Bigg Boss 9 Promo:సాధారణంగా ఏదైనా సినిమా విడుదలవుతుందంటే చాలు కచ్చితంగా ఆ సినిమా ప్రమోషన్స్ ఏ రేంజ్ లో నిర్వహిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా పబ్లిక్ లోకి సినిమాను తీసుకెళ్లడానికి కావలసిన అన్ని ప్రయత్నాలు చేస్తారు. అందులో భాగంగానే ఇప్పుడు జనాలలో మంచి పాపులారిటీ అందుకున్న రియాలిటీ షో బిగ్ బాస్. ఈ కార్యక్రమం ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుంటుందో అందరికీ తెలిసిందే. అందుకే ఇప్పుడు ఈ షోని వేదికగా చేసుకొని తమ సినిమా ప్రమోషన్స్ చేసుకుంటూ సెలబ్రిటీలు కూడా తెగ హంగామా చేస్తున్నారు.
అందులో భాగంగానే తాజాగా రష్మిక లీడ్ రోల్ పోషిస్తూ తెరకెక్కుతున్న చిత్రం ది గర్ల్ ఫ్రెండ్. నవంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టారు చిత్ర బృందం. అందులో భాగంగానే రష్మిక తో పాటు ఈ సినిమాలో లీడ్ రోల్ పోషించిన దీక్షిత్ శెట్టి కూడా బిగ్బాస్ సీజన్ 9 వేదికపై సందడి చేశారు. ప్రతి వీకెండ్ లో ఎవరో ఒకరు సెలబ్రిటీలు వచ్చి అలరిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఈ వారం రష్మిక తన ది గర్ల్ ఫ్రెండ్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా విచ్చేసి సందడి చేసింది.
ALSO READ:Prashanth Varma: ప్రశాంత్ వర్మ 100 కోట్లు ఇవ్వాలి… ఫిల్మ్ ఛాంబర్ లో నిర్మాత కంప్లైంట్
విషయంలోకి వెళ్తే.. తాజా 56వ రోజుకు సంబంధించిన మొదటి ప్రోమోని నిర్వహకులు విడుదల చేశారు. ఇందులో రష్మిక తో పాటు దీక్షిత్ శెట్టి కూడా వచ్చి సందడి చేశారు. ఇక స్టేజ్ పైకి రష్మిక రాగానే హోస్ట్ నాగార్జున మాట్లాడుతూ.. రష్మిక లాగా వచ్చావా? గర్ల్ ఫ్రెండ్ లాగా వచ్చావా అని ప్రశ్నించగా రష్మిక.. అందరి గర్ల్ ఫ్రెండ్ లాగా వచ్చాను అంటూ స్మార్ట్ గా సమాధానం ఇచ్చి ఆకట్టుకుంది. దీక్షిత్ రాగానే ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ దొరికితే నువ్వేం చేస్తావో అని ప్రశ్నించగా.. ఎలాగైనా ఆమెను సేవ్ చేసుకుంటాను అంటూ తెలిపారు. ఇక నాగార్జున మాట్లాడుతూ.. కంటెస్టెంట్స్ తో మీ ముందు నేషనల్ క్రష్మిక ఉంది. మీకు ఒక పర్ఫామెన్స్ చూపిస్తాను. రీ క్రియేట్ చేయాలి అంటూ కంటెస్టెంట్స్ తో కొన్ని సినిమాలలోని వీడియోలను చూపిస్తూ రీ క్రియేట్ చేయించారు నాగార్జున.
అందులో భాగంగానే రీతూ చౌదరి కాలు గోకుతూ డెమోన్ పవన్ చేసిన విన్యాసం అందరిని నవ్వించింది. వెంటనే పక్కనే ఉన్న ఇమ్మానియేల్ తన చేతిలో ఉన్న ప్లేటు దబిమనీ కింద పడేయడంతో దెబ్బకు బెదిరిపోయింది రష్మిక. సిగ్గుండాలి రా. యుద్ధం కూడా ఆరు తర్వాత ఆపేస్తారు. కానీ నువ్వు మాత్రం పొద్దున లేచిన దగ్గర నుంచి ఏదో ఒక రకంగా దీనిపైన దాడి చేస్తూనే ఉంటావు అంటూ తన డైలాగ్ తో అందరినీ నవ్వించారు. అలా ఒక్కొక్కరు ఒక్కో సినిమాలోని సీన్లను రీ క్రియేట్ చేసి అటు రష్మికను మెప్పించడమే కాకుండా ఈ రీ క్రియేట్ తో కంటెస్టెంట్స్ అందరూ ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు.