Shoaib Akhtar On IND VS SL: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్ తొలి సెమీస్ ఫైనల్ లో టీమిండియా జూనియర్ చిత్తుగా ఓడిపోవడంపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ ఆడిన ప్లేయర్లను నమ్ముకుని బీసీసీఐ బొక్కాబోర్లా పడిందని ఘాటుగా విమర్శలు చేశాడు. ఇండియాలో పురుడు పోసుకున్న ఐపీఎల్ టాలెంట్..శ్రీలంక జూనియర్ల దెబ్బకు ఖతార్ లోని దోహాలో చనిపోయిందంటూ హాట్ కామెంట్స్ చేశాడు.
టీమిండియా కుర్రాళ్లు కేవలం ఫ్లాట్, హైవే లాంటి పిచ్ లలోనే బాగా ఆడతారని, కఠినమైన బౌన్సీ మైదానాల్లో ఆడటం కష్టమేనన్నాడు. చాలా రోజుల నుంచి విదేశాల్లో టీమిండియా జూనియర్లు, సీనియర్ల ప్రదర్శన ఏ మాత్రం బాగుండటం లేదని, తాను ఈ విషయాన్ని పరిశీలించినట్టు పేర్కొన్నాడు. ఇండియన్ ఫ్లాట్ పిచ్ లపై తప్ప, విదేశాల్లో సరిగ్గా ఆడటం లేదంటూ బాంబ్ పేల్చాడు. ఐపీఎల్ టోర్నమెంట్ అద్భుతంగా ఆడారని, ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఖతార్ కు పంపిస్తే.. టీమిండియా కుర్రాళ్లు అట్టర్ ఫ్లాఫ్ అయ్యారని పరువు తీశాడు. ఇకపై ఐపీఎల్ అంటూ ఓవరాక్షన్ చేయడం ఆపాలని బీసీసీఐకి కౌంటర్ ఇచ్చాడు.
ఐపీఎల్ జరిగే పిచ్ లను బౌలర్లకు ఫేవర్ గా తయారు చేసినప్పుడే, టీమిండియా ఆటగాళ్ల ప్రదర్శన మెరుగవుతుందని సూచించాడు. లేకపోతే, విదేశాల్లో టీమిండియా వైఫల్యాలు ఇలాగే కొనసాగుతాయని హెచ్చరించాడు. తిలక్ వర్మ పెద్ద తోపు ఆటగాడని అనుకున్నాను, కానీ వాడికి బ్యాటింగే కాదు.. కెప్టెన్సీ కూడా చేతకాదంటూ పరువు తీశాడు. ఒక కెప్టెన్ కు ఉండాల్సిన లక్షణాలు ఒక్కటి కూడా లేవంటూ హేళన చేశాడు. టీమిండియా గెలిస్తే క్రెడిట్ తీసుకోవడం, ఓడిపోతే తోటి ప్లేయర్లపై తప్పును నెట్టేయడం తిలక్ వర్మకు అలవాటైందని ఫైర్ అయ్యాడు. ఇలాంటి వాళ్లు కెప్టెన్లుగా పనికిరారంటూ చురకలు అంటించాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లోనూ సరిగ్గా బౌలర్లను వాడుకోలేదన్నాడు. అందుకే 300కు పైగా పరుగులు చేసినా, టీమిండియా కాపాడుకోలేక ఓడిపోయి, ఇంటిదారి పట్టిందని సెటైర్లు పేల్చాడు. దీంతో షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్ తొలి సెమీస్ ఫైనల్ లో టీమిండియా జూనియర్ జట్టు 50 ఓవర్లు ఆడి, 8 వికెట్ల నష్టానికి 317 పరుగులు సాధించింది. అయితే, ఈ టార్గెట్ ను 2 వికెట్లు కోల్పోయిన శ్రీలంక, అవలీలగా ఛేదించింది. దీంతో ఫైనల్ కు దూసుకెళ్లింది.