Kuberaa On theatre: ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush), టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నాగార్జున(Nagarjuna) కాంబినేషన్లో వచ్చిన చిత్రం కుబేర(Kuberaa). నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika mandanna) హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల (Sekhar kammula)దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య జూన్ 20వ తేదీన థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఊహించని కలెక్షన్లు రాబడుతూ దూసుకుపోతోంది. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లో చేరినట్లు మేకర్స్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇలా కుబేరా సినిమా థియేటర్లలో ప్రదర్శితమౌతూ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా జరిగిన ఒక సంఘటన అభిమానులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ సినిమా థియేటర్లో చూస్తూ ఉండగా సడన్గా థియేటర్ సీలింగ్ ఆడియన్స్ పై పడడంతో కొంతమందికి గాయాలైనట్లు సమాచారం. మరి ఆ థియేటర్ ఎక్కడ? అసలేం జరిగింది? అనే విషయం ఎప్పుడు చూద్దాం.
కుబేర థియేటర్లో దుర్ఘటన..
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లాలో ముకుంద థియేటర్లో కుబేర సినిమా సెకండ్ షో ప్రదర్శితమవుతుండగా.. సడన్గా థియేటర్ సీలింగ్ ఊడి సినిమా చూస్తున్న ఆడియన్స్ పై పడిపోయింది. దీంతో సినిమా చూస్తున్న పలువురు ప్రేక్షకులకు గాయాలైనట్లు సమాచారం. వెంటనే థియేటర్ యాజమాన్యం వారికి ప్రథమ చికిత్స అందించినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
కుబేర సినిమా కలెక్షన్స్..
కుబేర సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.. అమెరికాలో ఇప్పటికే రెండు మిలియన్ డాలర్ల వసూలు దిశగా దూసుకుపోతోంది. నాగార్జున కెరియర్ లోనే ఇదొక మైలు రాయిగా నిలిచిందని చెప్పవచ్చు. తొలి ఆట నుంచే బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. మొదటి రోజు కంటే రెండో రోజు.. రెండో రోజు కంటే మూడో రోజు అంటూ రోజు రోజుకీ కలెక్షన్లు పెరిగిపోతున్నాయని చెప్పవచ్చు. అందులో భాగంగానే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూల్ చేసినట్లు సమాచారం. దీనికి తోడు ఈ పోస్టర్ను విడుదల చేస్తూ సంపద, జ్ఞానం ఇప్పుడు వంద కోట్లు విలువైన అల.. గ్రాండ్ సెంచరీ తో కుబేర బాక్స్ ఆఫీస్ ను రూల్ చేస్తుంది అంటూ పోస్ట్ పెట్టడం జరిగింది. ఇక ఇలా రోజు రోజుకు కలెక్షన్ల పరంగా దూసుకుపోతూ సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా మరి ఫుల్ రన్ ముగిసేసరికి ఏ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకొని కలెక్షన్లతో బాక్సాఫీస్ రికార్డు బ్రేక్ చేస్తుందో చూడాలి.
BREAKING 🚨
During the second show of #Kuberaa at Mukunda Theatre in Mahabubabad, the ceiling suddenly broke and fell on the audience. A few people got slightly injured. pic.twitter.com/j2byPiuPNP
— Movies4u (@Movies4uOfficl) June 26, 2025