YS Anil Reddy: ఒకే ఫ్రేమ్‌లో వైఎస్ జగన్.. తమిళనాడు సీఎం విజయ్.. బీఆర్ఎస్ కీలక నేత కేటీఆర్.. దేశంలోని అత్యంత ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ. ఇలాంటి అరుదైన మీట్ ఏదైనా పొలిటికల్ ఈవెంట్‌లో జరిగిందా? లేక ఎన్నికల వ్యూహాలకు సంబంధించిన మీటింగ్‌లో జరిగిందా? కాదు. ఇదంతా జరిగింది ఒక పెళ్లి వేడుకలో. చెన్నైలోని లీలా ప్యాలెస్‌లో జరిగిన ఈ వెడ్డింగ్ ఈవెంట్‌కు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు రాజకీయాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఈ వేడుకలో మరో స్పెషల్ అట్రాక్షన్.. సీఎం విజయ్‌తో కలిసి నటి త్రిష రావడం. ఇవన్నీ చూశాక వచ్చిన ఫస్ట్ క్వశ్చన్.. అసలు ఎవరీ వైఎస్ అనిల్ రెడ్డి? ఆయనకు జగన్‌తో ఉన్న బంధమేంటి? విజయ్‌తో అంత సాన్నిహిత్యం ఎలా ఏర్పడింది? ఇంతమంది రాజకీయ, వ్యాపార ప్రముఖులు ఒకే వేడుకకు ఎందుకు వచ్చారు?
వైఎస్ అనిల్ రెడ్డి గురించి తెలుసుకుందాం..
ముందుగా వైఎస్ అనిల్ రెడ్డి గురించి తెలుసుకుందాం. వైఎస్ అనిల్ రెడ్డి.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి చెందిన వ్యక్తి. వైఎస్సార్ సోదరుడు వైఎస్ జార్జ్ రెడ్డి కుమారుడే ఈ అనిల్ రెడ్డి. అంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి స్వయానా కజిన్. అంటే చిన్నాన్న కుమారుడు. వైఎస్ కుటుంబంతో అనిల్ రెడ్డికి మొదటి నుంచీ చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. జగన్ రాజకీయ ప్రస్థానంలోనూ ఆయన కుటుంబం మద్దతుగా నిలిచింది. అయితే అనిల్ రెడ్డి ఎక్కువగా ప్రత్యక్ష రాజకీయాల్లో కనిపించరు. వ్యాపార రంగంలోనే తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. కడప జిల్లా బద్వేలు రాజకీయాలతోనూ ఆయనకు లింక్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆయన పేరు దేశవ్యాప్తంగా చర్చకు రావడానికి కారణం.. ఆయన కుమార్తె శ్రేయా రెడ్డి వెడ్డింగ్ ఈవెంట్.
అనిల్ రెడ్డి గురించి మరో ఇంట్రెస్టింగ్ విషయం..
అనిల్ రెడ్డి గురించి మరో ఇంట్రెస్టింగ్ విషయం.. ఆయన బిజినెస్ బ్యాక్‌గ్రౌండ్. ఆయన కుటుంబానికి ఆఫ్రికా దేశాల్లోనూ వ్యాపార సంబంధాలు ఉన్నాయి. బేవరేజెస్, డిస్టిలరీస్‌తో పాటు నిర్మాణ రంగం, మైనింగ్, గ్రానైట్, క్వారీయింగ్ వంటి రంగాల్లో బిజినెస్‌లు ఉన్నాయి. ఇక చెన్నై కేంద్రంగా కూడా ఆయన వ్యాపార వ్యవహారాలు కొనసాగుతున్నాయి. అంటే వైఎస్ కుటుంబంతో రాజకీయ, వ్యక్తిగత సంబంధాలు ఒకవైపు ఉంటే.. మరోవైపు వ్యాపార రంగంలోనూ ఆయనకు విస్తృతమైన పరిచయాలు ఉన్నాయన్నమాట. అయితే ఆయనకు సంబంధించిన వ్యాపారాల విలువ, ఆఫ్రికాలో ఉన్న వ్యాపార సామ్రాజ్యంపై సరైన క్లారిటీ లేదు కానీ.. ఆయన బిజినెస్ ఎంపైర్ మాత్రం చిన్నది కాదని అర్థమవుతుంది.
ఆయన చుట్టూ ఉన్న ముఖ్యమైన వ్యక్తులు ఎవరు?
ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం. తమిళనాడు సీఎం విజయ్‌తో అనిల్ రెడ్డికి మంచి పరిచయాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది. విజయ్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆయన చుట్టూ ఉన్న ముఖ్యమైన వ్యక్తులు ఎవరు? ఆయనకు సలహాలు ఇచ్చేవారెవరు? తెరవెనుక ఎవరున్నారు? అనే అంశాలపై అనేక చర్చలు జరిగాయి. ఈ టైమ్‌లో కూడా అనిల్ రెడ్డి పేరు కూడా వినిపించింది. విజయ్‌తో ఆయనకు ఉన్న సాన్నిహిత్యం ఈ పెళ్లి వేడుకతో మరోసారి చర్చకు వచ్చింది.
సీఎం విజయ్‌తో నటి త్రిష..
వైఎస్ జగన్ తన భార్య భారతి రెడ్డితో కలిసి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. వైఎస్ విజయమ్మ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. తమిళనాడు సీఎం విజయ్ తన తల్లి శోభా చంద్రశేఖర్‌తో కలిసి వచ్చారు. నటి త్రిష కూడా ఆయనతో పాటు ఈ వేడుకలో కనిపించారు. మరోవైపు తెలంగాణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన భార్య శైలిమతో కలిసి అటెండ్ అయ్యారు. ఇక దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ కూడా ఈ వేడుకకు రావడం మరో స్పెషల్ అట్రాక్షన్. వీళ్లంతా ఒకే వేదికపై కనిపించడంతో రాజకీయ, వ్యాపార వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ముఖ్యంగా జగన్, విజయ్, కేటీఆర్ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకోవడం.. కలిసి ఫొటోలు దిగడం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇక విజయ్, త్రిష కలిసి రావడం కూడా మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.
ఇన్‌డైరెక్ట్‌గా ఏదైనా పొలిటికల్ స్టేట్‌మెంట్ ఇస్తున్నారా?
ఇప్పుడు అసలు ప్రశ్న.. ఒకే పెళ్లి వేడుకలో ఇంతమంది ప్రముఖులు కనిపించి ఇన్‌డైరెక్ట్‌గా ఏదైనా పొలిటికల్ స్టేట్‌మెంట్ ఇస్తున్నారా? ఏపీ రాజకీయాల్లో జగన్ కీలక నేత. తెలంగాణలో కేటీఆర్ బీఆర్ఎస్‌కు ముఖ్యమైన నాయకుడు. తమిళనాడులో విజయ్ సీఎం. ఇక అదానీ దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త. ఈ నలుగురూ ఒకే వేదికపై కనిపించడంతో 2029 రాజకీయ సమీకరణాలపై కూడా సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. దక్షిణాది రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడబోతున్నాయా? వివిధ రాష్ట్రాల నేతల మధ్య కొత్త సంబంధాలు బలపడుతున్నాయా? వ్యాపార, రాజకీయ వర్గాల మధ్య కొత్త పరిచయాలకు ఈ వేడుక వేదికైందా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి..
కానీ ఇక్కడ ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి. ఒకే వివాహ వేడుకకు హాజరవడం అంటే రాజకీయ పొత్తు కుదిరిందని కాదు. కలిసి ఫొటో దిగడం అంటే భవిష్యత్తులో కలిసి పనిచేస్తారని కూడా కాదు. ఇప్పటివరకు ఈ కలయిక వెనుక ఏదైనా రాజకీయ వ్యూహం ఉందా అంటే ఔనని చెప్పేందుకు ఎలాంటి ప్రూఫ్స్ అయితే లేవు. కాబట్టి ఈ వేడుకను ప్రస్తుతానికి ప్రముఖుల మధ్య ఉన్న వ్యక్తిగత పరిచయాలు, కుటుంబ సంబంధాలు, స్నేహాలకు వేదికగా చూడటమే కరెక్ట్.
దేశవ్యాప్తంగా చర్చ!
ఒక పెళ్లి వేడుక.. కానీ చర్చ మాత్రం మూడు రాష్ట్రాల రాజకీయాల నుంచి దేశ వ్యాపార రంగం వరకు జరిగింది. వైఎస్ కుటుంబ నేపథ్యం.. అనిల్ రెడ్డి వ్యాపార పరిచయాలు.. విజయ్‌తో సాన్నిహిత్యంపై ప్రచారం.. జగన్, కేటీఆర్, అదానీ వంటి ప్రముఖుల హాజరు.. ఇవన్నీ కలిసి ఈ వేడుకను హాట్ టాపిక్‌గా మార్చాయి.
Also Read: హైదరాబాద్‌కు జలగండం.. ఈ వాటర్ ఎమర్జెన్సీకి కారణమేంటి?