Tollywood: టాలీవుడ్ సినీ పరిశ్రమ చిత్రాలతోనే కాదు బడా నిర్మాణ సంస్థలతో కూడా సెన్సేషన్ సృష్టిస్తోంది..ఈ క్రమంలోనే సినిమాలతో ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటున్న తెలుగు పరిశ్రమలో ఇప్పుడు ఏకంగా 300 ఎకరాలలో భారీ ఫిలిం స్టూడియో ఏర్పాటు జరుగుతోందనే విషయం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి 300 ఎకరాలలో ఫిలిం స్టూడియోని నిర్మిస్తున్న ఆ ప్రొడ్యూసర్స్ ఎవరు? అసలు ఎక్కడ ఈ నిర్మాణ సంస్థను స్థాపిస్తున్నారు ? అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బడా నిర్మాణ సంస్థల్లో ఒకటిగా పేరు సొంతం చేసుకున్న మైత్రి మూవీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇదే మైత్రి మూవీ మేకర్స్ టాలీవుడ్ లో సినిమాలతోనే కాదు స్టూడియో నిర్మాణంతో కూడా సెన్సేషన్ క్రియేట్ చేయాలని చూస్తోందా అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. హైదరాబాదు శివారులోని శంషాబాద్ దగ్గరలో ఏకంగా 300 ఎకరాలలో భారీ ఫిలిం స్టూడియో ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఈ మేరకు చిత్ర పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తూ ఉండడం గమనార్హం.
ఇకపోతే ఇక్కడ ఏకంగా ఒక ఎకరానికి కోటి రూపాయల వరకు వెచ్చించి భూమి కేటాయింపు ప్రతిపాదన కూడా ఉందనే వార్త మరింత ఆసక్తిని కలిగిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే మైత్రి మూవీ మేకర్స్ సినీ బిజినెస్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇకపోతే ఇక్కడ స్టూడియోనే కాకుండా బిగ్ థియేటర్ కి కూడా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు దగ్గరలో అత్యధిక ఐమాక్స్ స్క్రీన్ తో భారీ థియేటర్ ను నిర్మించేందుకు కూడా మైత్రి సంస్థ ప్లాన్ చేస్తోందంటూ మరో ఆసక్తికరమైన ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా ఒకవైపు భారీ స్టూడియో మరొకవైపు ప్రీమియం థియేటర్ ఇలా రెండు ప్రాజెక్టులు పట్టాలెక్కితే గనుక హైదరాబాద్ సినీ రంగంలో కొత్త రేంజ్ హంగామా మొదలవడం ఖాయమనే చర్చ మొదలయ్యింది.
also read:నామినేషన్ హీట్ మధ్య నరేష్ రిలీఫ్ వర్డ్స్.. లవ్ స్టోరీ అదుర్స్?
ఇదిలా ఉండగా మరోవైపు తాజాగా జరుగుతున్న ఈ ప్రచారంపై తెలంగాణ ప్రభుత్వం కూడా భూమిని కేటాయించడానికి సిద్ధమైనట్లు వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. ఇక ఫిలిం స్టూడియో, థియేటర్ అంటూ ఫిలింనగర్ సర్కిల్స్ లో వినిపిస్తున్న ఈ టాక్ పై మైత్రి మూవీ మేకర్స్ ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తారో చూడాలి. ఒకవేళ అధికారిక ప్రకటన వచ్చి నిజంగానే ఇది రూపం దాల్చుకుంటే మాత్రం సినీ ఇండస్ట్రీలో ఇదో అద్భుతం అని చెప్పాలి. మరి చూద్దాం ముందు ముందు ఈ ప్రాజెక్టుపై ఇంకెన్ని వార్తలు బయటకు వస్తాయో..