Actor Suicide..సినీ ఇండస్ట్రీలో మరోసారి విషాద ఛాయలు అలుముకున్నాయి. అర్ధాంతరంగా ఒక నటుడు ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అసలు విషయంలోకెళితే ప్రముఖ మరాఠీ సినిమా, టెలివిజన్ నటుడు తుషార్ ఘడిగావ్కర్(Tushar ghadigaonkar ) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రస్తుతం ఆయన వయసు 32 సంవత్సరాలు కావడం గమనార్హం. పని సంబంధిత ఒత్తిడి, సినిమా అవకాశాలు లేకపోవడంతో డిప్రెషన్ లోకి వెళ్లినట్టు సమాచారం. ఫలితంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. తుషార్ ఆత్మహత్య చేసుకున్నాడు అన్న విషయం తెలియగానే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. తుషార్ అకాల మరణం ఇండస్ట్రీలో దిగ్భ్రాంతిని కలిగించింది. ఇకపోతే తుషార్ మరాఠీ సినిమా ఇండస్ట్రీలోనే కాదు టెలివిజన్ నాటక రంగంతో పాటు వివిధ మాధ్యమాలలో కూడా పనిచేశారు. ఈయన మరణంతో అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
తుషార్ సినిమాలు:
తుషార్ తన కెరియర్లో ‘లవంగి మిర్చి’, ‘మాన్ కస్తూరి రే’, ‘సుకచ్య సారిని హే మాన్ బవరే’ వంటి అనేక మరాఠీ టీవీ సీరియల్స్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు పోషించారు. సీరియల్స్ లోనే కాదు సినిమాలలో కూడా నటించారు. అలా ‘బౌబలి’, ‘ఉనాధ్’, ‘జాంబివిలీ’వంటి సినిమాలలో కూడా నటించారు. అంతేకాదు ‘సంగీత్ బబిత్ ఆక్యన్’ అనే నాటకంలో కూడా నటించారు. ఇటీవల సన్ మరాఠీ ఛానల్లో ‘సఖా మజా పాండురంగ్’ అనే టీవీ షోలో కూడా తన ప్రదర్శన కనబరిచారు.
తుషార్ కుటుంబ నేపథ్యం..
తుషార్ కుటుంబ నేపథ్యం విషయానికి వస్తే సింధు దుర్గ్ జిల్లాలోని కాంకావాలికి చెందినవారు. రూపరెల్ కళాశాలలో చదువుతున్నప్పుడే నటన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అలా కళాశాల నాటక విభాగంలో చేరారు. ఇక ఈయన స్నేహితులు ఈయనను ముద్దుగా ‘ఘడ్య’ అని పిలుస్తారట. ఇక ఈయన అకాల మరణం మరాఠీ వినోద ప్రపంచంలో తీరని లోటును మిగిల్చింది.
తుషార్ మరణం పై నటుడు అంకుర్ ఆవేదన..
తుషార్ మరణ వార్త విని ప్రముఖ సినీ నటుడు ఆయన స్నేహితుడు అంకుర్ వాధనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఫేస్బుక్లో తన బాధను వ్యక్తం చేశారు.” మిత్రమా.. ఎందుకు? దేనికోసం నువ్వు ఆత్మహత్య చేసుకున్నావు? పని అనేది వస్తుంది.. పోతుంది.. మనం ఒక కొత్త మార్గాన్ని కనుక్కోవాలి. అంతే తప్ప ఆత్మహత్య సమాధానం కాదు ” అంటూ ఆయన రాసుకొచ్చారు. సవాలుతో కూడిన పరిస్థితులను అంగీకరించాడు. కానీ ఈ నిర్ణయం సరైనది కాదు అని ఆయన తెలిపారు. ఒక ప్రస్తుతం తుషార్ మరణ వార్త అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.
ALSO READ: Jabardasth Emmanuel: కమెడియన్‌కు ఘోర అవమానం.. పాపం షో మధ్యలోనే గుక్కపెట్టి ఏడ్చాడు!