినిమాకు 160 కోట్ల వరకు అయిందని టాక్. ఇవి రిటర్న్ రావాలంటే, దాదాపు 80 కోట్ల వరకు షేర్ రావాలి. 160 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు రావాలి.

సినిమా రిలీజ్ అయి మూడు గడిచిపోయింది. సినిమాకు రన్‌కు ఎంతో కీలకమైన ఫస్ట్ వీకెండ్ అయిపోయింది. కానీ, ఇప్పటి వరకు కన్నప్ప కలెక్షన్లపై మంచు విష్ణు ఒక్క అనౌన్స్‌మెంట్ కూడా ఇవ్వలేదు. అలాగే ఒక్క పోస్టర్‌ను కూడా రిలీజ్ చేయలేదు.


సాధారణంగా మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ మూవీని నిర్మించిన ప్రొడ్యూసర్సే కలెక్షన్ల పోస్టర్స్ ను రిలీజ్ చేస్తారు. అలాంటిది ఇప్పుడు కన్నప్ప మూవీకి మాత్రం జరగడం లేదు. కానీ, మూవీ రిలీజ్ అయిన రోజు కన్నప్ప ఇండస్ట్రీ హిట్ అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇండస్ట్రీ హిట్ అంటే, తెలుగు ఇండస్ట్రీలోనే హైయెస్ట్ కలెక్షన్లు వచ్చిన మూవీ అన్నమాట.

అసలు కలెక్షన్ల పోస్టర్లే రిలీజ్ చేయడం లేదు. పైగా మొదటి రోజు పూర్తి అవ్వకముందే ఇండస్ట్రీ హిట్ ఎలా అయింది అంటూ ట్రోల్స్ వచ్చాయి. దీని తర్వాత మూవీకి సంబంధించి కలెక్షన్ల పోస్టర్లు గానీ, బ్లాక్ బస్టర్ హిట్ అనే పోస్టర్లు కానీ, రావడం లేదు.

అయితే, కలెక్షన్లను అఫిసియల్‌గా అనౌన్స్ మెంట్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటో ఇంత వరకు అర్థం అవ్వడం లేదు. ఇండస్ట్రీ హిట్ అని చాలా కాన్ఫిడెంట్‌గా పోస్టర్ రిలీజ్ చేసిన మంచు విష్ణు… రోజు వారి కలెక్షన్లను మాత్రం ఎందుకు రిలీజ్ చేయలేకపోతున్నాడు అనే క్వశ్చన్స్ వస్తున్నాయి.

వచ్చే కలెక్షన్లను పోస్టర్ వేసి రిలీజ్ చేస్తే పరువు మొత్తం పోతుందని, అందుకే కలెక్షన్ల పోస్టర్లు రిలీజ్ చేయడం లేదు అంటూ సోషల్ మీడియాలో జోక్స్ పేలుతున్నాయి.

కాగా, బయట నుంచి అందుతున్న సమాచారం ప్రకారం… కన్నప్ప మూవీ మొదటి మూడు రోజులు అంటే ఫస్ట్ వీకెండ్ 23.7 కోట్ల వరకు షేర్ వాల్యూ కలెక్ట్ చేసిందని తెలుస్తుంది. ఈ మూవీ సేఫ్ సైడ్ అవ్వాలంటే కనీసం 80 కోట్ల వరకు కలెక్షన్లు రావాలి. ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్లు 23.7 కోట్లు. అంటే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే, డిజాస్టర్ మాట మూటగట్టుకోవద్దు అంటే 56.3 కోట్ల షేర్ వసూళ్లు రావాలి. ఇలాంటి పరిస్థితుల్లో అది సాధ్యమా..? అంటే అది ఆ శివయ్యకే తెలుసు.

Related News

Tollywood Films: స్ట్రైక్ ఎండ్ అయితే సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీ గా ఉన్న సినిమాలివే

Anushka Shetty: అనుష్క మార్కెట్ రూ. 25 కోట్లలోపే… యంగ్ హీరోయిన్ బెటర్ కదా..

Keerthy Suresh: Ai తెచ్చిన తంటా, ఏకంగా మహానటికే బట్టలు లేకుండా చేశారు

Mega Blast Glimpse : విశ్వంభర గ్లిమ్స్ అవుట్, ఇక ట్రోలింగ్ కు ఆస్కారమే లేదు

Tvk Mahanadu : TVK మహానాడు లో తొక్కిస‌లాట… స్పాట్ లోనే 400 మంది?

Thalapathy Vijay : విఎఫ్ఎక్స్ లేదు, సిజి లేదు. విచ్చలవిడిగా జనం

Big Stories

×