BigTV English

OTT Movie : ‘కెప్టెన్ కూల్’ డాక్యుసిరీస్ అవుట్… టైమింగ్ తక్కువే… ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా ?

OTT Movie : ‘కెప్టెన్ కూల్’ డాక్యుసిరీస్ అవుట్… టైమింగ్ తక్కువే… ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా ?

OTT Movie : క్రికెట్ అభిమానులకు, ముఖ్యంగా ఎమ్మెస్ ధోనీ ఫ్యాన్స్‌కు ఒక స్ఫూర్తిదాయకమైన, ఎమోషనల్ ఎక్స్పిరియన్స్ ను ఇవ్వడానికి హాట్ స్టార్ ఓ స్పోర్ట్స్ డాక్యుసిరీస్ తో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జియోహాట్‌స్టార్ ఒరిజినల్‌గా, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథను ఒక థ్రిల్లింగ్, డ్రామాటిక్ ఫార్మాట్‌లో, ధోనీ బాల్యం నుంచి “కెప్టెన్ కూల్”గా ఎదిగిన అద్భుతమైన ప్రయాణాన్ని ఈ సిరీస్ ఏడు ఎపిసోడ్‌లలో తెరకెక్కింది. మరి ఈ సిరీస్ ను ఎక్కడ చూడవచ్చు అనే వివరాల్లోకి వెళ్తే…


హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ 

‘7 షేడ్స్ ఆఫ్ ధోనీ’ (7 shades of dhoni) జియోహాట్‌స్టార్ ఒరిజినల్ స్పోర్ట్స్ డాక్యుసిరీస్, 7 ఎపిసోడ్‌లతో, 45-60 నిమిషాల టోటల్ రన్‌టైమ్‌తో, UA 7+ రేటింగ్‌తో 2025 జులై 7న ధోనీ 44వ పుట్టినరోజు సందర్భంగా జియోహాట్‌స్టార్‌ (JioHotstar)లో రిలీజైంది. ఇది హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.


ఎపిసోడ్ 1: మహీ ది డ్రీమర్ (13 నిమిషాలు)
ఈ ఓపెనింగ్ ఎపిసోడ్ ధోనీ బాల్యాన్ని, అతని క్రీడా జీవితం ఆరంభ రోజులను చూపిస్తుంది. క్రికెట్‌కు ముందు ఫుట్‌బాల్‌లో ఆసక్తి చూపిన ధోనీ, వికెట్ కీపింగ్‌లో తన ప్రతిభను ఎలా కనుగొన్నాడో ఈ ఎపిసోడ్ లో చూడవచ్చు.

ఎపిసోడ్ 2: రాంచీ టు రైజ్ (11 నిమిషాలు)
రెండవ ఎపిసోడ్ ధోనీ ఎదుర్కొన్న సవాళ్లు, ఫెయిల్యూర్ ను అధిగమించి అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన తీరును చూపిస్తుంది.

ఎపిసోడ్ 3: కెప్టెన్ ఆఫ్ యంగిండియా (15 నిమిషాలు)
2007 టీ20 వరల్డ్ కప్ విజయం, ధోనీ కెరీర్‌లో ఒక మలుపు. ఈ ఎపిసోడ్ యువ జట్టును నడిపించి, కెప్టెన్‌గా మొదటి అంతర్జాతీయ ట్రోఫీని సాధించిన అతని నాయకత్వాన్ని ఆవిష్కరిస్తుంది.

ఎపిసోడ్ 4: బికమింగ్ కెప్టెన్ కూల్ (19 నిమిషాలు)
ఈ ఎపిసోడ్ ధోనీని భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా చూపిస్తుంది. మూడు ఐసీసీ ట్రోఫీలు (2007 టీ20 వరల్డ్ కప్, 2011 ఓడీఐ వరల్డ్ కప్, 2013 చాంపియన్స్ ట్రోఫీ) సాధించిన ఆయన ప్రయాణం ఇందులో ఉంది.

ఎపిసోడ్ 5: ది మ్యాచ్ ఫినిషర్ (17 నిమిషాలు)
ధోనీ ఐకానిక్ ఫినిషింగ్ స్టైల్‌ను ఈ ఎపిసోడ్ హైలైట్ చేస్తుంది. వైట్ బాల్ క్రికెట్‌లో మ్యాచ్‌లను తనదైన శైలిలో ముగించే అతని సామర్థ్యం, కూల్ హెడ్ ను ఇందులో చూడవచ్చు.

ఎపిసోడ్ 6: తలా ధోనీ ఐపీఎల్ సాగా (8 నిమిషాలు)
చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)తో ధోనీ ఐపీఎల్ ప్రయాణాన్ని ఈ ఎపిసోడ్ చూపిస్తుంది. “తలా”గా మారి, ఐదు ఐపీఎల్ టైటిల్స్ సాధించిన ఆయన టీం, అభిమానుల ఆరాధన ఇందులో కనిపిస్తాయి.

ఎపిసోడ్ 7: ఎమ్మెస్డీ ఫరెవర్ (8 నిమిషాలు)
అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తర్వాత కూడా ధోనీ యొక్క అసాధారణ ప్రభావం ఎందుకు తగ్గలేదో ఈ ఫైనల్ ఎపిసోడ్ వివరిస్తుంది. అతని వినమ్రత, అభిమానులతో బంధం, లెగసీ ఇక్కడ హైలైట్ అవుతాయి.

ఎందుకు చూడాలి?

‘7 షేడ్స్ ఆఫ్ ధోనీ’ ఒక సాధారణ డాక్యుసిరీస్ మాత్రమే కాదు, ఇది ధోనీ జీవితంలోని స్ఫూర్తిదాయక క్షణాలను ఒక థ్రిల్లర్ లాంటి నరేషన్‌తో అందిస్తుంది. ధోనీ అభిమానులకు అతని బాల్యం, స్ట్రగుల్స్, విజయాలను దగ్గరగా చూసే అవకాశం ఇది. సినిమాటిక్ విజువల్స్, రియల్ ఫుటేజ్, ధోనీ సన్నిహితుల స్పెషల్ ఇంటర్వ్యూలు ఈ సిరీస్‌ను మరింత ఆకర్షణీయంగా చేస్తాయి. కేవలం గంటన్నరలో ధోనీ జీవిత కథను చూడొచ్చు, అందుకే ఇది బిజీ షెడ్యూల్ ఉన్నవారికి కూడా పర్ఫెక్ట్.

Read Also : చుట్టూ చుట్టాలే ఉంటే ఫస్ట్ నైట్ ఎలా ? ఆ పని కోసం రెండు జంటల షాకింగ్ నిర్ణయం

Related News

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

Big Stories

×