BigTV English

Mega157 : రిస్క్ లో రావిపూడి, రెండు పడవల ప్రయాణం అవసరమా.?

Mega157 : రిస్క్ లో రావిపూడి, రెండు పడవల ప్రయాణం అవసరమా.?
Advertisement

Mega157 : మామూలుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ సక్సెస్ అనేవి కామన్ గా జరుగుతుంటాయి. కానీ దర్శకుడికి మాత్రం ఫెయిల్యూర్ తెలియదు. ఎస్.ఎస్ రాజమౌళి తర్వాత ఫెయిల్యూర్ తెలియని ఏకైక డైరెక్టర్ అనిల్ రావిపూడి. పటాస్ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఇంటర్ ఇచ్చిన అనిల్ మొదటి సినిమాతోనే మంచి పేరుని సంపాదించుకున్నాడు.


ఆ తర్వాత వరుస సినిమాలు చేసి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో దర్శకుడుగా స్థిరపడిపోయాడు. అనిల్ ఒక మంచి పాయింట్ తీసుకుని దానిని వినోదభరితంగా చెప్పే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అలానే ఆ సినిమాలో హై వచ్చే ఎలిమెంట్స్ ని కూడా బాగా డిజైన్ చేస్తాడు. అనిల్ రావిపూడి సినిమా అంటేనే మినిమం గ్యారెంటీ ఉంటుంది అని ప్రేక్షకులు అందరికీ ఒక స్థాయి నమ్మకం వచ్చేసింది. అయితే అనిల్ సినిమాలు అందరికీ నచ్చవు.

రెండు పడవల ప్రయాణం 


అనిల్ రావిపూడి ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో వస్తున్న 157 వ సినిమా ఇది. ఈ సినిమా అక్టోబర్ వరకూ షూట్ కంప్లీట్ చేసి నవంబర్ , డిసెంబర్ అంతా ప్రమోషన్స్ పై దృష్టి పెట్టనున్నారు.

అనిల్ రావిపూడి ఇదివరకే సంక్రాంతి కి వస్తున్నాం.. తో మంచి పబ్లిసిటీ డిజైన్ చేసి ఆ సినిమాను జనాల్లోకి బాగా తీసుకెళ్లారు.. ముఖ్యంగా సాంగ్ కూడా ముందే వదిలే గట్టిగా రీచ్ చేశారు.

ఈసారి దానికి మించి స్టాటజీ ప్రమోషన్ ప్లాన్ చేస్తున్నారట.ఒక పక్క షూటింగ్ జరుగుతూనే మరో పక్క ప్రమోషన్స్ డిజైన్ కూడా జరిగిపోతుందట. అయితే సినిమా మీద కాకుండా అప్పుడే ప్రమోషన్స్ వైపు ప్లాన్ చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కొంతమంది అభిప్రాయం. మెగాస్టార్ చిరంజీవితో సినిమా కాబట్టి ముందు ఈ పని పూర్తి చేసి తర్వాత కంప్లీట్ ప్రమోషన్స్ లో మునిగిపోతే బాగుంటుందనేది కొంతమంది చెబుతున్న మాట.

ఫుల్ క్లారిటీతో అనిల్ 

ఇక అనిల్ రావిపూడి విషయానికి వస్తే సినిమాను చాలా త్వరగా పూర్తి చేస్తున్నాడు.. సంక్రాంతి టార్గెట్ పెట్టుకొని అదే టైంకి సినిమా వచ్చే దిశగా పనిచేస్తున్నాడు. పేపర్ మీద అన్ని కరెక్ట్ గా ఉన్నప్పుడు సెట్లో కన్ఫ్యూజన్ ఉండదు. హీరో నుంచి దర్శకుడు కి ఏం కావాలో అది సెట్ లో తీసుకుంటే సగం పని అయిపోయినట్లే. ఇక ఇది ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా కాబట్టి ప్రత్యేకించి ఈ విషయంలో అనిల్ రావిపూడి కు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అనిల్ రావిపూడి బలమే ఎంటర్టైన్మెంట్. వీరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా కోసం చాలామంది క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు.

Also Read: Paruchuri On Kota Srinivasa Rao : కోట శ్రీనివాస్ రావు గురించి కన్నీళ్లు తెప్పించే పరుచూరి మాటలు

Related News

Kiran Abbavaram: పవన్ సినిమాలలో అసలు నటించను…అభిమాని అయితే నటించాలా?

Samantha: డైరెక్టర్లు కూడా నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు.. బోల్డ్ కామెంట్స్ చేసిన సమంత!

Hero Darshan: మళ్లీ సంకటంలో పడ్డ హీరో దర్శన్.. ఉన్నత న్యాయస్థానం మండిపాటు!

Hero Vishal: 8కోట్ల మంది ఇష్టాన్ని 8మంది నిర్ణయించలేరు..అవార్డులన్నీ చెత్తబుట్టలోకే!

K-Ramp: కిరణ్ అబ్బవరం కే- ర్యాంప్ ఫస్ట్ డే కలెక్షన్స్!

Bandla Ganesh: నెక్స్ట్ అల్లు అర్జున్ అతడే.. ఈ మాత్రం హైప్ ఇస్తే చాలు..చెలరేగిపోవడమే!

Bandla Ganesh: నా జీవితాన్ని మలుపు తిప్పిన డైరెక్టర్, హరీష్ శంకర్ రియాక్షన్ గమనించారా?

Spirit : ప్రభాస్ స్పెషల్ వీడియో రెడీ చేసిన సందీప్ రెడ్డి వంగ, మరో యానిమల్?

Big Stories

×