Janhvi kapoor: ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi kapoor) తాజాగా మీడియాపై మండిపడుతూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే “కాంటా లగా” ఫేమ్ షెఫాలీ జరీవాలా (Shefali Jariwala) 42 సంవత్సరాల ప్రాయంలో అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందడం అందరిని కలచి వేస్తోంది. గుజరాత్ కు చెందిన ఈమె.. అనేక హిందీ మ్యూజిక్ షోలు, రియాల్టీ షో లతో పాటు కొన్ని సినిమాలలో కూడా నటించింది.
షెఫాలీ జరీవాలా కెరియర్..
ముఖ్యంగా సల్మాన్ ఖాన్ (Salman Khan), అక్షయ్ కుమార్ (Akshay Kumar) మల్టీస్టారర్ గా వచ్చిన ‘ముజ్ సే షాదీ కరోగీ’ (2004) సినిమాలో కూడా నటించింది. ఇక 2004లో సంగీత కళాకారుడు హర్మీత్ సింగ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈమె.. 2009లో అతడితో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2017లో ప్రముఖ నటుడు పరాగ్ త్యాగి తో ఏడడుగులు వేసింది. ఇక 2000 సంవత్సరం మొదట్లో కాంటాలగా అనే పాటతో ఒక్కసారిగా ఈమె కెరియర్ యూ టర్న్ తీసుకుంది. అంతేకాదు ఈ పాటతో భారీ పాపులారిటీ కూడా అందుకుంది. ఇక గతంలో తాను చనిపోయే వరకు “కాంటా లగా గర్ల్” గానే కొనసాగాలని ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే.
మీడియా ప్రవర్తనపై వరుణ్ కి అండగా జాన్వీ ఫైర్..
అలా ఎంతో ఫేమ్ సొంతం చేసుకొని అభిమానుల మనసును దోచుకున్న ఈమె.. ఇలా హఠాత్తుగా గుండెపోటుతో మరణించడాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. పలువురు సెలబ్రిటీలు, అభిమానులు ఈమె మరణానికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అలా సినీ పరిశ్రమ అంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంటే..ఆమె అంత్యక్రియల సమయంలో మీడియా ప్రవర్తించిన తీరుపైనే ఇప్పుడు జాన్వీ కపూర్ అసహనం వ్యక్తం చేసింది. షెఫాలీ మృతదేహాన్ని పదే పదే చూపిస్తూ.. స్మశాన వాటిక నుండి లైవ్ కవరేజ్ చేసిన విధానాన్ని కూడా ఆమె తప్పు పట్టారు. ఈ క్రమంలోనే వరుణ్ ధావన్ (Varun Dhawan) చేసిన పోస్టును ఆమె షేర్ చేస్తూ..” వ్యక్తిగత విషాదాలలో ప్రైవసీ అవసరమని, మరణించిన వారిపట్ల గౌరవభావం చూపించాలని పరిశ్రమలు చాలామంది కోరుకుంటున్నామని.. కనీసం మానవత్వం కూడా లేకుండా పోయింది” అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
షెఫాలీ జరీవాలా మరణం.. మీడియాపై వరుణ్ ధావన్ ఆగ్రహం..
వరుణ్ ధావన్ పోస్ట్ విషయానికి వస్తే.. తన సోషల్ మీడియా ఖాతా ద్వారా..” ఒక కుటుంబం తమ ప్రియమైన వారిని కోల్పోయి దుఃఖంలో ఉంటే.. వారి బాధను ఇలా వీడియోలుగా మార్చుకొని వాటిని ప్రచారం చేయాల్సిన అవసరం ఏముంది? మీడియా తీరు వల్ల అంత్యక్రియల సమయంలో ఆ కుటుంబం ఎంత అసౌకర్యానికి గురైందో మీకు అసలు తెలుస్తోందా?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇదే పోస్ట్ ని జాన్వి కపూర్ షేర్ చేస్తూ మీడియాపై మండిపడింది. జాన్వి కపూర్ షేర్ చేసిన ఈ పోస్ట్ కి పలువురు సెలబ్రిటీలు మద్దతు పలుకుతున్నారు.. చనిపోయిన వారిపట్ల మీడియా ఇలా కవరేజ్ చేయడం ఏమాత్రం సమంజసం లేదు అని.. ముఖ్యంగా ఇలాంటి వార్తలు రాయడం వల్ల ఆ కుటుంబం ఎంత నరకం అనుభవిస్తుందో కాస్త ఆలోచించాలని కామెంట్లు చేస్తున్నారు. మరి ఇప్పటికైనా మీడియా ఇలాంటి విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉంటుందేమో చూడాలి అని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
ALSO READ:Dilraju Biopic: తెరపైకి దిల్ రాజు బయోపిక్.. హీరో కూడా ఫిక్స్.. పూర్తి వివరాలివే!