BigTV English

Danush: ఆ ఇద్దరి బయోపిక్ చేయటమే నా కోరిక.. ఇన్నాళ్లకు బయటపెట్టిన ధనుష్!

Danush: ఆ ఇద్దరి బయోపిక్ చేయటమే నా కోరిక.. ఇన్నాళ్లకు బయటపెట్టిన ధనుష్!

Danush: కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ట్ హీరోగా కొనసాగుతున్న వారిలో నటుడు ధనుష్(Danush) ఒకరు. ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో ఈయన నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడుగా నిర్మాతగా మంచి సింగర్ గా కూడా పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. తమిళ చిత్ర పరిశ్రమలో ఈయనకు ఎలాంటి ఆదరణ ఉందో తెలుగులో కూడా అదే స్థాయిలో ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇదివరకు ధనుష్ నటించిన సినిమాలు తెలుగులో ప్రేక్షకుల ముందుకు వచ్చేవి కానీ ఇటీవల కాలంలో ధనుష్ నేరుగా తెలుగు సినిమాలలో నటిస్తూ ఇక్కడ కూడా తన హవా కొనసాగిస్తున్నారు.


ఇప్పటికే సార్ (Sir) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ కొట్టిన ధనుష్ తాజాగా కుబేర (Kuberaa)సినిమాతో మరో హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమా ఎంతో మంచి విజయం సొంతం చేసుకోవడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవల ధనుష్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన తన వ్యక్తిగత విషయాల గురించి అలాగే కెరియర్ కి సంబంధించిన విషయాల గురించి కూడా మాట్లాడారు.

అమ్మాయి కోసం..


తల్లితండ్రులు మమ్మల్ని చదివిస్తున్నప్పుడు వారు ఎంత కష్టపడుతున్నారో నాకు తెలియదు కానీ ఇప్పుడు నా పిల్లల్ని చదివించడం కోసం నేను పడుతున్న కష్టం చూస్తుంటే తల్లిదండ్రుల కష్టం గుర్తొస్తుందని తెలిపారు. ఇక స్కూల్ సమయంలో నన్ను చదువుకోమని పంపిస్తే నేను మాత్రం ఒక అమ్మాయి కోసం ఏకంగా ట్యూషన్ లో జాయిన్ అయ్యానని అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు. ట్యూషన్ వెళ్లే అమ్మాయిని చూస్తూ ఉండేవాడిని టీచర్ ఏం అడిగినా చెప్పేవాన్ని కాదు నాకే సిగ్గుగా అనిపించి ట్యూషన్ మానేశాను. అయితే అమ్మాయి కోసం మాత్రం బయట ఎదురు చూస్తూ ఉండే వాడినని తెలిపారు.

ఇటాలియన్ మోడల్..

ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో తాను అవమానాలను ఎదుర్కొన్నాను అని తెలిపారు. నన్ను చూసి వీడు హీరో ఏంటి అని చాలామంది అవమానించారు. ఆ సమయంలో తాను ఎంతో బాధపడ్డాను. అయితే నన్ను మాత్రం డైరెక్టర్ బాలు మహేంద్ర గారు చాలా ప్రోత్సహించారు. నువ్వు ఒక ఇటాలియన్ మోడల్ లాగా ఉంటావు.. ఎప్పుడు కూడా నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు అంటూ ప్రోత్సహించారని ఆయన మాటలు నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయని తెలిపారు.

రజనీకాంత్ బయోపిక్..

ఇక సినిమా ఇండస్ట్రీలో హీరోగా నేను నటిస్తున్నాను కానీ కెమెరా ముందుకు వచ్చి ఏదైనా వేదికపై మాట్లాడాలి అంటే అసలు సాధ్యం కాదని తనకు కాస్త మొహమాటం కూడా ఉందనే విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఇక కెరియర్ విషయానికి వస్తే ఎన్నో విభిన్న సినిమాలలో నటించిన ధనుష్ తనకి ఎంతో ఇష్టమైన రజినీకాంత్ (Rajinikanth)గారు, ఇళయరాజా(Ilaiyraja) గారి బయోపిక్ సినిమాలో చేయాలని ఉందని తన మనసులో కోరికను ఈ సందర్భంగా బయటపెట్టారు. మరి ఇద్దరి బయోపిక్ సినిమా చేసే అవకాశం ధనుష్ కి వస్తుందా? ఆయన కోరిక నెరవేరుతుందా అనేది తెలియాల్సి ఉంది.

Also Read:  PuriJagannadh -Bucchibabu: డైరెక్టర్ పూరితో బుచ్చి బాబుకు అలాంటి రిలేషన్ ఉందా.. ఇన్నాళ్లు తెలియనే లేదే? 

Related News

Manchu Manoj: మనోజ్ ఇంట్లో కృష్ణాష్టమి వేడుకలు.. చాలా రోజులైంది భయ్యా ఇలా చూసి!

Actress Girija: గుర్తుపట్టలేని స్థితిలో నాగార్జున హీరోయిన్… ఇలా తయారయ్యింది ఏంటీ?

Lokesh Kanagraj: తెలుగులో రికార్డు సృష్టించిన లోకేష్ కనగరాజ్ .. మొదటి సినిమాగా కూలీ!

Kangana Ranaut: సహజీవనంపై కంగనా హాట్ కామెంట్స్.. గర్భం వస్తే ఎవరిది బాధ్యత?

Tollywood Producer: ఒకేసారి 15 సినిమాలకు కమిట్ అయిన నిర్మాత.. రికార్డుల కోసం రిస్క్ అవసరమా?

Ram Gopal Varma: నాన్న జన్మనిస్తే.. నాగార్జున రెండో జీవితాన్ని ఇచ్చారు.. వర్మ ఎమోషనల్ !

Big Stories

×