SKN:నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న శ్రీనివాస్ కుమార్(Srinivas Kumar) అలియాస్ ఎస్కేఎన్ మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి సన్నిహితుడు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక నిర్మాతగా ఎస్కేఎన్ పలు సినిమాలను నిర్మించడమే కాదు మాస్ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ హౌస్ (Mass Movie makers production House)కి సహ వ్యవస్థాపకుడిగా కూడా. అయితే నిర్మాత ఎస్కేఎన్(SKN) తన సినిమాలను ప్రమోట్ చేసుకోవడమే కాకుండా ఇతర నిర్మాతల సినిమాలను,చిన్న సినిమాలను ఎక్కువగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎంతో మంది తెలుగు అమ్మాయిలని ఎస్కేఎన్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశారు.అయితే అలాంటి ఎస్కేఎన్ తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ పెట్టి మళ్ళీ డిలీట్ చేశారు. ఇక ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్లు ఇదేంటి ఎస్కేఎన్ అలాంటి ఒక షాకింగ్ పోస్ట్ పెట్టి మళ్ళీ సడన్గా డిలీట్ చేశారు. అది ఎవరిని ఉద్దేశించి అని మాట్లాడుకుంటున్నారు. మరి ఇంతకీ ఎస్కేఎన్ సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన ఆ పోస్ట్ ఏంటి..? ఎందుకు డిలీట్ చేశారనేది ?ఇప్పుడు తెలుసుకుందాం..
మంచితనం నష్టానికి కారణం అంటున్న ఎస్కేఎన్..
నిర్మాత ఎస్కేఎన్ తాజాగా తన ఎక్స్ ఖాతాలో “అతిగా మంచితనాన్ని చూపడం వల్ల ఇతరులు నీ మంచితనాన్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది” అంటూ ఒక పోస్ట్ పెట్టారు. అయితే ఈ పోస్ట్ పెట్టిన కొద్ది క్షణాలకే మళ్లీ దాన్ని డిలీట్ చేశారు. అయితే ఈ పోస్ట్ పెట్టిన సెకండ్లలోనే వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్లు ఎస్కేఎన్ కి ఏమైంది..? ఎందుకు ఇలాంటి పోస్ట్ పెట్టారు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఓ నెటిజన్ అయితే..” పండ్లు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నా.. మిమ్మల్ని ఎవరు మోసం చేశారు.. మిమ్మల్ని మోసం చేయడానికి వాళ్లకు మనసు ఎలా వచ్చింది” అంటూ షాకింగ్ కామెంట్ పెట్టాడు. అయితే నిర్మాత ఈ పోస్టు ఎవరిని ఉద్దేశించి పెట్టారో ఎందుకు పెట్టారో తెలియాల్సి ఉంది.
ఆ స్టార్ నిర్మాతను ఉద్దేశించేనా..?
అది ఓ స్టార్ నిర్మాతను ఉద్దేశించి SKN ట్వీట్ వేసి ఉంటాడు అనే చర్చ ఇండస్ట్రీలో నడుస్తోంది. ఈ మధ్య కాలంలో ఆ స్టార్ నిర్మాత.. టాలీవుడ్ లో ఓ టాప్ హీరోతో సినిమా చేశాడు. ఆ సినిమా కాస్త డిజాస్టర్ అయింది. నిర్మాత చాలా వరకు నష్టపోయాడు. ఈ టైంలో ఆ సినిమా గురించి, ఆ హీరో గురించి ఆ నిర్మాత మాట్లాడుతున్నాడు.
దీనికి కౌంటర్‌గానే SKN ట్వీట్ వేసి ఉంటాడని తెలుస్తుంది. అయితే, ట్వీట్ వేసిన వెంటనే ఆయన డిలీట్ చేయడం వెనక ఉన్న కారణాలు ఏంటో తెలీదు.
ఎస్కేఎన్ వివాదాలు..
ఇక ఎస్కేఎన్ వివాదాల విషయానికొస్తే.. ఈయన గతంలో తెలుగు అమ్మాయిలని ఇండస్ట్రీకి పరిచయం చేయడమే తప్పు అన్నట్లుగా మాట్లాడి.. మళ్లీ ఆ వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చుకున్నారు. నేను అలా మాట్లాడలేదని, కొంతమంది కావాలనే నా పైన నెగిటివ్ గా క్రియేట్ చేశారని చెప్పారు. అంతేకాకుండా నటి కేతిక శర్మ (Kethika Sharma) పై కూడా ఓ సినిమా ఈవెంట్లో అసభ్య వ్యాఖ్యలు చేశారు. నేను బాత్రూం సింగర్ ని అని కేతిక శర్మ చెబితే.. ఇప్పుడు మీ బాత్రూంలోకి మాకు ఎంట్రీ లేదు కానీ ఇక్కడ పాడండి అంటూ మాట్లాడి ట్రోలింగ్ కి గురయ్యారు. అలా తరచూ వివాదాల పాలవుతున్న ఎస్కేఎన్ ఇండస్ట్రీలో ఉన్న ట్రోలింగ్ పై ఇలా పోస్ట్ చేశారా.. ? లేక తన పర్సనల్ లైఫ్ గురించి ఈ పోస్ట్ పెట్టారా. అనేది తెలియాల్సి ఉంది. ఇక నిర్మాతగా ఎస్కేఎన్ బేబీ (Baby),మా ఊరి పొలిమేర(Ma Voori Polimera), టాక్సీవాలా (Taxiwala) వంటి సినిమాలను నిర్మించారు.
also read:SVC Productions: మైత్రీ వాళ్లు మోసం చేశారు.. నిజాలు బయటపెట్టిన నిర్మాత!
పండ్లు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్న.
అయినా మిమ్మల్ని ఎవరు మోసం చేశారు?
వాళ్లకు మనసు ఎలా వచ్చింది? @SKNonline pic.twitter.com/ZJAeGV7mBq— Gajala From Washington DC (@GajalaFrmWDC) July 1, 2025