E-Paper
Advertisement

షాపింగ్ ప్రియులకు అలర్ట్.. Flipkart Big Billion Days సేల్ డేట్స్ వచ్చేసాయోచ్!

షాపింగ్ ప్రియులకు అలర్ట్.. Flipkart Big Billion Days సేల్ డేట్స్ వచ్చేసాయోచ్!
Advertisement

Flipkart Big Billion Days 2026: ఫెస్టివల్ సీజన్ వస్తుందంటే చాలు.. ఆన్‌లైన్ షాపింగ్ ప్రియులందరూ వేయి కళ్లతో ఎదురుచూసే అతిపెద్ద పండగ ‘ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్’. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ మహా సేల్ డేట్స్ ఎట్టకేలకు లీకయ్యాయి. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక స్క్రీన్ షాట్ ప్రకారం ఈ ఏడాది బిగ్ బిలియన్ డేస్ సేల్ అక్టోబర్ 9 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా.. ఈ లీక్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఫ్లస్ మెంబర్స్‌కు ముందే పండగ:

సాధారణంగానే ఫ్లిప్‌కార్ట్ తమ లాయల్టీ కస్టమర్లకు ప్రత్యేకమైన మర్యాదలు ఇస్తుంటుంది. ఈసారి కూడా అదే సెంటిమెంట్ రిపీట్ కానుంది. సాధారణ వినియోగదారుల కంటే ఒక రోజు ముందే అంటే.. అక్టోబర్ 8వ తేదీనే ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్ల కోసం ఈ సేల్ అందుబాటులోకి రానుంది. ఎవరైనా బెస్ట్ గ్యాడ్జెట్స్ లేదా ఖరీదైన ఫోన్లు ముందుగానే కొనుగోలు చేయాలనుకుంటే ప్లస్ మెంబర్షిప్ ఉంటే మంచి ఛాన్స్ దొరుకుతుంది.

Advertisement

Also Read: అలారం, డోర్‌బెల్, చిన్న పిల్లలు ఏడుపు.. అన్నింటినీ పసిపట్టేసే Apple Watch Series 12!

బ్యాంక్ ఆఫర్ల మోత.. అదనపు డిస్కౌంట్లు:

ఏ సేల్ లోనైనా బ్యాంక్ ఆఫర్లు ఉంటేనే అసలైన మజా వస్తుంది. ఈ లీక్ ప్రకారం HDFC లేదా గతంలో లాగే Axis బ్యాంక్, ICICI బ్యాంక్ కార్డులతో షాపింగ్ చేసే వారికి ఇన్‌స్టెంట్ 10% డిస్కౌంట్ లభించే ఛాన్స్ ఉంది. అయితే ఏయే ప్రాడక్ట్స్‌పై ఈ ఆఫర్ వర్తిస్తుంది? మినిమం పర్చేజ్ ఎంత ఉండాలనే.. రూల్స్ మాత్రం ఫ్లిప్‌కార్ట్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేసిన తర్వాతే క్లారిటీ వస్తుంది.

Advertisement

ఈసారి భారీగా ప్లానింగ్:

గతంలో కూడా ఈ సేల్ సెప్టెంబర్ చివరి వారంలో వచ్చి షాపింగ్ ప్రియులను ఉర్రూతలూగించింది. యాపిల్, శాంసంగ్, మోటరోలా వంటి ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్‌లపై భారీ ధర తగింపులు కనిపించాయి. ఈసారి అంతకంటే ఎక్కువ ఆఫర్లు ఉంటాయని, ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయన్సెస్ మీద భారీగా ధరలు తగ్గుతాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

అధికారిక ప్రకటన కోసం ఆగాల్సిందే:

ఇదంతా సోషల్ మీడియా లీక్ మాత్రమే కాబట్టి..` ఫ్లిప్‌కార్ట్ నుంచి అఫీషియల్ డేట్స్ వచ్చే వరకు కొంచెం వెయిట్ చేయడం మంచిది. మీ విష్ లిస్ట్‌లోని వస్తువులను ఇప్పుడే కార్ట్‌లో యాడ్ చేసి ఉంచుకోండి. సేల్ స్టార్ట్ అయిన వెంటనే స్టాక్ అయిపోక ముందే మీ ఇష్టమైన బ్రాండ్లను సొంతం చేసుకోండి.

Also Read: Whatsappలో ఇక మెసేజ్ లాగే మనీ ట్రాన్స్‌ఫర్.. ఫోన్‌పే, గూగుల్ పేలకు గట్టిపోటీ ఇవ్వడం ఖాయం!

Tags

Related News

రూ.781కే అదిరిపోయే సౌండ్..వినాయక చవితికి పర్ఫెక్ట్

పాత ఫోన్ నెంబర్ మార్చేశారా? తక్షణమే ఈ 4 పనులు చేయకపోతే రిస్కే!

అలారం, డోర్‌బెల్, చిన్న పిల్లలు ఏడుపు.. అన్నింటినీ పసిపట్టేసే Apple Watch Series 12!

ఈ ట్యాబ్ ఉంటే..ల్యాప్ టాప్ అవసరమే లేదు తెలుసా ?

Whatsappలో ఇక మెసేజ్ లాగే మనీ ట్రాన్స్‌ఫర్.. ఫోన్‌పే, గూగుల్ పేలకు గట్టిపోటీ ఇవ్వడం ఖాయం!

పీతల పెంకులతో బ్యాటరీనా? శాస్త్రవేత్తల ప్రయోగం చూస్తే.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

కేవలం 3.8 గ్రాముల బరువు, 50 గంటల బ్యాటరీ లైఫ్.. వివో కొత్త బడ్స్ భారత్‌లో లాంచ్!

Big Stories

Advertisement
×