E-Paper
Advertisement

బిగ్ బాస్ 10లో టైటిల్ రేసు మొదలైంది.. వీరి మధ్యే అసలు పోటీ!

బిగ్ బాస్ 10లో టైటిల్ రేసు మొదలైంది.. వీరి మధ్యే అసలు పోటీ!
Advertisement

Bigg Boss Telugu 10 Winner:ఎంటర్ టైన్ మెంట్ ఈసారి నెక్స్ట్ లెవెల్ అంటూ మరో మారు బిగ్ బాస్ సీజన్ 10 మొదలైపోయింది.ఇక ఎప్పటిలాగే కంటెస్టెంట్ ల మధ్య టాస్క్ లు, గేమ్ లు అంటూ షో జోరుగా సాగుతుంది కూడా.ఈ సమయంలోనే ఆర్ జె చరణ్ మిడ్ వీక్ ఎలిమినేషన్ అయ్యాడు.

ఈ క్రమంలో ఈ సీజన్ టైటిల్ ఎవరు కొడతారా అంటూ ఆసక్తిగా డిబేట్ లు పెట్టేస్తున్నారు నెటిజన్లు. నిజానికి టైటిల్ ఎవరు పట్టేస్తారా అని ఇప్పుడే గెస్ చేయడం చాలా తొందరగా పాటే .కానీ ఎందుకంటే ఈ గేమ్ లో మొదటి వారం కనిపించిన ఆట చివరి వరకు ఉంటుందా అంటే అనుమానమే. ఇంక వాళ్ళ ఆడుతున్న గేమ్, ఫాలోయింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ .. ఇలా అన్ని లెక్కల్లోకి వస్తాయి.

Advertisement

జబర్దస్త్ ఆటో రాంప్రసాద్

అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ నలుగురిలో ఒకరు టైటిల్ కొట్టే ఛాన్స్ ఉందంటూ డిబేట్లు పెట్టేస్తున్నారు నెటిజన్లు.వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పేరు జబర్దస్త్ ఆటో రాంప్రసాద్. ఆటో రాంప్రసాద్ కామెడీ ఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఇక హౌస్ మొత్తం ఎంటర్టైన్మెంట్ ఇచ్చేది కూడా ఈయనే.

Advertisement

పైగా చరణ్ ఎలిమినేషన్ లో రాంప్రసాద్ చివరి దశకు వెళ్లడం కూడా గేమ్ పై ఆసక్తి పెంచింది. అయితే రాంప్రసాద్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా బయట బిగ్ బాస్ చూస్తున్న ఆడియన్స్ లలో వినిపిస్తున్న టాక్ చూస్తే జబర్దస్త్ ఆటో రాంప్రసాద్ సీజన్లో టైటిల్ కొట్టేస్తాడు అని చర్చలు మొదలెట్టేశారు నెటిజన్లు.ఇక ఈ సీజన్ లో వీక్లీ హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటుంది కూడా ఆటో రాంప్రసాద్ అనే వినిపిస్తుంది.

త్రిగుణ్ ఆలియాస్ అదిత్

ఇక ఈ లిస్టులో ఉన్న మరో వ్యక్తి త్రిగుణ్ ఆలియాస్ అదిత్.చూడ్డానికి మొదట్లోనే కాస్త సైలెంట్ గా కనిపించిన త్రిగుణ్ మెల్లిమెల్లిగా తన సత్తా చూపిస్తున్నాడు. మొదటి రోజే స్పెషల్ పవర్ కొట్టేసిన త్రిగుణ్ దాన్ని ఎలా ఉపయోగిస్తాడు అనేది అసలు ప్రశ్న.హౌస్ లో త్రిగుణ్ చూపిస్తున్న మెచ్యూరిటీ, ఆడుతున్న తీరు ని చూసి ఈ సీజన్ లో టైటిల్ కొట్టే చాన్స్ ఉన్న వారిలో త్రిగుణ్ కూడా ఒకరని అంచనా వేస్తున్నారు ఆడియన్స్.

