BigTV English

Shubman Gill : గిల్ అద్భుతమైన సెంచరీ… ఫోన్ చేసిన సారా టెండూల్కర్

Shubman Gill : గిల్ అద్భుతమైన సెంచరీ… ఫోన్ చేసిన సారా టెండూల్కర్

Shubman Gill : టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య సచిన్ టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీని భారత్ ఘనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. 5 టెస్టుల సిరీస్ మొదటి మ్యాచ్ లో మొదటిరోజు బ్యాటింగ్ తో టీమిండియా అదరగొట్టింది. సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్ రిటైర్మెంట్ అయిన విషయం తెలిసిందే. కొత్త కెప్టెన్.. అనుభవం లేని జట్టు ఇంగ్లాండ్ లో ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందోనని అందరూ భావించారు. కానీ వారి ఊహలను దరి చేరకుండా టీమిండియా బ్యాటర్లు రెచ్చిపోయారు. కెప్టెన్ శుబ్ మన్ గిల్ సెంచరీ చేశాడు. 147 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు గిల్. మరోవైపు ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా సెంచరీ చేసాడు. అలాగే వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ కూడా రెండో రోజు సెంచరీ చేశాడు. రిషబ్ పంత్ సెంచరీ చేయడంతో వెను వెంటనే టీమిండియా తడబడింది. గిల్ 147 పరుగుల వద్ద ఎప్పుడైతే ఔట్  అయ్యాడో అప్పటి నుంచి టీమిండియా బ్యాటర్లంతా వరుస కట్టారు. కేవలం 41 పరుగుల వ్యవధిలోనే 7 వికెట్లు కోల్పోవడం గమనార్హం.


Also Read : Rishabh Pant : గ్రౌండ్ లో పంత్ జిమ్నాస్టిక్స్… బ్యాటు, బూట్లు వదిలేసి చుక్కలు చూపించాడుగా

శుబ్ మన్ గిల్ ఇంగ్లాండ్ పై తొలి టెస్ట్ లో సెంచరీ చేయడంతో సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ ఫోన్ చేసినట్టు సమాచారం. ముఖ్యంగా సోషల్ మీడియాలో రకరకాలుగా మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు కొందరూ నెటిజన్లు. గిల్ సెంచరీ.. సారా ఫోన్.. మరోవైపు మొన్న సచిన్ టెండూల్కర్ కూడా గిల్ పై నమ్మకంతో గిల్ అద్భుతంగా రాణిస్తాడు.. అలాగే జట్టును నడిపిస్తాడని పేర్కొన్నాడు. దీంతో సోషల్ మీడియాలో గిల్, సారా టెండూల్కర్ పై ట్రోలింగ్స్ చేయడం విశేషం. టీమిండియా టెస్ట్ కెప్టెన్ గా శుబ్ మన్ గిల్ తన తొలి మ్యాచ్ లోనే సత్తా చాటాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో గిల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఇంగ్లాండ్ గడ్డ పై తొలి టెస్టులోనే సెంచరీ కావడం విశేషం. కెప్టెన్ గా గిల్ ఎంపిక చేయడాన్ని విమర్శించిన నోళ్లే ఇప్పుడు శభాష్ అంటున్నాయి.


తొలుత కెప్టెన్ గా గిల్ ను వ్యతిరేకించిన భారత క్రికెటర్ సంజయ్ మంజ్రెకర్ ఇప్పుడు ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ మ్యాచ్ లో గిల్ అద్భుతమైన టెక్నిక్ తో బ్యాటింగ్ చేశాడని.. కొనియాడారు ముంజ్రెకర్. కొద్ది రోజుల కిందటే భారత టెస్ట్ కెప్టెన్ గా గిల్ ను ఎంపిక చేయడాన్ని గిల్ కంటే జస్ప్రిత్  బుమ్రా కే కెప్టెన్సీ గా బెటర్ అని అభిప్రాయపడ్డాడు. శుబ్ మన్ గిల్ తన బ్యాటింగ్ లో టెక్నికల్ లోపాలను సరిదిద్దు కున్నాడు. అందుకే విదేశీ గడ్డ పై భారీ సెంచరీ సాధించగలిగాడు. కానీ ఈ మ్యాచ్ లో సాయి సుదర్శన్, కరుణ్ నాయర్ అట్టర్ ఫ్లాప్ అయ్యారు. వీరిద్దరూ కూడా డకౌట్ కావడం గమనార్హం. దాదాపు తొమ్మిదేళ్ల తరువాత టీమిండియాలోకి వచ్చిన కరుణ్ నాయర్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ కి చేరాడు. మరోవైపు ఇంగ్లాండ్ బౌలర్లు కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారు. అయితే ప్రస్తుతం గిల్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేయడం విశేషం.

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×