E-Paper
Advertisement

మౌనీ రాయ్, సూరజ్ నంబియార్ విడాకులపై క్లారిటీ.. ప్రైవసీ కోరుతూ..

మౌనీ రాయ్, సూరజ్ నంబియార్ విడాకులపై క్లారిటీ.. ప్రైవసీ కోరుతూ..
Advertisement

Mouni Separation: గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సినీ వర్గాల్లో హల్ చల్ చేస్తున్న పుకార్లకు తెరదించుతూ, బాలీవుడ్ నటి మౌనీ రాయ్, ఆమె భర్త, వ్యాపారవేత్త సూరజ్ నంబియార్ తాము విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు వెల్లడించారు. దీంతో ఎన్నో రోజులగా సోషల్ మీడియాలో వీరిద్దరిపై వస్తున్న వర్తలకు తెర పడినట్లు అయింది.

Read also-Podarillu Today Episode : చక్రీ ఇంటికి వచ్చిన హారిక..ఇబ్బందుల్లో పడ్డ శైలు.. చక్రికీ షాకిచ్చిన హారిక..

ప్రకటనలో ఏముందంటే?

Advertisement

తమ వ్యక్తిగత జీవితంపై వస్తున్న అతిగా స్పందించే వార్తలపై వారు అసహనం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ద్వారా విడుదల చేసిన ఒక ప్రకటనలో ఇలా పేర్కొన్నారు. “మా వ్యక్తిగత జీవితంలోకి మీడియా అనవసరంగా జోక్యం చేసుకోవడం మాకు బాధ కలిగిస్తోంది. మేము విడిపోవాలని నిర్ణయించుకున్నామని తెలియజేస్తున్నాము. ఈ విషయాన్ని ప్రశాంతంగా, పరస్పర గౌరవంతో పరిష్కరించుకోవడానికి మాకు కొంత సమయం కావాలి.” అం

పుకార్లపై స్పందన

గత కొద్ది రోజులుగా వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం, ఫోటోలు తొలగించడం వంటి చర్యల వల్ల విడాకుల వార్తలు తీవ్రమయ్యాయి. కొన్ని కథనాల్లో తప్పుడు ప్రచారాలు కూడా వచ్చాయి. దీనిపై వారు స్పందిస్తూ, “మా బంధం గురించి వస్తున్న కల్పిత కథనాలు, అవాస్తవాలు మా మధ్య ఉన్న వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించవు. వ్యక్తిగత ప్రాధాన్యతలు మారడం వల్ల గౌరవపూర్వకంగా విడివిడిగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాము” అని తెలిపారు.

Advertisement

Read also-Illu Illalu Pillalu Today Episodes: కొత్త కారు కొన్న ధీరజ్.. ఫీల్ అవుతున్న ప్రేమ..విశ్వం రీ ఎంట్రీ అదుర్స్..

స్నేహాన్ని కొనసాగిస్తాం

విడిపోయినప్పటికీ తమ మధ్య ఉన్న స్నేహాన్ని ఎప్పటికీ గౌరవిస్తామని వారు స్పష్టం చేశారు. కష్టకాలంలో తమ వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాలని, తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దని మౌనీ రాయ్ ప్రత్యేకంగా అభ్యర్థించారు. మౌనీ రాయ్, సూరజ్ నంబియార్ జనవరి 27, 2022న గోవాలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. బెంగాలీ, మలయాళీ సంప్రదాయాల ప్రకారం జరిగిన వీరి పెళ్లి ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దుబాయ్‌కు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ అయిన సూరజ్‌తో మౌనీ కొంతకాలం ప్రేమలో ఉన్న తర్వాత వివాహం చేసుకున్నారు. కేవలం రెండున్నరేళ్ల వైవాహిక బంధం తర్వాత ఈ జంట విడిపోవడం వారి అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×