Illu Illalu Pillalu Today Episode August 21st : నిన్నటి ఎపిసోడ్ లో.. నర్మద వాళ్ళకి మనం దొరికితే ఖచ్చితంగా మన బండారం బయట పెడతారని అక్కడనుంచి ఎలాగైనా ఊడయించాలని భాగ్యం ఆనందరావు అనుకుంటారు.. ఉదయం భాగ్యం ఆనందరావు ఇంటిని కాళీ చేసి వెళ్లిపోవాలని అనుకుంటారు. అయితే తలుపు తీయగానే ఎదురుగా నర్మదా ప్రేమలు అక్కడ ఉంటారు. మేము ఇంత పగడ్బందీగా ప్లాన్ చేస్తే మీరు ఎలా వచ్చారు అని ఆనందరావు అడుగుతారు. అయితే ఇలా వచ్చాము అని నర్మదా లొకేషన్ అడ్రస్ ని చూపిస్తుంది. అది చూసిన ఆనంద్ రావు భాగ్యం ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మాకు రెండిల్లు ఉన్నాయి. కోట్ల ఆస్తుంది.. మేము కోటీశ్వరులం అని చాలా గొప్పగా చెప్పుకున్నారు కదా ఇవేనా మీకున్న ఆస్తి అని నర్మదా అంటుంది. మీ ఇల్లు చాలా బాగుంది ఈ విషయాన్ని వెంటనే మావయ్య గారికి చెప్పాలి అని నర్మదా, ప్రేమ బయలుదేరుతారు.. శ్రీవల్లి నర్మద, ప్రేమలకు వార్నింగ్ ఇస్తుంది. దాంతో నిజం చెప్పాలని అనుకుంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. నర్మదా ప్రేమలు శ్రీవల్లి వల్ల తల్లిదండ్రులు బాగోతాన్ని బయట పెట్టాలని ఇంటికి ఆవేశంగా వస్తారు. వాళ్ళని అడ్డుకున్న శ్రీవల్లి మాత్రం ఎక్కడ తగ్గకుండా నా గురించి నా ఇంటి విషయాల గురించి చెప్పడానికి నువ్వు ఎవరు అని వాళ్ళతో అంటుంది.. ఎక్కడ పశ్చాత్తాపం పడకుండా మా గురించి చెప్పడానికి నువ్వెవరు అని అడుగుతున్నావు అని ప్రేమ దిమ్మ తిరిగిపోయేలా శ్రీవల్లికి క్లాస్ పీకుతుంది. నర్మదా, ప్రేమ రామరాజు దగ్గరికి వచ్చి మావయ్య గారు మీకు ఒక విషయం చెప్పాలి అని అడుగుతారు.. ఏంటమ్మా ఎవరి గురించి అని రామరాజు అడుగుతాడు. వల్లి అక్క గురించి అని అనే లోపల రామరాజుకి ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ రాగానే టెన్షన్ పడుతూ ఉంటాడు. వేదవతి ఏమైందని అడుగుతుంది..
మన రైస్ మిల్లులో దొంగలు పడి ఐదు లక్షలు దోచుకుని వెళ్లారంట నేను వెళ్తున్నాను అని వెళ్తాడు. శ్రీవల్లి మాత్రం ఇప్పుడు ఆగిపోయారు మరి కాసేపట్లో ఈ విషయాన్ని చెప్పేసి నాకు కాపురాన్ని కూల్ చేస్తారని టెన్షన్ పడుతూ ఉంటుంది. సింహాద్రి మిల్లులోని వర్కర్స్ అందరినీ నిలబెట్టి ఎవరు దొంగతనం చేశారో చెప్పండి అని అడుగుతారు.. అప్పుడే రామరాజు ఫ్యామిలీ అక్కడికి వస్తుంది. రామరాజు ఏమైంది సింహాద్రి ఎవరు దొంగతనం చేసారో తెలిసిందా ఎవరైనా బయటికి వెళ్లారు ఇక్కడ నుంచి అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాడు.
