Director Dead In Plane Crash: గుజరాతి ఫిలిం డైరెక్టర్ కథనం విషాదంతో ముగిసింది. ఇటీవల అహ్మదాబాద్ లో చోటు చేసుకున్న విమాన ప్రమాదంలో(Plane Crash) ఫిలిం డైరెక్టర్ మృతి చెందినట్లు అధికారకంగా ప్రకటించారు. అయితే ఈయన ఆ విమానంలో ప్రయాణం చేయకపోయినా విమాన ప్రమాదంలో మరణించినట్టు తెలుస్తుంది. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన జూన్ 12వ తేదీ జరిగిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా(Air India) విమానం ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ అయినా కొన్ని సెకండ్లకే పక్కనే ఉన్నటువంటి ఒక మెడికల్ హాస్టల్ భవనంపై కూలిపోయిన విషయం తెలిసిందే.
ముగిసిన డైరెక్టర్ మిస్సింగ్ కేస్..
ఇక ఈ ప్రమాద ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న ఒక్క ప్రయాణికుడు మినహా మిగిలిన ప్రతి ఒక్కరు చనిపోయారు. అలాగే హాస్టల్ భవనంలో భోజనం చేస్తున్న మెడికల్ విద్యార్థులతో పాటు ఆ పరిసర ప్రాంతాలలో ఉన్నవారు కూడా మరణించినట్టు తెలుస్తుంది. అయితే ఈ విమాన ప్రమాదం జరిగిన రోజు నుంచి గుజరాతి ఫిల్మ్ డైరెక్టర్ మహేష్ జీరావాలా (Mahesh Jirawala)కూడా కనిపించకుండా పోయారు. దీంతో ఈయన ఏమైపోయారని సందేహం అందరిలోనూ కలిగింది. అయితే డైరెక్టర్ మహేష్ భార్య హేతల్(Hethal) విమానం కూలిపోయిన రోజే తన భర్త ఎయిర్ పోర్ట్ వద్ద ఎవరినో కలవడానికి వెళ్లారని ఆమె తెలిపారు.
విమాన ప్రమాదంలో డైరెక్టర్ మృతి…
ఇలా మహేష్ అదే రోజు ఎయిర్ పోర్టు వద్దకు వెళ్లారనే విషయం తెలుసుకున్న పోలీసులు ఆ విమాన ప్రమాదం జరిగినచోట అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అక్కడ తన ఫోన్ తో పాటు తన వ్యాలెట్, బండి కూడా ఉన్న నేపథ్యంలో మహేష్ సైతం ఆ విమాన ప్రమాదంలో మరణించినట్లు అధికారులు తెలియజేశారు. కానీ ఈ విషయాన్ని మహేష్ కుటుంబ సభ్యులు మాత్రం అంగీకరించలేకపోయారు. ఆ మృతదేహం తన భర్తది కాదని, ఆరోజు నా భర్త అక్కడికి వెళ్తున్నారని చెప్పారు కానీ, వెళ్ళకపోయి ఉండవచ్చు కదా? అంటూ కూడా వారు మహేష్ మరణాన్ని అంగీకరించలేకపోయారు. దీంతో అధికారులు డిఎన్ఏ పరీక్షలు(DNA test) నిర్వహించారు.
డిఎన్ఏ టెస్టులు…
ఇలా విమాన ప్రమాదంలో మహేష్ మరణించడంతో ఆయన మృతదేహానికి డిఎన్ఎ పరీక్షలు నిర్వహించగా ఆడియన్ రిపోర్ట్స్ ను మహేష్ కుటుంబ సభ్యుల డీఎన్ఏ తో పోల్చి చూడడంతో రెండు మ్యాచ్ అయ్యాయి దీంతో మహేష్ మిస్సింగ్ మిస్టరీ వీడింది. విమాన ప్రమాద సమయంలో ఆయన చెప్పిన విధంగానే ఎయిర్ పోర్ట్ వద్దకు ఎవరినో కలవడానికి వెళ్లారని, అదే సమయంలో ఫ్లైట్ క్రాష్ కావడంతో ఆ ప్రమాదంలో ఈయన కూడా చనిపోయారని నిర్ధారించారు. ఇక మహేష్ కెరియర్ విషయానికి వస్తే ఈయన గుజరాతి సినీ ఇండస్ట్రీలో పలు సినిమాలకు దర్శకత్వం వహించడమే కాకుండా మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఈయన విమాన ప్రమాదంలో మరణించారని విషయం తెలియగానే అభిమానులు షాక్ అవుతూ సోషల్ మీడియా వేదికగా ఈయన మరణం పై స్పందిస్తూ నివాళులు అర్పిస్తున్నారు.
Also Read: కుబేర రన్ టైం… నా కంటే మీకే ఎక్కువ తెలుసా ? శేఖర్ కమ్ముల ఫైర్