E-Paper
Advertisement

శ్రీలీలకు బిగ్ ఛాన్స్.. మోక్షజ్ఞతో జోడీ కడుతుందా?

శ్రీలీలకు బిగ్ ఛాన్స్.. మోక్షజ్ఞతో జోడీ కడుతుందా?
Advertisement

Mokshagna Sreeleela:శ్రీలీల ..పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ రెండో సినిమా ధమాకాతోనే ఏకంగా వంద కోట్ల క్లబ్ లోకి దూసుకుపోవడంతో ఒక్కసారిగా టాప్ లీగ్ లోకి దూసుకువచ్చింది,అయితే స్కంద సినిమాతో డిజాస్టర్ ఫేస్ చేసిన ఈ భామ భగవంత్ కేసరి తో మంచి మార్కులే కొట్టేసింది.

వరుస ప్లాపుల్లో శ్రీలీల 

ఇక ఆ తర్వాత వరుసగా ఆదికేశవ,ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ గుంటూరు కారం అంటూ చేసిన సినిమా చేసినట్టే పోయాయి.సరిగ్గా ఆ సమయంలో కిసిక్ అంటూ పుష్ప2లో మరోసారి స్పెషల్ సాంగ్ తో అదరగొట్టింది. కానీ ఆ తర్వాత రాబిన్‌హుడ్ ,జూనియర్ ,మాస్ జాతర , పరాశక్తి , ఉస్తాద్ భగత్ సింగ్ అంటూ మళ్ళీ షరా మాములే.

Advertisement

దీంతో ఇక భామ పని అయిపోయిందా అన్న వార్తలు కూడా వినిపించాయి. ఇక ప్రస్తుతం అనురాగ్ బస్ సినిమా,అలాగే ఓం చాప్టర్ 1 సినిమాలు మాత్రమే చేతిలో ఉన్న శ్రీలీల ఒక క్రేజీ ప్రాజెక్టులో ఛాన్స్ దక్కించుకున్నట్టు తెలుస్తుంది.

వశిష్ట దర్శకత్వంలో లాంచ్

అవును.. ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పేశాడు నందమూరి బాలయ్య.నందమూరి మోక్షజ్ఞ  వశిష్ట దర్శకత్వంలో లాంచ్ అవుతాడని ఇప్పటికే కన్ఫర్మ్ చేశాడు.దీంతో  ఈ సినిమాలో హీరోయిన్ ఎవరో అంటూ ఆరా తీస్తున్నారు మూవీ లవర్స్ .

మోక్షజ్ఞ కి జోడిగా శ్రీ లీల

Advertisement

అలాంటి ఈ సమయంలో నందమూరి మోక్షజ్ఞ కి జోడిగా శ్రీ లీల జతకడుతుందన్న వార్తలు ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. శ్రీలీలకి మోక్షుతో సినిమా పడితే మాత్రం మంచి అవకాశం అనే చెప్పాలి. నిజానికి శ్రీ లీలకి నటనతో పాటు డాన్స్ లో కూడా మంచి టాలెంట్ ఉంది.

కానీ ఎంచుకున్న ప్రాజెక్టుల లోపమో, లేక దురదృష్టమో తెలియదు కానీ చేసిన ఏ సినిమా కూడా హిట్ అవ్వని పరిస్థితి అలాంటి ఈ సమయంలో మొక్షజ్ఞతో జత కడితే మాత్రం టాలీవుడ్ లో మరికొన్ని రోజులు పాగా వేయడం పక్కా.

దసరా రోజున సినిమా ముహూర్తం

అయితే శ్రీలీలకి డెబ్యూ హీరోతో నటించడం ఇదే తొలిసారి కాదు గతంలో కన్నడ హీరో విరాట్ నటించిన కిస్, అలాగే పెళ్లి సందడిలో రోషన్ మేక సరసన నటించిన ఈ భామ ఈ మధ్య జూనియర్ సినిమాలో కిరీటి రెడ్డికి జోడిగా కూడా నటించింది కూడా. ఇక మోక్షజ్ఞ సినిమాకి వస్తే.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలుస్తుంది.

ALSO READ:బిగ్ బాస్ 10లో టైటిల్ రేసు మొదలైంది.. వీరి మధ్యే అసలు పోటీ!

వచ్చే దసరా రోజున ఈ సినిమా ముహూర్తం కూడా ఘనంగా జరగనుందట. అప్పుడే సినిమాకి సంబంధించిన మిగతా క్యాస్టింగ్ అన్నీ అనౌన్స్ చేస్తారని తెలుస్తుంది .అయితే ప్రస్తుతానికి శ్రీలీల మోక్షజ్ఞతో జతకడుతుందన్నవార్తలు కేవలం సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ మాత్రమే, నిజా నిజాలు ఏమిటో మేకర్స్ బయట పెడితే గాని తెలియదు!

Tags

Related News

లోకేష్  ‘డీసీ’ హిట్..ఆ ముగ్గురికి బీఎండబ్ల్యూ కార్లను గిఫ్ట్ గా ఇచ్చిన ప్రొడ్యూసర్!

స్వయంభు’ వెనుక సంయుక్త కష్టం.. వీడియో వైరల్!

మరో బిజినెస్‌లోకి అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ.. కొత్త స్కిన్‌కేర్ బ్రాండ్ ఇదే!

నడవలేని స్థితిలో టాలీవుడ్ లేడీ కమెడియన్.. వీడియో వైరల్!

‘స్లమ్ డాగ్’ నుండి సంయుక్త ఆన్ సెట్ పిక్స్.. రిలీజ్ డేట్ పై మేకర్స్ క్లారిటీ?

మహేష్ బాబు, రాజమౌళిలకు నోటీసులు.. అసలేం జరిగిందంటే?

నిహారిక నీలో ఈ టాలెంట్ కూడా ఉందా.. బొజ్జ గణపయ్య లుక్ చూశారా?

Big Stories

Advertisement
×