Upcoming Telugu Movies : ప్రతినెల కొత్త సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ ఏడాది సమ్మర్ కాస్త చెప్పగా ఉందని మూవీ లవర్స్ అభిప్రాయపడుతున్నారు.. మార్చిలో రిలీజ్ కావాల్సిన సినిమాలు పోస్ట్ పోన్ అయ్యాయి. ఆ తర్వాత కాశ్మీర్ పహల్ గా మాలో జరిగిన ఉగ్రదాడి వల్ల మిగిలిన సినిమాలు మరోసారి పోస్ట్ పోన్ అయ్యాయి. దాంతో అప్పుడు థియేటర్లోకి రావాల్సిన సినిమాలని జూలైకి షిఫ్ట్ అయ్యాయి. జూన్ నెల మంచు విష్ణు కన్నప్ప, తమిళ హీరో ధనుష్ కుబేర సినిమాలు మంచి ఊపునిచ్చాయి. ఇక ఈ నెలలో స్టార్ హీరోల సినిమాలు వరుసగా రిలీజ్ కాబోతున్నాయి. జూలైలో థియేటర్లలోకి రాబోతున్న సినిమాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం..
జూలైలో థియేటర్లలోకి రాబోతున్న సినిమాలు ఇవే..
నితిన్ ‘ తమ్ముడు’..
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఈ ఏడాది రాబిన్ హుడ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో థియేటర్లలోకి రిలీజ్ అయిన ఆ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇప్పుడు భారీ అంచనాలతో తమ్ముడు సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. వకీల్ సాబ్’ ఫేం వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించగా… సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించారు. సీనియర్ హీరోయిన్ లయ చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చారు. బ్రదర్, సిస్టర్ సెంటిమెంట్‌తో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీ తో సినిమా రాబోతుంది. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని నిర్మించారు. ఈనెల 4న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది.
అనుష్క ‘ఘాటి’..
టాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్క శెట్టి చాలా కాలం తర్వాత ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ఘాటి.. ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతంలోని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా హిట్ అయ్యే ఛాన్సెస్ బాగానే ఉన్నాయని వినిపిస్తోంది.. జూలై 11న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.
Also Read:
పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’..
టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత నటించిన లేటెస్ట్ చిత్రం హరిహర వీరమల్లు.. పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం దాదాపు ఆరేళ్లుగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ . ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ మూవీ జులై 24న గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది.. ఈ నెలలో రిలీజ్ కాబోతున్న అన్ని సినిమాలతో పోలిస్తే ఈ సినిమా పై కాస్త ఎక్కువగా అంచనాలే ఉన్నాయి..
ఈ సినిమాలతో పాటుగా టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న కింగ్ డమ్ మూవీ కూడా రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. మరి ఈ సినిమాలలో ఏ సినిమాకు ప్రేక్షకులు ఎక్కువ మార్కులు వేస్తారో అన్నది హాట్ టాపిక్ గా మారింది.. ఏది ఏమైనా కూడా ఈ నెలలో రిలీజ్ కాబోతున్న సినిమాలన్నీ కూడా కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపించడంతో ప్రేక్షకులు సినిమాలను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. జూలై వినరు ఎవరో చూడాలి..