Fake News : ఫేక్ ఫేక్ ఫేక్. ఇప్పుడు ఎక్కడ చూసిన ఫేక్ న్యూసే. బ్రేకింగ్ న్యూస్ అంటూ షాకింగ్ కంటెంట్ పెడుతుంటారు. అది చూసి ఉలిక్కిపడాల్సిందే. నటుడు కోటా శ్రీనివాసరావు చనిపోయారంటూ ఇప్పటికి ఎన్నిసార్లు ఫేక్ న్యూస్ వైరల్ చేశారో వెధవలు. ఇలాంటివి రోజులో పదుల సంఖ్యలో కనిపిస్తుంటాయి. యుద్ధం లాంటి ఏదైనా మేజర్ న్యూస్ ఉంటే ఇక పండగ చేసుకుంటారు ఫేక్‌గాళ్లు. ఆ విమానం కూలింది.. ఇంతమంది సైన్యం చనిపోయారంటూ శత్రుదేశం గురించి తప్పుడు సమాచారం ప్రచారం చేస్తుంటారు. ఇక సెలబ్రెటీస్ గురించి వచ్చినన్ని ఫేక్ వార్తలు మరెవరి మీదా రావు. ఆ హీరోయిన్‌కు అలా అయింది.. ఈ హీరో ఇలా చేశాడంటూ.. వ్యూస్ కోసం, పైశాచిక ఆనందం కోసం పిచ్చిపిచ్చి పోస్టులు తెగ పెట్టేస్తుంటారు. అమ్మాయిల విషయంలోనూ చెండాలపు ట్రోలింగ్ చేస్తుంటారు. ఈ బురదను మత విషయాలకు సైతం అంటిస్తున్నారు. ఇక పొలిటికల్ వార్‌లో ఫేక్ న్యూస్‌దే అప్పర్‌హ్యాండ్. తెలంగాణలో బీఆర్ఎస్.. ఏపీలో వైసీపీ.. ఫేక్ కంటెంట్‌తోనే బతికేస్తోందనే రాజకీయ విమర్శ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే.. ప్రస్తుత ప్రపంచమంతా ఫేక్ న్యూస్‌తోనే బతికేస్తోంది. పొద్దు్న్నుంచి రాత్రి వరకు మనం తెలుసుకునే విషయాల్లో సగానికి పైగా అసత్యాలే ఉండొచ్చనేది కాదనలేని వాస్తవం. అందుకే, ఇలాంటి ఫేక్ న్యూస్‌కు, ఫేక్ గాళ్లకు చెక్ పెట్టేందుకు ముందుకొచ్చింది ప్రభుత్వం. త్వరలో కొత్త బిల్లు తీసుకొచ్చేందుకు సిద్ధమైంది.
7 ఏళ్లు జైలు.. రూ.10 లక్షలు జరిమానా..
ఫేక్ న్యూస్, మహిళలపై అసభ్య పోస్టులు, సనాతన చిహ్నాలు, మత విషయాల్లో తప్పుడు వార్తలకు చెక్ పెట్టేలా.. నకిలీ వార్తల నిషేధ బిల్లు (Fake News Prohibition Bill) 2025.. ద్వేషపూరిత ప్రసంగం మరియు ద్వేషపూరిత నేరాల నివారణ బిల్లు (Hate Speech and Hate Crime Prevention Bill ) 2025 అనే రెండు రకాల బిల్లులను తీసుకురాబోతున్నారు. ఫేక్ వార్తలను పోస్ట్ చేసినందుకు దోషులుగా తేలితే.. ఏకంగా 7 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ.10 లక్షల వరకు జరిమానా.. లేదంటే రెండింటినీ విధించే అవకాశం ఉంటుంది. కామెడీ, వ్యంగ్యం, పేరడీ ఇలా ఏ పేరుతో ఓవరాక్షన్ చేసినా తాట తీసేలా కఠినంగా బిల్లు రూపొందిస్తున్నారు.
సోషల్ మీడియా సంస్థలకూ శిక్ష
తప్పుడు వార్తలను పోస్ట్ చేసి ప్రచారం చేసిన వారితో పాటు ఆయా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పైనా చర్యలు తీసుకునేలా పదునైన చట్టాలను రెడీ చేస్తున్నారు. నకిలీ వార్తలకు అవి కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ట్విట్టర్, ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టా లాంటి సంస్థలు ఇకపై ఫేక్ కంటెంట్‌కు జవాబుదారులుగా ఉండాల్సిందే. కోర్టులు ఆదేశిస్తే.. సంబంధిత పోస్టులను వెంటనే తొలగించాల్సిందే. లేదంటే, కంపెనీలకు రెండేళ్ల వరకు జైలు శిక్ష, గరిష్టంగా రూ.25 లక్షల జరిమానా విధించే అవకాశం ఉంటుంది. కొత్త చట్టాల కింద నేరాలను విచారించడానికి ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని బిల్లు ప్రతిపాదిస్తోంది. ఆ దిశగా కర్నాటక ప్రభుత్వం ముసాయిదా బిల్లులు సిద్ధం చేసింది. అవి చట్టాలుగా మారితే.. ఇక ఫేక్ గాళ్ల ఖేల్ ఖతం. కర్నాటక స్పూర్తిగా దేశవ్యాప్తంగా ఇలాంటి చట్టాలు అమల్లోకి వచ్చే అవకాశాలు ఎక్కువే. తెలుగు రాష్ట్రాలు సైతం ఆ దిశగా అడుగులు వేసే అవకాశం ఉందంటున్నారు.