Kangana Ranaut:బాలీవుడ్ నటుడు కంగనా రనౌత్(Kangana Ranaut) మోడలింగ్ రంగంలో రాణించి.. హీరోయిన్ గా మారి బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్లలో ఒకరిగా పేరు తెచ్చుకుంది. అయితే ఉన్నట్టుండి హీరోయిన్ గా ఉన్న తన కెరీర్ ని రాజకీయ నాయకురాలుగా మార్చుకుంది. సడన్గా సినిమాల నుండి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి బిజెపి(BJP) పార్టీ తరఫున హిమాచల్ ప్రదేశ్ లోని మండి (Mandi) లోక్సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎంపీ కూడా అయింది.
రాజకీయాలలో సంతృప్తిగా లేను – కంగనా
అలా ప్రజాసేవలోకి అంకితం అవ్వాలని రాజకీయాల్లోకి వచ్చిన కంగనా తాజాగా రాజకీయాల్లో నేను సంతృప్తిగా లేనని, రాజకీయాల్లో నాకు మరో మెట్టు ఎక్కే ఆలోచన లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో కంగనా రనౌత్ మాటలు నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది కంగనా రనౌత్ రాజకీయాలకు గుడ్ బై చెబుతుందా? ఏంటి? అని మాట్లాడుకుంటున్నారు. మరి ఇంతకీ కంగనా రనౌత్ ఆ ఇంటర్వ్యూలో ఏం మాట్లాడింది? రాజకీయాల్లో ఆమె సంతృప్తిగా లేదనే మాటల వెనుక ఉన్న అంతరార్థం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
రాజకీయ భవిష్యత్తుపై కంగనా ఊహించని కామెంట్..
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజకీయాల గురించి మాట్లాడుతూ.. పూర్తిగా ప్రజాసేవకు అంకితమయ్యే మనస్వత్వం నాది కాదు. అందుకే నన్ను ఆ దేవుడు ప్రధాని చేయడు. నాక్కూడా లగ్జరీ లైఫ్ ని అనుభవించాలనే స్వార్థం ఉంది. అంతేకాకుండా నా రాజకీయ జీవితంలో మరో మెట్టు పైకి ఎక్కాలనే ఆలోచన కూడా నాకు లేదు. అంటూ కంగనా రనౌత్ రాజకీయాలపై షాకింగ్ కామెంట్లు చేసింది. దీంతో కంగనా మాటలు విన్న చాలా మంది నెటిజన్లు ఇదేంటి రాజకీయాల్లోకి వచ్చి సంవత్సరం కూడా కాలేదు. అప్పుడే కంగనా ఇలాంటి మాటలు మాట్లాడుతోంది..ఎంపీ పదవికి ఏమైనా రాజీనామా చేయబోతుందా ఏంటి అంటూ మాట్లాడుకుంటున్నారు.
కంగనా రనౌత్ కెరియర్..
హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) లో పుట్టి పెరిగిన కంగనా రనౌత్ మొదట డాక్టర్ అవ్వాలని కలలు కన్నది. కానీ ఆ తర్వాత ఢిల్లీ వచ్చేసి మోడలింగ్ రంగంలో రాణించి, గ్యాంగ్ స్టర్(GangStar) అనే మూవీతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇక మొదటి సినిమాతోనే ఉత్తమ డెబ్యూ నటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులు కూడా అందుకుంది.ఇక కేవలం హిందీ సినిమాల్లోనే కాకుండా తమిళ,తెలుగు భాషల్లో కూడా రాణించింది.
తెలుగు సినిమాలో కూడా నటించిన కంగనా..
తెలుగులో ప్రభాస్ (Prabhas) నటించిన ఏక్ నిరంజన్(Ek Niranjan) మూవీలో హీరోయిన్ గా చేసినప్పటికీ.. ఏక్ నిరంజన్ మూవీ ప్లాఫ్ అవ్వడంతో తెలుగులో కంగనా రనౌత్ కి సినిమా ఆఫర్లు రాలేదు. బాలీవుడ్ క్వీన్ గా కంగనా రనౌత్ కి మంచి పాపులారిటీ ఉంది.అలా బాలీవుడ్ సినీ రంగంలో ఉన్న హీరోయిన్లందరిలో కెల్లా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కంగనా రనౌత్.. సినిమా రంగం నుండి రాజకీయ రంగంలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. అలా హిమాచల్ ప్రదేశ్ లోని మండి లోక్సభ స్థానం నుండి ఎంపీగా పోటీ చేసి గెలిచింది.
ALSO READ:Samantha: ఎట్టకేలకు రిలేషన్ కన్ఫర్మ్ చేసిన సమంత.. కంగ్రాట్స్ చెప్తున్న నెటిజన్స్!