Nalgonda News: నల్గొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని నకిరేకల్ మండలంలో నోముల గ్రామంలో వివాహేతర సంబంధం నెపంతో వ్యక్తిని దారుణంగా చంపారు. గ్రామస్థులు వ్యక్తిని చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టి చంపేశారు. చుట్టు పక్కల స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ALSO READ: MECL Recruitment: టెన్త్, డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు, అప్లై చేస్తే జాబ్.. జీతం రూ.55,900
పోలీసుల వివరాల ప్రకారం.. నర్సింగ్ జానయ్య (34) అనే వ్యక్తి గ్రామంలో ఓ మహిళంలో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. అయితే ఈ విషయం మహిళ కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో జానయ్యను చెట్టుకు కట్టేసి కర్రలతో చితకబాదారు. దారుణం కొట్టారు. తీవ్ర గాయాలపాలైన జానయ్యను వెంటనే నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో జానయ్య మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నాలుగు రోజుల క్రితం చిత్తూరు జిల్లాలో దారుణం..
నాలుగు రోజుల క్రితం పక్క రాష్ట్రంలో ఏపీలో మహిళను చెట్టుకు కట్టేసి అసభ్య పదజాలంతో దూషించారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. సకాలంలో అప్పు తీర్చలేదని ఓ మహిళను చెట్టుకి కట్టేశారు. కొంత మంది అసభ్య పదజాలంతో దూషించారు. గ్రామానికి చెందిన మునికన్నప్ప దగ్గర శిరీష భర్త 80వేలు అప్పుగా తీసుకున్నాడు. మూడేళ్లుగా అప్పు తిరిగి చెల్లించలేదు. పైగా శిరీష భర్త తిమ్మరయప్ప ఆరు నెలల క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. దాంతో అప్పు ఇచ్చిన కుటుంబ సభ్యులు ఆమెను చెట్టుకు కట్టేశారు. మునికన్నప్ప బంధువులు శిరీషపై దాడి కూడా చేశారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో అప్పు ఇచ్చిన వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు.
ALSO READ: Viral Video : అంతా డ్రామా.. విమానంలో 11A సీటు కోసం గొడవ.. ఆ వీడియో ఫేక్
ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్
అంతేకాదు తన కుమార్తె మధుశ్రీ వికలాంగ పింఛన్‌ను.. మూడు నెలలుగా లాక్కుంటున్నారని శిరీష ఆవేదన వ్యక్తం చేస్తోంది. కుప్పంలో మహిళపై దాడి ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడారు. నిందితుడిని అరెస్టు చేశామని సీఎం చంద్రబాబుకు ఎస్పీ చెప్పారు. నిందితులను కఠినంగా శిక్షించాలని.. మరోసారి అలాంటి ఘటనలు పునరావృతం కావొద్దని సీఎం తెలిపారు. బాధిత కుటుంబానికి అండగా ఉండాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.