E-Paper
Advertisement

పూరీ జగన్నాథ్ ఇంట తీవ్ర విషాదం.. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన పవిత్ర!

పూరీ జగన్నాథ్ ఇంట తీవ్ర విషాదం.. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన పవిత్ర!
Advertisement

Puri Jagannath:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఈ మేరకు పూరీ జగన్నాథ్ (Puri Jagannath)కూతురు పవిత్ర పూరీ (Pavitra Puri) తన సోషల్ మీడియా అధికారిక ఖాతా ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంది. జూలై 25 వ తేదీన తన నానమ్మ చనిపోయినట్లు, తన నానమ్మతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ ఎమోషనల్ నోట్ పంచుకుంది పవిత్ర పూరీ..

మిస్ యూ నానమ్మ..

పవిత్ర పూరీ తన ఇంస్టాగ్రామ్ ఖాతా స్టోరీస్ ద్వారా.. “ఐ మిస్ యు నానమ్మ.. ఇప్పుడు నన్ను ఎవరు చిన్న తల్లి అని ప్రేమగా పిలుస్తారు? హద్దులు లేని ప్రేమతో ఎవరు నాకు ముద్దు పెడతారు? నీతో మరో రోజు గడిపే అవకాశం వస్తే బాగుండు.. నీ 96వ పుట్టినరోజున నేను నీకు ఇచ్చినట్లు పెద్ద హగ్ మళ్లీ ఇస్తాను. ఐ మిస్ యు నానమ్మ”.. అంటూ ఎమోషనల్ పోస్టు పెట్టింది. దీంతో పలువురు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్స్ సంతాపం తెలియజేస్తున్నారు.

Advertisement

పూరీ జగన్నాథ్ సినిమాలు..

టాలీవుడ్ లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్ ఒకప్పుడు టాలీవుడ్లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గా మంచి పేరు సొంతం చేసుకున్నారు. బద్రి సినిమాతో మొదలైన ఆయన ప్రయాణం ఇడియట్ , పోకిరి, దేశముదురు, నేనింతే, శివమణి, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, చిరుత, బుజ్జిగాడు, బిజినెస్ మేన్, గోలీమార్, టెంపర్ వంటి చిత్రాలతో భారీ బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకున్నారు. ఎన్టీఆర్ తో చేసిన టెంపర్ తర్వాత పూరీ ఖాతాలో సరైన హిట్ పడడం లేదు. ఇస్మార్ట్ శంకర్ కాస్త పర్వాలేదనిపించినా.. ఆ తర్వాత వచ్చిన పైసా వసూల్, జ్యోతిలక్ష్మి , ఇజం, రోగ్, మెహబూబా, లైగర్, ఇస్మార్ట్ శంకర్ 2 ఇలా ఒకదానిని మించి మరొకటి వరుసగా ఆయనను ఫ్లాపుల్లో ముంచేసాయి.

Advertisement

ALSO READ:మెగా ఫ్యాన్స్ కి షాక్.. రామ్ చరణ్ కు సర్జరీ..?

ఆశలన్నీ దానిపైనే..

అయితే ప్రస్తుతం విజయ్ సేతుపతితో స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ అనే మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయినప్పటికీ.. ఇప్పటికీ ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించలేదు. ఇందులో విజయ్ సేతుపతి తో పాటు టబు , బ్రహ్మాజీ , వీటీవీ గణేష్, విజయ్ కుమార్ వంటి సెలబ్రిటీలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అంతేకాదు ఈ చిత్రానికి నేషనల్ అవార్డు విన్నర్ హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందిస్తుండగా.. పూరీ కనెక్ట్స్ , జేబీ మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై ఛార్మీ కౌర్, జేబీ నారాయణరావు కొండ్రోల్లా, పూరి జగన్నాథ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ , హిందీ, మలయాళం భాషలో ఒకేసారి రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించకపోవడానికి కారణం ఓటీటీ డీల్ కుదరకపోవడమే అనే కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఓటీటీ ఫైనల్ అయితే త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

Related News

పూరీ జగన్నాథ్ దారుణంగా మోసపోయాడు.. నిజాలు బయటపెట్టిన రఘు కుంచె!

మెగా ఫ్యాన్స్ కి షాక్.. రామ్ చరణ్ కు సర్జరీ..?

పెళ్లయిన 12 ఏళ్ల తర్వాత తల్లైన అయిన ‘శీను వాసంతి లక్ష్మీ’ బ్యూటీ!

పదహారేళ్లకే టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్.. అప్పుడే షూటింగ్ పూర్తి!

బన్నీ, రామ్ చరణ్, నా తర్వాత ఆ అదృష్టం అందుకున్న ఏకైక హీరో అతనే.. మహేష్ బాబు స్పెషల్ వీడియో!

Chiranjeevi: గబ్బర్ సింగ్ రమేష్ కుటుంబానికి అండగా మెగాస్టార్!

చిట్టి నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..? సినిమా కన్నా ఎక్కువే..

Big Stories

Advertisement
×