అయితే అందరూ ఎవరు దొంగతనం చేశారో చెప్పండి అని అడుగుతారు నర్మద మాత్రం రైస్ మిల్లులో ఏదో అనుమానంగా అనిపిస్తుందని వెతుకుతుంది.. అక్కడున్న దెబ్బనకి రక్తం అంటుకోవడం చూసి సింహాద్రిపై అనుమానం వస్తుంది. అయితే నర్మదా చివరికి సింహాద్రి దొంగతనం చేసిందని పట్టు పట్టిస్తుంది. ఆ మాట వినగానే రామరాజు ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. నేను ఎవరి మీద అయితే నమ్మకాన్ని పెట్టుకున్నానో.. వాళ్లే నన్ను ఇంతగా మోసం చేశారు డబ్బుల గురించి నేను ఆలోచించట్లేదు నా నమ్మకానికి సంబంధించిన విషయం ఇది అని బాధపడతాడు రామరాజు.
రామరాజు బాధను చూసిన ముగ్గురు కొడుకులు పక్కకు వచ్చేసి నాన్నని ఎప్పుడు మోసం చేయకూడదని ఆలోచిస్తూ ఉంటారు.. వాళ్లు రామరాజుకు చెప్పకుండా దాచిన విషయాన్ని ఎప్పటికీ చెప్పకూడదు అని అనుకుంటారు. శ్రీవల్లి తన బండారం ఎక్కడ బయటపడుతుందని పరిగెత్తుకుంటూ తన పుట్టింటికి వెళ్తుంది.. ఇంట్లో జరిగిన విషయాన్ని తన తల్లితో పంచుకుంటుంది. ఇంట్లో భాగ్యం ఆనందరావు టెన్షన్ పడుతూ ఉంటారు.
శ్రీవల్లి ఇంట్లోకి రావడం చూసి అమ్ముడు ఇంట్లోంచి గెంటేసారా అని అడుగుతాడు.. భాగ్యం ఏమైంది అమ్మడు ఏం జరిగింది చెప్పవే అని కంగారుపడుతూ అడుగుతుంది.. నేను నువ్వు చెప్పినట్లే అంతా చెప్పానమ్మా కానీ వాళ్ళు నా మాటని అస్సలు వినడం లేదు.. రైస్ మిల్లు దొంగలు పడ్డారని వెళ్లారు ఇప్పుడు ఇంటికి రాగానే కచ్చితంగా ఈ విషయాన్ని మావయ్యకి చెప్పేస్తారు అని కంగారుపడుతూ చెప్తుంది శ్రీవల్లి.. భాగ్యం మాత్రం ఏదో ఒకటి చేద్దాం నువ్వు టెన్షన్ పడకు అని శ్రీవల్లికి ధైర్యం చెబుతుంది..
శ్రీవల్లి ఏంటి ఏదో ఒకటి చేస్తావా ఆగుతల నాకు కాపురం కూలిపోయేలా ఉందని నాకు గుండె ఆగిపోయినంత పనిలో ఉంది. నువ్వు మాత్రం ఏదో చేస్తానంటున్నావ్ ఏంటి ఇంకేముంది చేయడానికి అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇలాంటి వద్దు అని ముందు నుంచి చెప్పాను కానీ నువ్వు తప్పు మీద తప్పుచేసి నా జీవితాన్ని ఇరకటంలో పడవేశావు. ఇప్పుడు నాకు చావడం తప్ప వేరే దారే లేదు అని శ్రీవల్లి కన్నీళ్లు పెట్టుకుంటుంది. నా భర్త చాలా మంచివాడు. దేవుళ్ళంటి అత్తమామల్ని మోసం చేశాను..
Also Read : అవనిని పార్వతి క్షమిస్తుందా..? పల్లవి మాస్టర్ ప్లాన్.. అక్షయ్ కు నిజం తెలుస్తుందా..?
అంత మంచి కుటుంబానికి కోడలుగా వెళ్ళినందుకు సంతోషపడ్డాను కానీ నా సంతోషం మూడునాళ్ల ముచ్చటగానే మారిపోయింది.. మనం పేదవాళ్ళం మనం ముందే చెప్పింటే ఇలాంటి బాధలు మనకు ఎదురయ్యేవి కాదు నా భర్తతో నేను సంతోషంగా ఉండేదాన్ని అని శ్రీవల్లి బాధపడుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..