Vishwambhara Movie: మెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబిసారా సినిమాతో దర్శకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్న కొత్త డైరెక్టర్ వశిష్ట మల్లిడి దర్శకత్వంలో రాబోతున్న చిత్రం విశ్వంభర. ఎప్పుడో గత ఏడాదే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా పలు కారణాలవల్ల వాయిదా పడుతూ వస్తోంది. కనీసం ఈ సమ్మర్ లో నైనా ఈ సినిమాను విడుదల చేస్తారనుకుంటే అది కూడా జరగలేదు. అయితే ఇప్పుడు సడన్ గా ఈ సినిమా నుండి కీరవాణి కూడా తప్పుకున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో మెగా అభిమానులు కూడా కంగారుపడుతున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
అసలేం జరిగిందనే విషయానికి వస్తే.. విశ్వంభర సినిమాకు ఇప్పటివరకు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. అయితే తాజాగా ఈ సినిమాలోని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించే బాధ్యతను మాత్రం మరో సంగీత దర్శకుడు గౌరహరికు అప్పగించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కీరవాణి మ్యూజిక్ అందించగా.. నేపథ్య సంగీతాన్ని గౌరహరికి అప్పగించింది చిత్రబృందం. ఇప్పటికే హరీ గౌర విశ్వంభర చిత్రానికి సంబంధించి ఆర్ఆర్ పనులను కూడా ప్రారంభించినట్లు సమాచారం.
ఇకపోతే ఈ సినిమాకి సంగీతాన్ని అందించిన ఎంఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించే బాధ్యతను ఇంకొకరికి అప్పగించడం ఏంటి అనే కామెంట్లు వ్యక్తం అవ్వగా.. అసలు విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రస్తుతం కీరవాణి , మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి సినిమాకు కీరవాణి సంగీత దర్శకుడిగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం కీరవాణి వారణాసి మ్యూజిక్ పనుల్లో బిజీగా ఉండడం వల్లే విశ్వంభర బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం గౌర హరిని తీసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి సోషియా ఫాంటసీ సినిమాలకు సంగీతం అందించడంలో కీరవాణికి మంచి పట్టు ఉంది. కానీ కేవలం వారణాసి వల్లే ఆయన ఈ సినిమా నుండి తప్పుకుంటున్నట్లు సమాచారం.
గౌర హరి విషయానికి వస్తే.. ఇప్పటికే హనుమాన్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందించి అందరి దృష్టిని ఆకర్షించిన ఈయన అలాగే మిరాయ్ చిత్రానికి కూడా మంచి మ్యూజిక్ ను అందించారు. ఇక ఇప్పుడు విశ్వంభర వంటి సోషియో ఫాంటసీ చిత్రానికి తనదైన శైలిలో పవర్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తారని మెగా అభిమానులు కూడా ఆశిస్తున్నారు.
ALSO READ:ప్రభాస్ మూవీ షూటింగ్ కి వెళ్తుండగా ఘోర ప్రమాదం.. ఒకరు మృతి..
విశ్వంభర సినిమా విషయానికి వస్తే.. ఇందులో చిరంజీవి సరసన హీరోయిన్గా త్రిష నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక నిన్న(మే 4) ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఆమెకి చిత్ర బృందం స్పెషల్ విషెస్ తెలియజేసింది. చిత్ర బృందం త్రిష కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ త్రిష పోషిస్తున్న అవని పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. సాంప్రదాయ దుస్తుల్లో చేతిలో వెలుగుతున్న దీపాల పళ్ళెం పట్టుకొని ఆమె కనిపిస్తున్న తీరు చూస్తుంటే… ఇందులో ఆమెది చాలా పవర్ఫుల్ గా, ఆధ్యాత్మికతతో కూడిన పాత్ర అని మాత్రం అర్థం అవుతుంది. ఇక ఏది ఏమైనా మళ్లీ 18 ఏళ్ల తర్వాత త్రిష , చిరంజీవి కాంబినేషన్లో వస్తున్న ఈ సోషియో ఫాంటసీ ఎపిక్ మూవీ ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. మరి విడుదల తేదీని ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.