BigTV English

SVC Productions: మైత్రీ వాళ్లు మోసం చేశారు.. నిజాలు బయటపెట్టిన నిర్మాత!

SVC Productions: మైత్రీ వాళ్లు మోసం చేశారు.. నిజాలు బయటపెట్టిన నిర్మాత!

SVC Productions:శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ అధినేత దిల్ రాజు (Dilraju )తమ్ముడు.. SVC ప్రొడ్యూసర్స్ లో ఒకరైన శిరీష్(Sirish ) ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. తాజాగా మైత్రీ మూవీ నిర్మాతలు తమను మోసం చేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూనే అసలు నిజాలు బయటపెట్టారు శిరీష్. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శిరీష్ మాట్లాడుతూ.. మైత్రీ వారిని నమ్మి మేము మోసపోయాము.. వాళ్ల వల్ల మాకు కోట్లల్లో నష్టం కలిగింది అంటూ చెప్పడమే కాకుండా ఏ చిత్రాల ద్వారా నష్టపోయారు? అనే విషయంపై కూడా క్లారిటీ ఇచ్చారు


మైత్రీ వాళ్లు మమ్మల్ని మోసం చేశారు – నిర్మాత శిరీష్

శిరీష్ మాట్లాడుతూ.. నాగచైతన్య (Naga Chaitanya)నటించిన ‘సవ్యసాచి’ మూవీకి మైత్రీ వాళ్లు రూ.5.50 కోట్లు అడిగారు. అయితే నాగచైతన్య కి ఉన్న మార్కెట్ ప్రకారం ఆయన మీద అంత పెట్టలేం అనుకున్నాము. ఇదే విషయాన్ని చెబితే నష్టం వస్తే మేము కవర్ చేస్తామని మమ్మల్ని నమ్మబలికారు. దీంతో వారు చెప్పిన మాటలను మేము నమ్మాము. అందులో భాగంగానే వారు చెప్పిన ధరకే మేము సినిమా హక్కులు కొనుగోలు చేశాము. కట్ చేస్తే మాకు రూ.3.5 కోట్ల నష్టం వచ్చింది. ఇదే విషయంపై అడిగితే స్పందించలేదు.


సవ్యసాచి మాత్రమే కాదు గ్యాంగ్ లీడర్ వల్ల కూడా..

నాగచైతన్య సవ్యసాచి మూవీ మాత్రమే కాదు నాని(Nani ) ‘గ్యాంగ్ లీడర్’ వల్ల కూడా మేము నష్టపోయాము. నాని నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రానికి రూ. 7 కోట్ల ఎన్ఆర్ఏ అడిగారు. కానీ ఆ సినిమా వల్ల కూడా రూ.1.75 కోట్లు నష్టం వచ్చింది. అలా మొత్తానికి మాకు మైత్రీ వల్ల మొత్తంగా రూ.5.25 కోట్ల మేర నష్టం వాటిల్లింది అంటూ శిరీష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ ఇండస్ట్రీలో బడా నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకున్న మైత్రి మేకర్స్ ఇలా మోసం చేయడం ఏంటి అంటూ కామెంట్ చేస్తున్నారు.

సవ్యసాచి చిత్రం విశేషాలు..

సవ్యసాచి సినిమా విషయాన్నికొస్తే.. 2018లో యాక్షన్ డ్రామా నేపథ్యంలో విడుదలైన తెలుగు చిత్రం ఇది. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, సివి మోహన్, వై రవిశంకర్ నిర్మించారు. నాగచైతన్య, మాధవన్, నిధి అగర్వాల్, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటించడం జరిగింది. ఇక ఈ సినిమా హక్కులను మైత్రి మేకర్స్ నుండి కొనుగోలు చేసిన ఎస్విసి నిర్మాతలు రూ.3.5కోటికి పైగా నష్టపోయినట్లు తెలిపారు.

గ్యాంగ్ లీడర్ సినిమా విశేషాలు..

నాచురల్ స్టార్ నాని హీరోగా 2019 సెప్టెంబర్ 13న విడుదలైన చిత్రం గ్యాంగ్ లీడర్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసిన ఎస్విసి ప్రొడక్షన్స్ వారు 1.75 కోట్ల మీద నష్టపోయినట్లు శిరీస్ తెలిపారు. మొత్తానికి అయితే హీరోల మీద నమ్మకంతో నిర్మాతలు చెప్పిన రేట్లకు వీరు కొనుగోలు చేసి సరిగ్గా థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించలేక నష్టాన్ని చవిచూసినట్లు సమాచారం.

also read:SVC Producer: గేమ్ ఛేంజర్ డిజాస్టర్ తర్వాత రామ్ చరణ్ కనీసం పట్టించుకోలేదు.. నష్టపోయాం అంటూ నిర్మాత ఆవేదన!

 

Related News

Anushka Shetty: అనుష్క మార్కెట్ రూ. 25 కోట్లలోపే… యంగ్ హీరోయిన్ బెటర్ కదా..

Keerthy Suresh: Ai తెచ్చిన తంటా, ఏకంగా మహానటికే బట్టలు లేకుండా చేశారు

Mega Blast Glimpse : విశ్వంభర గ్లిమ్స్ అవుట్, ఇక ట్రోలింగ్ కు ఆస్కారమే లేదు

Tvk Mahanadu : TVK మహానాడు లో తొక్కిస‌లాట… స్పాట్ లోనే 400 మంది?

Thalapathy Vijay : విఎఫ్ఎక్స్ లేదు, సిజి లేదు. విచ్చలవిడిగా జనం

Cine Workers Strike : సినీ కార్మికుల సమ్మెలో బిగ్ ట్విస్ట్… నోటీసులు జారీ చేసిన లేబర్ కమిషన్

Big Stories

×