BigTV English

Theater Movies : రేపు థియేటర్లలో సందడి చెయ్యబోతున్న చిత్రాలు.. వీటిని డోంట్ మిస్..

Theater Movies : రేపు థియేటర్లలో సందడి చెయ్యబోతున్న చిత్రాలు.. వీటిని డోంట్ మిస్..

Theater Movies : ఈనెల బోలెడు సినిమాలు థియేటర్లలోకి వచ్చేసాయి. ఇప్పటివరకు రిలీజ్ అయిన సినిమాలు మంచి టాక్ ని సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం వార్ 2, కూలీ చిత్రాలు థియేటర్లలో రన్ అవుతున్నాయి. ఒకవైపు మిక్స్డ్ టాక్ ని అందుకున్న సరే కలెక్షన్ల పరంగా మాత్రం బాక్సాఫీస్ ని షేర్ చేసేలా కోట్లు కొల్లగొట్టేస్తున్నాయి. ఈ వారం బోలెడు సినిమాలు థియేటర్లలోకి రిలీజ్ కాబోతున్నాయి. అయితే తెలుగు సినిమాలు కన్నా హాలీవుడ్ సినిమాలే ఎక్కువగా ఈ వారం సందడి చేయబోతున్నాయని తెలుస్తుంది. ఇక ఆలస్యం ఎందుకు రేపు థియేటర్లలోకి రాబోతున్న సినిమాలు ఏంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..


తెలుగులో ఈ వారం చిన్న సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. బ్యూటిఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నటించిన పరదా మూవీ కూడా ఉంది. ఇప్పటికే విమర్శలు అందుకున్న ఈ సినిమా థియేటర్ లోకి వచ్చిన తర్వాత ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో చూడాలి. అలాగే నరేశ్ ఆగస్త్య మేఘాలు చెప్పిన ప్రేమ కథ, నారాయణ మూర్తి నటించి, దర్శకత్వం వహించిన యూనివర్సిటీ పేపర్ లీక్ వంటి మూడు స్ట్రెయిట్ చిత్రాలు విడుదలవుతున్నాయి.. అయితేతమిళ, పంజాబీ, భాషల్లో ఒకటి చొప్పున, అస్సామీస్, మరాఠి, మలయాళ భాషల్లో రెండేసి సినిమాలు విడుద కానున్నాయి. అన్ని భాషల్లో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కానీ హిందీలో మాత్రం ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దేశవ్యాప్తంగా రేపు థియేటర్లలో కి రాబోతున్న సినిమాలు ఏంటో చూద్దాం..

శుక్రవారం థియేటర్లలోకి రిలీజ్ అవుతున్న సినిమాలు ఇవే.. 


తెలుగు..

పరదా

యూనివర్సిటీ పేపర్ లీక్

మేఘాలు చెప్పిన ప్రేమ కథ

కన్నడ..

హచ్చే

కమరొట్టు 2

జస్ట్ మ్యారిడ్

లవ్ మ్యాటరు

సన్ ఆఫ్ ముత్తన్న

మారాఠి.. 

ప్రేమాచి గోస్తా

బెటారాఫ్ లవ్‌స్టోరి

పంజాబీ.. 

పాపే కుత్తియాన్

ఇంగ్లీష్.. 

రిలే

నో బడి2

విచ్‌బోర్డ్

బ్రింగ్ హర్ బ్యాక్

తమిళ్.. 

ఇంద్ర

అస్సామీస్..

తారీఖ్

జోథా

Also Read: రామరాజు రైస్ మిల్లులో దొంగతనం.. నర్మద తెలివికి ఫిదా.. తప్పు ఒప్పుకున్న భాగ్యం..

ఆగస్టు లో మాత్రం చివరి వారంలో చెప్పుకోదగ్గ సినిమాలయితే లేవు కానీ సెప్టెంబర్ మొదటి వారం లో మాత్రం స్టార్ హీరోలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడుతున్నారు.. మరి ఈ పోటీ లో ఏ హీరో విన్నర్ గా నిలుస్తాడో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. పెద్ద సినిమాలే వరసగా క్యూ కట్టడంతో థియేటర్లకు మళ్ళీ కళ వస్తుందనే నమ్మకం తో బయ్యర్లు ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ 5న క్రేజీ సినిమాలు థియేటర్లోకి రాబోతున్నాయి.. మరి సెప్టెంబర్ లో తాకిడిలా రాబోతున్న కొత్త రిలీజుల్లో ఎవరు నెగ్గుతారో ఎవరు తగ్గుతారో ఇంకొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది. ఏ మూవీ హిట్ అవుతుందో చూడాలి.. టాలీవుడ్ లో చెప్పుకోదగ్గ బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలు పడలేదు. కనీసం సెప్టెంబర్ నెలలో అయిన హిట్ సినిమాలు పడతాయేమో చూద్దాం..

Related News

Udayabhanu: వారికి భయపడి పవన్ కళ్యాణ్ మూవీ మిస్ చేసుకున్నా – ఉదయభాను

Vishwambhara Update: విశ్వంభర నుండీ బిగ్ అప్డేట్.. రిలీజ్ డేట్ ప్రకటించిన చిరంజీవి!

Shahrukh Khan: చేతికి గాయంపై స్పందించిన షారుఖ్.. ఒక్క చెయ్యి సరిపోతుందంటూ?

Thalapathy Vijay: ప్రాణం తీసిన జెండా, విజయ్ టీవీకే పార్టీ కి ఇబ్బందులు

AA22xA6: బన్నీ మూవీలో కోలీవుడ్ స్టార్.. త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్!

Big Stories

×