Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)ఎంతోమంది అమ్మాయిల కలల రాకుమారుడనే విషయం అందరికీ తెలిసిందే. మహేష్ బాబు ఐదు పదుల వయసులో ఉన్నప్పటికీ పాతికేళ్ల కుర్రాడిలా ఎంతో హ్యాండ్సమ్ గా ఉన్న నేపథ్యంలో మహేష్ బాబుకు విపరీతమైన అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.. కేవలం సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా మహేష్ బాబు అంటే క్రష్ అని ఎన్నో సందర్భాలలో బయటపెట్టారు. తాజాగా ఓ బుల్లితెర నటి సైతం మహేష్ బాబు పై తనకు ఉన్నటువంటి ఫీలింగ్స్ పెట్టారు. మరి మహేష్ బాబు పై మనసు పారేసుకున్న ఆ బుల్లితెర నటి ఎవరు? ఏంటీ? అనే విషయానికి వస్తే…
స్టార్ మా పరివారం…
బుల్లితెరపై ప్రతివారం ఎన్నో కార్యక్రమాలు ప్రసారం అవుతూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే స్టార్ మాలో శ్రీముఖి (Sreemukhi) యాంకర్ గా వ్యవహరిస్తున్న ఆదివారం విత్ స్టార్ మా పరివారం (Aadivaaram With Star Maa Parivaram) కార్యక్రమం కూడా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ప్రతివారం బుల్లితెర నటీనటులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రేక్షకులకు కావలసిన వినోదాన్ని అందిస్తున్నారు. ఇకపోతే ఈ ఆదివారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా బుల్లితెర నటి ప్రేరణ (Prerana)కూడా పాల్గొన్నారు. ఇక వీరందరితో కలిసి శ్రీముఖి ఎప్పటిలాగే సరదాగా ఆటలు ఆడిస్తూ సందడి చేశారు.
నమ్రత లాగా…
ఇక శ్రీముఖి ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లకు ఒక టాస్క్ ఇచ్చారు మీరు ఎప్పుడైనా నేను అబ్బాయి లాగా పుట్టింటే వారిలా పుట్టాలి, లేదా అమ్మాయిలాగా పుట్టి ఉంటే ఇలా పుట్టాలని అనుకున్నారా? అంటూ ఒక్కొక్కరిని ప్రశ్నించారు. ఇక ప్రేరణ మాత్రం నేనైతే నమ్రత(Namrata) లాగా పుట్టాలని కోరుకుంటాను అంటూ షాకింగ్ సమాధానం ఇచ్చారు. మహేష్ బాబు అంటే తనకు చాలా ఇష్టమని అందుకే నమ్రతలాగ పుట్టి ఉంటే మహేష్ బాబుని పెళ్లి చేసుకునే దాన్ని అంటూ తన మనసులో కోరికను బయట పెట్టేశారు. ఇక శ్రీపాద్ కూడా మహేష్ బాబు లాగా ఉంటారని తనని పెళ్లి చేసుకున్నాను అంటూ అసలు విషయం బయట పెట్టారు.
ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వామ్మో ప్రేరణను వదిలేస్తే ఏకంగా నమ్రతకు పోటీగా వెళ్లేలా ఉందే అంటూ మహేష్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రేరణ బుల్లితెర నటిగా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఒక బిగ్ బాస్ (Bigg Boss)కార్యక్రమంలో పాల్గొన్న ఈమె మరింతమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. బిగ్ బాస్ తర్వాత ఎలాంటి సీరియల్స్ చెయ్యకపోయినా, బుల్లితెర కార్యక్రమాలతో మాత్రం బిజీబిజీగా గడుపుతున్నారు. ఇటీవల తన భర్త శ్రీ పాద్ తో కలిసి ఇస్మార్ట్ జోడిలో పాల్గొనడమే కాకుండా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.
Also Read: Kannappa Ott Release: కన్నప్ప ఓటీటీ రిలీజ్ అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన విష్ణు!