Viswambhara update: మొదటి సినిమాతోనే తన టాలెంట్ ప్రూవ్ చేసుకొని అద్భుతమైన పేరును సంపాదించుకున్నాడు దర్శకుడు వశిష్ట. కళ్యాణ్ రామ్ తో బింబిసారా సినిమా చేసి ఊహించని విజయాన్ని నమోదు చేసుకున్నాడు. ఈ సినిమా తర్వాత ఏకంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా సినిమా చేసే అవకాశాన్ని పొందుకున్నాడు. మెగాస్టార్ తో సినిమా చేయడానికి చాలామంది దర్శకులు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. కానీ ఆ అదృష్టం వశిష్ట కు దక్కింది.
ఈ సినిమాను మొదలు పెట్టినప్పుడు విపరీతమైన అంచనాలు ఉండేవి. చాలా ఏళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సోషియఫ్ ఫాంటసీ జోనర్ కాబట్టి అందరికీ ఒక రకమైన క్యూరియాసిటీ ఉండేది. కొంతమంది ఈ సినిమాను జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాతో కూడా పోల్చారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ రిలీజ్ అయిన తర్వాత అంచనాలు తగ్గిపోయాయి. ఎవరు ఊహించిన విధంగా దర్శకుడు వశిష్ట డిసప్పాయింట్ చేశాడు అంటూ చాలామంది కామెంట్స్ కూడా చేశారు.
విశ్వంభర అవుట్ ఫుట్ చూసిన మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల చిత్రానికి సంబంధించిన సీజీ అవుట్‌పుట్‌లో 45 నిమిషాల భాగాన్ని చూశారు. ఇది ఆయనకు బాగా నచ్చడంతో తన సంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ చిత్రానికి ఒక స్పెషల్ సాంగ్ మరియు కొన్ని రోజుల ప్యాచ్‌వర్క్ మాత్రమే మిగిలి ఉంది. ఈ స్పెషల్ సాంగ్‌కు సంగీతాన్ని భీమ్స్ (‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా మ్యూజిక్ డైరెక్టర్) అందించబోతున్నారు. ఇది రీమిక్స్ పాట కాదు, పూర్తిగా కొత్త పాట. కేజీఎఫ్‌లోని ‘గాలి గాలి’ పాటతో మెప్పించిన నటి మౌనీ రాయ్ ఈ పాటతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టబోతున్నారు. మేకర్స్ ఈ చిత్రాన్ని 2025 సెప్టెంబర్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
కొన్ని కారణాల వలన వాయిదా
వాస్తవానికి ఈ సినిమా సంక్రాంతి కానుక విడుదల చేయబోతున్నట్లు అప్పట్లో అనౌన్స్ చేశారు. అయితే అదే టైం కి రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజెర్ సినిమా కూడా సిద్ధం అవ్వడంతో ఈ సినిమాను పోస్ట్ పోన్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే వాస్తవానికి ఈ సినిమాకి సంబంధించిన పెండింగ్ వర్క్ చాలానే ఉంది. మెగాస్టార్ చిరంజీవితో సినిమా కాబట్టి కొంచెం జాగ్రత్త వహించాలి కాబట్టి టైం తీసుకుని దర్శకుడు వశిష్ట పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తున్నాడు. ఇదివరకే మెగాస్టార్ తో పనిచేసిన యంగ్ దర్శకుడు బాబి అద్భుతమైన సక్సెస్ వాల్తేరు వీరయ్య రూపంలో అందించాడు. ఇప్పుడు వశిష్ట ఏ స్థాయి సక్సెస్ అందిస్తాడో వేచి చూడాలి.
Also Read : HHVM Storyline Leaked: పవన్ కళ్యాణ్……… స్టోరీ లీక్ ..ఈ ట్విస్ట్ ఏంటీ రత్నం మామ?