Weather News: రెండు తెలుగు రాష్ట్రాల్లో జులై మాసం చివరి రెండు వారాల్లో వర్షాలు దంచికొట్టాయి. కుండపోత వానలు కురిసిన విషయం తెలిసిందే. రుతపవనాలు చురుగ్గా కదలడం.. బంగాళఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడన పరిస్థితుల వల్ల భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడ్డాయి. భారీ వర్షాలకు హైదరాబాద్ మహానగరం చిత్తడిచిత్తడై పోయింది. రోడ్లపైకి భారీ వరద నీరు చేరుతుండడంతో భాగ్యనగర వాసులు నానా ఇబ్బందులు పడ్డారు. ఓవైపు భారీ వర్షాలు, మరో వైపు ట్రాఫిక్ సమస్యలతో వాహనదారుల అష్టకష్టాలు చూశారు. అయితే గత ఐదు రోజుల నుంచి రాష్ట్రంలో వర్షాలు పడడం లేదు. ఇదే వాతావరణం మరికొన్ని రోజులు కొనసాగనుందని అధికారులు చెబుతున్నారు. తాజాగా ఆగస్టు నెలలో వాతావరణ పరిస్థితులపై అధికారులు అంచనా వేశారు.
తెలంగాణ రాష్ట్రంలో రేపటి (సోమవారం) నుంచి వర్షాలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వేశారు. దక్షిణ, పశ్చిమ, సెంట్రల్ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే, పగటిపూట ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఆకస్మిక వర్షాలు కురుస్తాయని వివరించారు.
ALSO READ: A.K. Rayaru Gopal: రూ.2 డాక్టర్ గోపాల్ కన్నుమూత.. కారణమిదే..?
రాజధాని నగరం హైదరాబాద్ నగరంలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. భారీ వర్షాల నేపథ్యంలో నగరవాసులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని హెచ్చరించారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో అకస్మాత్తుగా కురిసే వర్షాల వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
ALSO READ: Forest Beat Officer: అటవీశాఖలో భారీగా ఉద్యోగాలు.. సిలబస్ ఏంటి..?
ఆగస్టు రెండో వారంలో హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పారు. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం ఉండవచ్చని చెప్పారు. ఆగస్ట్ నెలలో సాధారణం కంటే ఎక్కువగానే.. వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 2,3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలో 8 శాతం లోటు వర్షపాతం ఉందని వివరించారు.
ఆగస్టు 4 నుంచి ఆగస్ట్ 6: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు నుంచి తేలిక పాటి వర్షాలు.. కొన్ని చోట్ల భారీ వర్షాలు
ఆగస్ట్ 7 నుంచి ఆగస్ట్ 15: దక్షణ, పశ్చిమ, మధ్య తెలంగాణలో భారీ వర్షాలు పడే ఛాన్స్..
ఆగస్ట్ 15 నుంచి ఆగస్ట్ 23: రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడే అవకాశం..
ఆగస్ట్ 23 నుంచి సెప్టెంబర్ 1: మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు
నోట్: జులై నెలలో కంటే ఆగస్ట్ నెలలో ఎక్కువగా వర్షాలు పడే ఛాన్స ఉందని అధికారులు చెబుతున్నారు..