IND vs ENG 3rd Test: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడవ టెస్ట్ లో విజేత ఎవరు అనేది తేలిపోయింది. అందరూ ఊహించినట్లుగానే… చివరి వరకు పోరాడిన టీమిండియా దారుణ ఓటమి చవి చూసింది. అటు ఆల్రౌండర్ రవీంద్ర జడేజా… ఒంటరి పోరాటం వృధా అయిపోయింది. ఈ నేపథ్యంలోనే టీమిండియా పై మూడో టెస్టులో 22 పరుగుల తేడాతో… ఇంగ్లాండ్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. చివరలో మహమ్మద్ సిరాజ్ తో కలిసి టీం ఇండియన్ గెలిపించే ప్రయత్నం చేశాడు రవీంద్ర జడేజా. ఈ తరుణంలోనే.. ఈ ఇద్దరి మధ్య 23 పరుగుల భాగస్వామ్యం కూడా వచ్చింది. కానీ.. చివరికి మహమ్మద్ సిరాజ్.. అనుకోకుండా బౌల్డ్ అయ్యాడు. దీంతో టీమిండియా ఓడిపోవాల్సి వచ్చింది. అటు 61 పరుగులు చేసిన రవీంద్ర జడేజా.. నాటౌట్ గా మిగిలాడు.
Also Read: Team India : గ్రౌండ్ లో షర్ట్స్ తీసేసి సెలబ్రేషన్స్ చేసుకోవడం వెనుక కథ ఏంటి.. గంగూలీ చేసింది కరెక్టేనా !
రవీంద్ర జడేజా ఒంటరి పోరాటం వృధా
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు… రవీంద్ర జడేజా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఆల్ రౌండర్ గా గుర్తింపు పొందిన రవీంద్ర జడేజా… ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ మూడవ టెస్ట్ లో కూడా రెండు ఇన్నింగ్స్ లో అద్భుతంగా రాణించి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే.. మూడవ టెస్ట్ లో 61 పరుగులు చేసిన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా… చివరి వరకు పోరాటం చేసిన ఫలితం దక్కలేకపోయింది. మహమ్మద్ సిరాజ్ అవుట్ కావడంతో… రవీంద్ర జడేజా పోరాటం వృధా అయ్యింది. మహమ్మద్ సిరాజు ఒక్కడు ఆగి ఉంటే… మిగిలిన 22 పరుగులు సాధించేవాడు రవీంద్ర జడేజా.
ఓటమిపై స్పందించిన కెప్టెన్ గిల్
లార్డ్స్ వేదికగా ఓటమి చవిచూసిన టీమిండియా… ఐదు టెస్టుల సిరీస్లో వెనుకబడింది. అయితే ఈ మ్యాచ్ లో ఓటమిపై… కెప్టెన్ గిల్ స్పందించారు. తమ బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే టీమిండియా ఓడిపోయిందని… స్పష్టం చేశారు గిల్. ముఖ్యంగా నాలుగో రోజు చివరి గంటలు ఎక్కువ పరుగులు చేస్తే.. ఇవాళ టీమిండియా గెలిచేది అన్నారు. అలాగే టీమిండియాలో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ రవీంద్ర జడేజా అంటూ వ్యాఖ్యానించారు. అతనికి మరొక్కరు సపోర్ట్ గా నిలిస్తే మ్యాచ్ పరిస్థితి వేరే లాగా ఉండేదని వెల్లడించారు గిల్.
ఇది ఇలా ఉండగా లార్డ్స్ వేదికగా జరిగిన మూడవ టెస్ట్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు.. 387 పరుగులు చేసింది. 387 పరుగులు చేసిన తర్వాత ఆల్ అవుట్ అయింది. అయితే సరిగ్గా… కొలత పెట్టుకొని మరి టీమిండియా కూడా అంతే స్కోర్ చేసింది. మొదటి ఇన్నింగ్స్ లో 387 పరుగులు చేసి… ఉత్కంఠతకు తెరలేపింది టీమిండియా. ఇక రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు 192 పరుగులు చేసింది. ఆ లక్ష్యాన్ని చేదించే క్రమంలో టీమిండియా… 170 పరుగులకు ఆల్ ఔట్ అయింది.
Sanghis will say he intentionally gave away his wicket. we all know why.
Kinda worried about Siraj’s mental health right now. Hope they don’t abuse his family 🙏#INDvsENG
— Jitesh (@Chaotic_mind99) July 14, 2025