E-Paper
Advertisement

అణు యుద్ధం జరిగి 200 ఏళ్లు… ముఖం లేని హీరో మాస్ జాతర… ‘మీర్జాపూర్’ను మించిన డైలాగులు

అణు యుద్ధం జరిగి 200 ఏళ్లు… ముఖం లేని హీరో మాస్ జాతర… ‘మీర్జాపూర్’ను మించిన డైలాగులు
Advertisement

Sci Fi Action Thriller on OTT: పోస్ట్-అపోకలిప్టిక్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే వైల్డ్ యాక్షన్ సిరీస్‌లకు ఓటీటీ మార్కెట్‌లో ఉండే హైపే వేరు. ప్రపంచం మొత్తం అణు యుద్ధంతో నాశనమైపోతే మనుషుల పరిస్థితి ఎలా ఉంటుంది? భూమిపై బతకడమే కష్టంగా మారితే, ప్రాణాల కోసం మనుషులు ఎంతటి క్రూరత్వానికైనా తెగిస్తారా? ఇలాంటి ఊహకందని ప్రపంచాన్ని, అక్కడి మనుషుల వింత జీవితాలను చూపించే సూపర్‌హిట్‌ పోస్ట్‌ అపోకలిప్టిక్‌ సైన్స్‌ ఫిక్షన్‌ సిరీస్‌ ‘Fallout’. ప్రపంచ ప్రసిద్ధ వీడియో గేమ్ ఆధారంగా తెరకెక్కి ఈ హై-వోల్టేజ్ సర్వైవల్ యాక్షన్ సిరీస్ సీజన్ 1 తో గ్లోబల్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు రెండో సీజన్‌ ‘Fallout: Season 2’ కూడా ఓటీటీలో భారీ వ్యూస్‌తో దూసుకుపోతోంది. అయితే ఇందులో ఉండే ఎక్స్‌ట్రీమ్ వయలెన్స్, బోల్డ్ కంటెంట్ వల్ల ఈ సిరీస్ పక్కాగా పెద్దలకు మాత్రమే.

కథలోకి వెళ్తే…

భూమిపై జరిగిన భయంకరమైన అణు యుద్ధం తర్వాత దాదాపు 200 ఏళ్లు గడిచిపోతాయి. ఒకప్పుడు ఎంతో అభివృద్ధి చెందిన నగరాలు ఇప్పుడు రేడియేషన్‌ ప్రభావంతో శిథిలాలుగా మారిపోతాయి. బయట ప్రపంచంలో బతకడం ప్రమాదకరంగా మారడంతో, కొంతమంది సంపన్నులు భూమి లోపల నిర్మించిన ప్రత్యేకమైన వాల్ట్‌లలో తలదాచుకుంటారు. అయితే ఆ వాల్ట్‌ల నుంచి బయటకు వచ్చిన వారికి ఎదురయ్యే ప్రపంచం మాత్రం ఊహించిన దానికంటే భయంకరంగా ఉంటుంది. విచిత్రమైన జీవులు, క్రూరమైన గ్యాంగులు, అధికారం కోసం జరిగే పోరాటాలతో ఆ ప్రపంచం నిండిపోయి ఉంటుంది.

Advertisement

మొదటి సీజన్‌లో జరిగిన పరిణామాల తర్వాత లూసీ మాక్లీన్‌ (ఎల్లా పూర్నెల్‌), గౌల్‌ (వాల్టన్‌ గాగిన్స్‌) కలిసి మొజావే ఎడారి మీదుగా న్యూ వెగాస్‌ వైపు ప్రయాణిస్తారు. తన తండ్రి హాంక్‌ కోసం వెతుకుతున్న లూసీకి ఈ ప్రయాణంలో ఎన్నో ప్రమాదాలు ఎదురవుతాయి. మరోవైపు రేడియేషన్‌ కారణంగా ముఖం పూర్తిగా మారిపోయి, దాదాపు అమరత్వం పొందిన బౌంటీ హంటర్‌గా మారిన గౌల్‌ తనదైన శైలిలో శత్రువులను ఎదుర్కొంటాడు. లూసీ తన తండ్రిని చేరుకుంటుందా? గౌల్‌ తన గతానికి సంబంధించిన నిజాలను తెలుసుకుంటాడా? న్యూ వెగాస్‌లో ఎవరి ఆధిపత్యం కొనసాగుతుంది? అనేవి ఈ సీజన్‌లో ఆసక్తికరమైన అంశాలు.

