Gundeninda GudiGantalu Today episode june 10th: తన కారు కోసమని పోలీస్ స్టేషన్కు వెళ్లిన బాలుని అక్కడున్న కానిస్టేబుల్ పిచ్చిపిచ్చి ప్రశ్నలతో ఇబ్బంది పెడతాడు.. కానీ ట్రాఫిక్ పోలీస్ అరుణ్ వచ్చి అతని బయటికి గెంటేయండి అని చెప్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన సీఐ బాలుని లోపలికి రమ్మని పిలుస్తాడు.. టాపిక్ కానిస్టేబుల్ కి వార్నింగ్ ఇచ్చి బాలు కార్ కీస్ ని ఇవ్వమని చెప్తాడు. నేను ఒక పెద్దాయన చనిపోతే ఇలా చేశాను అని చెప్పబోతుంటే ఆల్రెడీ మీ ఆవిడ చెప్పింది లేదని అంటాడు. మీ ఆవిడ మీనా నే కదా ఆవిడ గొప్పగా చెప్పింది అందుకే నీ కార్ని రిలీజ్ అయ్యేలా చేస్తున్నాను ఇంకొకసారి ఇలాంటివి చేయకుండా ఫైన్ కట్టి వెళ్లిపో అని అతను అంటాడు. ఇక తర్వాత ఇంటికి వెళ్లిన బాలు మీనా దగ్గరికి వెళ్లి మీనా కోపాన్ని చల్లార్చాలని కౌగిలించుకుంటాడు.
రవి శృతిలు ఇద్దరు కూడా చాలా సంతోషంగా అందరినీ కేకలు వేసి పిలుస్తూ ఉంటారు.. అయితే ఏంటి ఏమైంది అని ప్రభావతి టెన్షన్ పడుతూ వస్తుండగా బాలు ప్రభావతిని కిందకు రానివ్వకుండా అడ్డుపడుతూ ఉంటాడు.. అయితే ప్రభావతి బాలుని తోసేసి మరి కిందకి రావడంతో తాను పడిపోతూ ఉంటుంది. ఏంట్రా ఏమైంది ఎందుకు అంతగా కేకలు పెట్టి అడుస్తున్నావ్ ఏంటి అని అడుగుతుంది ప్రభావతి.. పెళ్లిరోజు నువ్వు గ్రాండ్గా చేసుకోవాలని రవి శృతి చాలా ప్లాన్ చేసుకుంటారు.. అయితే వాళ్ల పెళ్లి రోజు గురించి అందరికీ చెప్తారు బాలు మీనా ఇద్దరు కూడా చేసిన పనికి చాలా సంతోషంగా ఉంది అని సత్యం అంటాడు.. ఇన్విటేషన్ కార్డు లో అందరి పేర్లు ఉండడం మీనా చెప్పిన ప్లాన్ అని చెప్పగానే అందరూ మీనా అని పొగిడేస్తుంటారు.
ప్రభావతి టీం తో డాన్స్ చేయించాలి అని రవి అనుకుంటాడు. రవి చెప్పగానే ప్రభావతి చాలా సంతోషంగా ఉంటుంది. మీ నాని డెకరేషన్ పనులు చూసుకోమని చెప్తాడు. అయితే మీనా మీ కోసం నేను అన్ని దగ్గరను చూసుకుంటాను అని అనగానే… ఫ్రీ గానే కదా చేస్తుందిలే అని వెటకారంగా మాట్లాడుతాడు మనోజ్.. ఫ్రీగా ఏమీ వద్దు ఎంత డబ్బులు అయితే చెప్పు అంత డబ్బులు మేము ఇస్తాము అని శృతి అంటుంది. అందరి పేర్లు కార్డులో వేశావు కానీ వీరిద్దరి పేర్లు ఎందుకు వేశావు అని అంటారు. మీనా డెకరేషన్ పనులు చూసుకుంటుంది. ఇక అమ్మ డాన్స్ వేస్తుంది. నేను నా కార్లలో ఒక కారుని మీ పనులకు వాడుకునేలా చేస్తానో మరి వీళ్ళిద్దరూ ఏం చేస్తారు? వీళ్ళిద్దరి పేర్లు ఎందుకు దండగ వేశారు అని బాలు అడగగానే నేను మేకప్ చేస్తాను అని రోహిణి అంటుంది.. ఆ తర్వాత మనోజ్ ని గిఫ్ట్ తీసుకుని రమ్మంటే వాళ్లకు ఏమీ ఇవ్వాలి గిఫ్టు అని వెటకారంగా మాట్లాడుతాడు.
