HBD Dada : టీమిండియా మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ దాదాపు తెలియని వారుండరు. టీమిండియా 2007 టీ-20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ సాధించిందంటే అందుకు కారణం గంగూలీ అనే చెప్పవచ్చు. ఎందుకంటే గంగూలీ కెప్టెన్సీలో టీమిండియాను బలంగా తయారు చేశాడు. వాస్తవానికి గంగూలీ కెప్టెన్సీలోనే 2003 వన్డే వరల్డ్ కప్ విజయం సాధిస్తుందని అంతా భావించారు. కానీ ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఫైనల్ లో అద్భుతంగా ఆడటంతో టీమిండియా ను చిత్తు చేశాడు. కానీ ఆ సమయంలో టీమిండియా ఫైనల్ వరకు పోరాడింది. కప్ రాలేదని కంటతడి పెట్టారు. ఇండియా అభిమానులు సైతం బాధ పడ్డారు. ఇక ఇదిలా ఉంటే.. ప్రస్తుతం టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ- సౌరబ్ గంగూలీ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ధోనీ ఎంట్రీకి కారణం అతడేనా..?
వాస్తవానికి ధోనీ బర్త్ డే జులై 0 అయితే.. సౌరబ్ గంగూలీ బర్త్ డే జులై 08 కేవలం ఒకరోజు వ్యవధిలోనే కావడం విశేషం. గంగూలీ కెప్టెన్ గా ఉన్న సమయంలో ధోనీ టీమిండియా కి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ సమయంలో వికెట్ కీపర్లు ఇద్దరూ దినేష్ కార్తిక్, ఎం.ఎస్. ధోనీ ఉన్నారు. వీరిద్దరిలో ఎవ్వరినీ తీసుకోవాలని బీసీసీఐ కెప్టెన్ గంగూలీతో చర్చలు చేసిందట. ఇక అప్పుడు గంగూలీ ఒకసారి మహేంద్ర సింగ్ ధోని కి ఛాన్స్ ఇద్దామని చెప్పాడట. అలా ధోనీ టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ధోనీ సూపర్ స్టార్ అయ్యాడు. దినేష్ కార్తిక్ కెరీర్ అక్కడే క్లోజ్ అయింది. పలు సందర్భాల్లో టీమిండియా తరపున ఆడినప్పటికీ అంతగా రాణించకపోవడంతో దినేష్ కార్తిక్ గత ఏడాది క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించేశాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు ధోనీ, గంగూలీ పై సోషల్ మీడియాలో మీమ్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. ఇక అప్పటి నుంచి మెల్ల మెల్లగా పుంజుకొని టీమిండియా కెప్టెన్ గా ఎంపికయ్యాడు. టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
అభిమానుల మనస్సులో ధోనీ..
భారత క్రికెట్ లో తనదైన ముద్ర వేసి.. కోట్లాది మంది అభిమానుల మనసుల్లో నిలిచిపోయాడు. మొన్ననే 44వ వసంతంలోకి అడుగుపెట్టారు. ముఖ్యంగా మైదానంలో తన ప్రశాంతమైన వైఖరితో, మెరుపు వేగంతో తీసుకునే నిర్ణయాలతో భారత్ కి ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించిన ధోనీ ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నాడు. 1981లో రాంచీలో జన్మించిన ధోనీ.. ప్రపంచ క్రికెట్ లోని అత్యంత సక్సెస్ ఫుల్ కెప్టెన్లలో ఒకరిగా నిలిచారు. ఇంటర్నేషనల్ క్రికెట్ కి గుడ్ పై చెప్పిన తరువాత ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతూనే ఉన్నారు. చెన్నై కెప్టెన్ 2025 సీజన్ లో గాయపడితే.. ధోనీనే కెప్టెన్ గా వ్యవహరించాడు. ధోనీ క్రికెట్ కంటే ముందు తొలుత ఫుట్ బాల్ ఆడేవారు. ఫుట్ బాల్ లో గోల్ కీపర్ గా అద్భుతంగా రాణించేవాడట. ఇక తన కోచ్ సలహా మేరకు క్రికెట్ వైపు అడుగులు వేశారు. 2001 నుంచి 2003 వరకు ధోనీ రైల్వేలో ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ గా పని చేశారు. తొలుత ధోనీ పొడవైన జుట్టుతో ఆడపిల్లల రాకుమారిడిగా వెలుగు వెలిగాడు. ఇక భారత జట్టును అన్ని ఫార్మాట్ లలో నెంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లిన ఘనత కూడా ధోనీకే దక్కుతుంది.