భూమిపై మిగిలిపోయిన పాత నగరాల వ్యర్థాల మధ్య బతకడానికి వివిధ గ్యాంగులు చేసే యుద్ధాలు, విజువల్ ఎఫెక్ట్స్ హాలీవుడ్ టాప్ రేంజ్ లో ఉన్నాయి. అంతేకాదు మన ‘మీర్జాపూర్’ రేంజ్ ని మించిన క్రూరమైన డైలాగులతో, రా యాక్షన్ సీన్స్ తో నిండి ఉంటుంది ఈ సిరీస్. ఒక వైల్డ్, డార్క్ అండ్ మైండ్ బ్లోయింగ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ రైడ్ ని ఎక్స్ పీరియన్స్ చేయాలనుకుంటే దీనిని మాత్రం మిస్ అవ్వద్దు.

తెలుగులో స్ట్రీమింగ్

Advertisement

ఈ సిరీస్‌లో ఎల్లా పూర్నెల్‌, వాల్టన్‌ గాగిన్స్‌, ఆరోన్‌ మోటెన్‌, కైల్‌ మాక్లాక్లన్‌, మోయిసెస్‌ అరియాస్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. జోనాథన్‌ నోలన్‌, లిసా జాయ్‌ నిర్మాణంలో రూపొందిన ఈ సిరీస్‌కు గ్రాహమ్‌ వాగ్నర్‌, జెనీవా రాబర్ట్‌సన్‌-డ్వోరెట్‌ క్రియేటర్లుగా వ్యవహరించారు. రెండో సీజన్‌లో మొత్తం 8 ఎపిసోడ్‌లు ఉన్నాయి. ప్రస్తుతం మొత్తం ఎపిసోడ్‌లు Amazon Prime Videoలో అందుబాటులో ఉన్నాయి. తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్‌ ఆడియోలతో పాటు తెలుగు సబ్‌టైటిల్స్‌ కూడా లభిస్తున్నాయి.

Read Also: రక్తదాహంతో ఉండే దేవతను పూజించే రహస్య తెగ… ప్రేయసి కోసం జ్యోతిష్యుడి డేంజరస్ అడ్వంచర్

Related News

లాయర్‌ స్థానంలో నిందితుడిగా నిలబడితే… తన కేసులో తానే నిందితుడు… క్రేజీ కోర్ట్‌రూమ్‌ థ్రిల్లర్‌

నిన్నటిదాకా స్టార్ హీరోయిన్… ఇప్పుడు ఉండటానికి ఇల్లు కూడా లేదు… ఎమోషనల్ కామెడీ డ్రామా

ఉదయం కాలేజ్ క్లాసెస్, రాత్రి డార్క్ బిజినెస్… ఈ డ్యూయల్ లైఫ్ గేమ్ నెక్స్ట్ లెవెల్ మావా

‘రణబాలి’ నుంచి ‘జైలర్ 2’ వరకు… ఈ వారం ఓటీటీలో రాబోతున్నమోస్ట్ అవైటింగ్ తెలుగు సినిమాలు ఇవే

అపార్ట్‌మెంట్‌లోని అందరికీ కోట్ల రూపాయల ఆఫర్‌… బిల్డర్‌ కు బిగ్ ట్విస్ట్ ఇచ్చే రిటైర్డ్‌ టీచర్‌

ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘గరివిడి లక్ష్మీ’ ..స్ట్రీమింగ్ డేట్ లాక్!

150 ఏళ్ల చరిత్ర ఉన్న దుకాణాన్ని కూల్చేయాలని ప్లాన్… సిస్టమ్‌పై సామాన్యుడి దండయాత్ర

Big Stories

Advertisement
×