బాలు కి తాత వాళ్ళ మనవడు ఫోన్ చేస్తాడు. హలో అన్న మీతో ఒకసారి తాత మాట్లాడతాను అని అంటున్నాడు. అయితే ఆ తాత ఫోన్ మాట్లాడిన తర్వాత విద్య ఆ ఫోన్ ని అక్కడ పడేసుకుని వెళ్ళింది అని తాత చెప్పగానే బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు.. ఏమైంది ఎందుకు మీరు అలా ఉన్నారు అని నేను అడుగుతుంది. ఆ ఫోన్ పడేసుకున్న అమ్మాయి ఎవరో కాదు విద్యా అని చెప్పగానే మీనా కూడా షాక్ అవుతుంది. ఏంటి ఫోన్ కొట్టేసింది విద్యనా ఇంత పాడు బుద్ధి తనకు ఉందా అని మీనా అడుగుతుంది.. అయితే మీనా రోహిణి ఇదంతా చేసిందంటారా అని అడుగుతుంది. మిషన్ గురించి తెలుసుకోవాలి అంటే విద్య నుంచి నిజం రావాలి అని బాలు విద్య దగ్గరికి వెళ్తాడు..
విద్య దగ్గరికి బాలు వెళ్లి ఈ ఫోన్ ఎక్కడిదో తెలుసా అని అడుగుతాడు. బాలు దగ్గరికి ఆ ఫోన్ వచ్చేసింది అని కంగారు పడిపోయిన విద్య మరొక అబద్ధం చెప్తుంది. నా ఫోన్ పోయింది అందుకే సెకండ్ హ్యాండ్ లో ఒక ఫోన్ కొన్నాను. అదే ఈ ఫోను ఎవరిది ఏంటి అని చూసుకోలేదు ఫుల్ గా ఛార్జింగ్ పెట్టాను ఆ తర్వాత వాడలేదు బయట చెప్పు తెగిపోతే కుట్టించుకోవడానికి అని ఒక చోటికి వెళ్తే అక్కడ పడిపోయినట్లుంది అని అబద్ధం చెప్తుంది. నువ్వు నీ ఫ్రెండ్ రోహిణి నీకు కాపాడేందుకు అబద్దాలు చెబుతున్నామని నాకు అర్థమైంది.. మరి నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావ్ నాకర్థం కావడం లేదు.. ఒకవేళ నాకు మొత్తం నిజాలు కనుక తెలిస్తే అప్పుడు చెప్తాను అని విద్యకు బాలు వార్నింగ్ ఇస్తాడు. విద్యా రోహిణి గురించి చెప్పకపోవడంతో రోహిణి సేఫ్ అవుతుంది.
రోహిణి విద్య ఏం చెప్పిందో తెలుసుకోవాలి అని విద్య దగ్గరికి వెళ్తుంది.. బాలు కి నిజం చెప్పలేదని తెలుసుకున్నారు రోహిణి విద్య నన్ను కాపాడవు అని తనతో మళ్ళీ మంచిగా మాట్లాడుతుంది. నువ్వు నన్ను ఎంతగా అసహ్యించుకుంటూ కోపంగా చూసిన కూడా.. నేను మాత్రం నిన్ను ఎప్పుడూ నా ఫ్రెండ్ గానే చూశాను అని విద్య అనడంతో రోహిణి ఎమోషనల్ అవుతుంది.. మళ్లీ రోహిణి విద్య ఇద్దరు కలిసి తమ జీవితాల గురించి మాట్లాడుకుంటూ సంతోషంగా కలిసిపోతారు.. అయితే రోహిణి మనోజ్ కొట్టిన విషయాన్ని విద్యతో చెప్పడంతో విద్య కూడా భయపడిపోతుంది.. కానీ రోహిణి తన నాటకం గురించి విద్యతో మరోసారి బయటపెడుతుంది.
రాత్రి అయిన తర్వాత మనోజ్ రోహిణి కొట్టడానికి కర్ర తీసుకొని వస్తాడు. నన్ను తిట్టుకోవద్దని రోహిణి నీలో ఉన్న దెయ్యాన్ని మాత్రమే నేను కొడుతున్నాను అని మనోజ్ అంటాడు. అయితే రోహిణి నన్ను కొట్టొద్దు మనోజ్ అని ఎంతగా బ్రతిమలాడుతున్నా సరే మనోజ్ మాత్రం తనని కొడుతూనే ఉంటాడు. కానీ ఆ నొప్పిని భరించలేక రోహిణి దయ్యం పట్టిందానిలాగా ప్రవర్తిస్తుంది. కర్ర తీసుకొని వచ్చి మనోజ్ ని కొడుతుంది. ప్రభావతి మనోజ్ ని ఇద్దరినీ కొట్టేస్తుంది రోహిణి.. అప్పుడు కూడా ప్రభావతి ఆస్తులు గురించి మీరు చెప్పలేదు అని అనగానే రోహిణి దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..