అగ్నిపరీక్ష ద్వారా  వచ్చిన సృష్టి

ఇక ఈ లిస్టులో కనిపిస్తున్న మరో పర్సన్ సృష్టి .అగ్నిపరీక్ష ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన సృష్టి మాట తీరు ప్రస్తుతం అందరిని ఎట్రాక్ట్ చేస్తుంది. ఇక గతంలో షారుక్ ఖాన్ తో చేసే స్టేజ్ పెర్ఫార్మెన్స్ కూడా ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. ముఖ్యంగా హౌస్ లో ఇతరులతో మాట్లాడే తీరు ఆమె ఆడే విధానం, అందరితో ఉండే బాండింగ్.. ఇవన్నీ ఆమెకు ప్లస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆమెకున్న ఫాలోయింగ్ కి ,హౌస్ లో సరైన స్ట్రాటజీ కలిస్తే టైటిల్ కొట్టడం చాలా ఈజీ.

రోహిత్ నాయుడు

ఇక ఈ సీజన్లో టైటిల్ కొట్టే అవకాశం ఉందని వినిపిస్తున్న మరో పేరు రోహిత్ నాయుడు. మామూలుగా కామనర్ కంటెస్టెంట్ లపై మొదటి నుంచే చాలా ఆసక్తి కనిపిస్తుంది. నాయుడు ఆడే విధానం తీరు బట్టి అనఫీషియల్ గా వస్తున్న రిపోర్ట్ లలో రోహిత్ నాయుడు కి ఎక్కువగా సపోర్టు ఉన్నట్టు కనిపిస్తుంది. చూడాలి సైలెంట్ గా కనిపిస్తున్న రోహిత్ నాయుడు ఆడియన్స్ మనసులను దోచి టైటిల్ ఎలా పట్టేస్తాడో.

ముఖేష్ గౌడ

ఇక ఈ లిస్టులో వినిపిస్తున్న ఇంకో పేరు ముఖేష్ గౌడ .ఇప్పటికే గుప్పెడంత మనసు సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన ముఖేష్ గౌడ కి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ బాగానే ఉపయోగపడుతుంది .ఇక ఫస్ట్ వీక్ ఫెర్ఫామెన్స్ పరంగా చూస్తే ముఖేష్ దాదాపు టాప్ లో ఉన్నట్టు సమాచారం మరి ఈ జోష్ ని ఇలాగే కంటిన్యూ చేసి చివరి వరకు టైటిల్ పట్టేస్తాడా లేక మధ్యలోనే డ్రాప్ అవుతాడా అనేది కాలం గడిస్తే కానీ తెలియదు.

అయితే బిగ్ బాస్ టైటిల్ కొట్టాలంటే ఎన్నో కలిసి రావాలి. టాస్క్ లో సరైన పర్ఫామెన్స్ ఇవ్వగలగాలి. సరైన సమయంలో స్టాండ్ తీసుకోగలగాలి.ఇవన్నీ కలిస్తేనే టైటిల్ కొట్టే అవకాశం ఉంటుంది. మరి అందరూ అనుకుంటున్నట్టుగా వీళ్లలో ఒకరు టైటిల్ కొడతారా లేక పెద్ద సర్ప్రైజ్ ఇస్తూ మరెవరైనా లీగ్ లోకి దూసుకు వస్తారా చూడాలి.

Tags

Related News

యూట్యూబర్ నందనకు బిగ్ బాస్ క్రేజీ ఆఫర్.. రెమ్యూనరేషన్ ఎంతంటే ?

నందన అరెస్ట్.. ఏం పీ*క*లే*రు అంటూ అన్వేష్ వీడియో రిలీజ్!

Illu Illaalu Pillalu Srivalli : హమ్మయ్య.. సీరియల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఇదేం ట్విస్ట్ రా అయ్యా..

అనసూయ ఓపెన్ ఛాలెంజ్.. మరో వీడియోతో హల్చల్!

ఈ వారం సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఇది అస్సలు ఊహించలేదు మావా…

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి బోలెడు సినిమాలు.. డోంట్ మిస్..

Illu Illalu Pillalu Today Episodes: నర్మద అనుమానమే నిజమే.. సుక్కు ప్లాన్ సక్సెస్.. వల్లికి మరో టెన్షన్..

Big Stories

Advertisement
×