BigTV English

OTT Movie : IMDb లో 9.7 రేటింగ్… నెవర్ బిఫోర్ రికార్డు… ఈ సినిమాలో అంతగా ఏముందో తెలుసా?

OTT Movie : IMDb లో 9.7 రేటింగ్… నెవర్ బిఫోర్ రికార్డు… ఈ సినిమాలో అంతగా ఏముందో తెలుసా?
Advertisement

OTT Movie : ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు వినోద ప్రపంచంలో కొత్త విప్లవాన్ని తీసుకొచ్చాయి అన్నది అందరికీ తెలిసిందే. ఇప్పుడు ప్రేక్షకులు తమకు నచ్చిన సినిమాలను సమయానికి, ఆలోచనకు తగ్గట్టుగా ఉండే సినిమాలను ఈజీగా సెలెక్ట్ చేసుకుంటున్నారు. అయితే ఓటీటీలలో కుప్పలు తెప్పలుగా సినిమాలు ఉన్నప్పటికీ… ఆలోచించదగినవి, చర్చించదగినవి కొన్ని మాత్రమే. ఈ రోజు మనం IMDBలో కూడా అదిరిపోయే రేటింగ్ తెచ్చుకున్న ఓ సినిమా గురించి చెప్పుకోబోతున్నాం. ఈ మూవీ స్టోరీ ఏంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? అనే విషయంలోకి వెళ్తే…


హాట్ స్టార్ లో స్ట్రీమింగ్
ఈ సినిమా పేరు ‘His Story of Itihaas’. ఈ హిందీ డ్రామా భారతదేశంలోని పాఠశాలల్లో చరిత్రను తప్పుగా బోధించడాన్ని ప్రశ్నించే ఒక ఫిజిక్స్ టీచర్ నిజ జీవిత కథ ఆధారంగా రూపొందింది. ‘హిస్ స్టోరీ ఆఫ్ హిస్టరీ’ మే 2025లో థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. అంతేకాదు ఈ చిత్రం 9.7/10 రికార్డ్ రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఐఎండీబీలో ఇంతటి రేటింగ్ రావడమంటే మామూలు విషయం కాదు. ఈ మూవీ OTT హక్కులను జియో హాట్‌స్టార్ సొంతం చేసుకుంది. హిందీతో పాటు ఈ చిత్రం త్వరలో తమిళం, తెలుగు, మలయాళంలో స్ట్రీమింగ్ కానుంది. మన్‌ప్రీత్ సింగ్ ధామీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సుబోధ్ భావే (నమిత్ భరద్వాజ్), యోగేంద్ర టిక్కు (కమల్), అంకుర్ వికల్ (ఇషాన్ కబీర్), అకాంక్ష పాండే, కిషా అరోరా, జయ్ శంకర్ పాండే, సచిన్ కె. జర్యాల్, అలోక్ కున్వర్ తదితరులు నటించారు.

కథలోకి వెళ్తే…
నమిత్ భరద్వాజ్ (సుబోధ్ భావే) చండీగఢ్‌లో ఒక ఫిజిక్స్ టీచర్. ఓరోజు తన కూతురు చదివే పాఠశాల చరిత్ర పుస్తకంలోని తప్పులను గమనిస్తాడు. ఈ పుస్తకాలు భారతీయ చరిత్రను వక్రీకరించి, మొగల్, బ్రిటిష్ యుగాలకు ముందు భారతదేశ ఘనతను తక్కువ చేస్తున్నాయని అతను తెలుసుకుంటాడు. నమిత్, నీరజ్ అత్రి అనే చరిత్రకారుడి స్ఫూర్తితో, రైట్ టు ఇన్ఫర్మేషన్ (RTI) యాక్ట్ ద్వారా పాఠశాల పాఠ్యాంశాలను ప్రశ్నిస్తూ కోర్టులో పోరాటం మొదలు పెడతాడు.


Read Also : ఫ్యామిలీ మొత్తం కలిసి చూడాల్సిన బాసిల్ జోసెఫ్ మలయాళ మూవీ… కామెడీకి పొట్ట చెక్కలే

హిస్టరీ ప్రొఫెసర్ కమల్ (యోగేంద్ర టిక్కు) సహాయంతో ఆర్యన్ ఇన్వేషన్ థియరీ, మొగల్ రాజుల గొప్పతనం, 1857 స్వాతంత్య్ర సమరం గురించి పాఠ్యపుస్తకాలలోని ఉన్న అవాస్తవాల గురించి ప్రశ్నించడం సంచలనం సృష్టిస్తుంది. అతని పోరాటం క్లాస్‌రూమ్ డిబేట్‌లు, పబ్లిక్ కాన్ఫరెన్స్‌లకు దారి తీయడంతో విద్యా వ్యవస్థలో గందరగోళం ఏర్పడుతుంది. నమిత్ కుటుంబం, ముఖ్యంగా అతని భార్య (అకాంక్ష పాండే) ఈ మిషన్‌కు మద్దతు ఇస్తుంది. కానీ సమాజంలోని వ్యతిరేకతలు అతన్ని ఒంటరిని చేస్తాయి. నమిత్ పోరాటం లిబరల్ హిస్టోరియన్స్ చాయా ముఖర్జీ, ఇషాన్ కబీర్ (అంకుర్ వికల్)తో ఘర్షణకు దారితీస్తుంది. వీళ్ళు స్కూల్ పుస్తకాలనే సమర్థిస్తారు. మరి ఫిజిక్స్ టీచర్ ఈ యుద్ధంలో గెలిచాడా? చివరికి ఏం జరిగింది? స్కూల్లో పిల్లలకు భారతదేశ చరిత్ర గురించి నేర్పిస్తున్న ఆ అవాస్తవాలు ఏంటి? అనేది సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

OTT Movie : పిల్లాడికి కాకుండా పిశాచికి జన్మనిచ్చే తల్లి… కల్లోనూ వెంటాడే హర్రర్ మూవీ

OTT Movie : బేస్మెంట్లో బంధించి పాడు పని… కూతురిని వదలకుండా… షాకింగ్ రియల్ స్టోరీ

OTT Movie : అక్క బాయ్ ఫ్రెండ్ తో చెల్లి… నరాలు జివ్వుమన్పించే సీన్లు మావా… ఇయర్ ఫోన్స్ మాత్రం మర్చిపోవద్దు

OTT Movie : బాయ్ ఫ్రెండ్ తో ఒంటరిగా గడిపే అమ్మాయిలే ఈ కిల్లర్ టార్గెట్… వెన్నులో వణుకు పుట్టించే థ్రిల్లర్ మావా

OTT Movie : వరుసగా అమ్మాయిలు మిస్సింగ్… ప్రొఫెసర్ ముసుగులో సైకో వల… సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : 8 ఏళ్ల తరువాత థియేటర్లలోకి… నెలలోపే ఓటీటీలోకి 170 కోట్ల హిలేరియస్ కోర్ట్ రూమ్ డ్రామా

OTT Movie : జంప్ అవ్వడానికి ట్రై చేసి అడ్డంగా బుక్… ఇష్టం లేకుండానే ఆ పని… తెలుగు మూవీనే మావా

OTT Movie : అనుకున్న దానికంటే ముందుగానే ఓటీటీలోకి ‘కాంతారా చాఫ్టర్ 1’… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే ?

Big Stories

×