E-Paper
Advertisement

భారతీ రాజా లేరని తెలిసి ఎమోషనల్ అవుతున్న మోహన్ రాజా..

భారతీ రాజా లేరని తెలిసి ఎమోషనల్ అవుతున్న మోహన్ రాజా..
Advertisement

Bharathiraja tribute: తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న దిగ్గజ దర్శకుడు, ‘ఇయక్కునర్ ఇమయం’ (దర్శకత్వ శిఖరం) భారతీరాజాకు ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా సోషల్ మీడియా వేదికగా ఘన నివాళి అర్పించారు. భారతీరాజాను చిత్ర పరిశ్రమను నిలబెట్టిన ఒక మహావృక్షంతో పోలుస్తూ ఆయన చేసిన భావోద్వేగపూరిత పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

చిత్ర పరిశ్రమకు ఆయనో మర్రివృక్షం!

Advertisement

మోహన్ రాజా తన ట్వీట్‌లో భారతీరాజాను కేవలం ఒక దర్శకుడిగా కాకుండా, తమిళ సినిమాను కాపాడుతున్న ఒక పెద్ద ‘మర్రివృక్షం’లా అభివర్ణించారు. ఆయన సాధించిన జాతీయ, ప్రాంతీయ అవార్డులు ఆ వృక్షానికి అందాన్ని ఇచ్చే ఆకులైతే… ఆయన స్ఫూర్తితో, ఆయన దగ్గర శిష్యరికం చేసి ఇండస్ట్రీని ఏలుతున్న నేటి తరం నటీనటులు, దర్శకులు ఆ చెట్టుకు బలమైన ‘ఊడలు’ లాంటివారని మోహన్ రాజా విశ్లేషించారు.

‘ది ట్రూ ఆటర్’

Advertisement

సినిమా ప్రపంచంలో ‘ఆటర్’ అనే పదానికి చాలా విలువైంది. ఒక సినిమాలోని కథ, కథనం, సంగీతం, లొకేషన్స్, నటీనటుల హావభావాలు… ఇలా ప్రతి విభాగంపైనా దర్శకుడు తనదైన ప్రత్యేక ముద్ర వేస్తే, ఆ దర్శకుడిని ‘ఆటర్’ అంటారు. సినిమా చూస్తున్నంత సేపూ ఇది ‘భారతీరాజా సినిమా’ అని ప్రేక్షకుడు గుర్తుపట్టేలా క్లాసిక్స్ తెరకెక్కించిన ఏకైక మేధావి ఆయనేనని మోహన్ రాజా కొనియాడారు.

తమిళ సినిమా రూపురేఖలు..

1970వ దశకంలో సినిమాలు అంటే కేవలం నాలుగు గోడల మధ్య, స్టూడియో సెట్లలోనే సాగేవి. ఆ కృత్రిమత్వాన్ని బద్దలు కొడుతూ, కెమెరాను స్టూడియోల నుంచి బయటకు తెచ్చి.. పల్లెటూరి పచ్చదనం, మట్టి వాసన, సహజమైన మనుషుల ఎమోషన్స్‌ను వెండితెరకు పరిచయం చేసిన విప్లవాత్మక దర్శకుడు భారతీరాజా.

తమిళంలో ఆయన సృష్టించిన ట్రెండ్ సెట్టర్స్… తెలుగులో ‘పదహారేళ్ళ వయసు’, ‘తూర్పు వెళ్ళే రైలు’, ‘సీతాకోకచిలుక’ వంటి పేర్లతో రీమేక్ అయి ఇక్కడా సంచలనాలు సృష్టించాయి.

కమల్ హాసన్, రజనీకాంత్, శ్రీదేవి వంటి దిగ్గజాల కెరీర్‌ను మలుపు తిప్పడంలో ఆయన పాత్ర అనన్యసామాన్యం.

వైరల్ అవుతున్న పోస్ట్

తెలుగులో ‘హనుమాన్ జంక్షన్’, ‘గాడ్ ఫాదర్’, తమిళంలో ‘తని ఒరువన్’ (ధృవ మాతృక) వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన మోహన్ రాజా… సీనియర్ దర్శకుడైన భారతీరాజా పట్ల చూపించిన ఈ గౌరవం, కృతజ్ఞత పట్ల సినీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. “తమిళ సినిమా ఉన్నంత కాలం.. మిమ్మల్ని కొనియాడటం ఆపదు సార్” అంటూ మోహన్ రాజా ముగించిన తీరు అభిమానుల హృదయాలను గెలుచుకుంటోంది.

Related News

“శ్రీచక్రం మీద కూర్చోవచ్చా?”.. సమంత ఫొటోపై నెటిజన్ల ఫైర్!

ఐదారు సార్లు రిహార్సల్ చేసిన రజినీకాంత్.. అసలు విషయం చెప్పిన విజయ్ సేతుపతి

వరంగల్ ఎయిర్‌పోర్టుపై సందీప్ రెడ్డి వంగా ఇంట్రెస్టింగ్ పోస్ట్.. పేర్లు కూడా చెప్పేశారు

నాని ది ప్యారడైజ్ సినిమాకు సీక్వెల్..ఫుల్ క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!

ఇంత అందంగా ఎప్పుడూ చూడలేదే.. శ్రీలీల లేటెస్ట్ లుక్ వైరల్!

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొనే.. ఈసారి పుట్టింది ఎవరంటే?

తిరుమల లడ్డులో కొవ్వు లేదు.. మతోన్మాదుల కొవ్వు తప్ప.. ప్రకాష్ రాజ్ ట్వీట్ వైరల్!

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న అనస్వర రాజన్..మరీ ఇంత డెడికేషన్ ఏంటీ అమ్మడు!

Big Stories

Advertisement
×