E-Paper
Advertisement

ఇల్లు భద్రంగా ఉండాలా? రూ.5 వేలలో టాప్-5 సెక్యూరిటీ కెమెరాలు.. ఇక దొంగల భయమే అక్కర్లేదు!

ఇల్లు భద్రంగా ఉండాలా? రూ.5 వేలలో టాప్-5 సెక్యూరిటీ కెమెరాలు.. ఇక దొంగల భయమే అక్కర్లేదు!
Advertisement

CCTV Cameras: ఈ రోజుల్లో సీసీటీవీల వినియోగం తప్పనిసరిగా మారిపోయింది. ఇంటికి తాళం వేసి ఏదైనా ఊరికి వెళ్లినప్పుడు.. ఎవరెవరు వచ్చి వెళ్తున్నారో తెలుసుకునేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అయితే ఈ సీసీటీవీల కోసం వేలకు రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు. రూ.5000 లోపు బడ్జెట్ లోనే అత్యుత్తమ నైట్ విజన్, టూవే ఆడియో కమ్యూనికేషన్స్, మెుబైల్ నోటిఫికేషన్ వంటి ఫీచర్లు కలిగిన అత్యాధునిక కెమెరాలు లభిస్తున్నాయని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రూ.5000 వేల లోపు లభించే బెస్ట్ సెక్యూరిటీ కెమెరాలు ఏంటో ఈ కథనంలో చూద్దాం.

Qubo Smart Bullet Cam Pro 180

ఇండియన్ కంపెనీ అయిన ఈ క్యూబో నాణ్యమైన సీసీటీవీలను అందిస్తోంది. రూ. 4,490 ధరకు లభించే ఈ క్యూబో సెక్యూరిటీ కెమెరాను ఇళ్లకే కాకుండా గేట్లు, బాల్కనీలు, కార్ పార్కింగ్ ప్రాంతాల కోసం కూడా ఉపయోగించుకోవచ్చు. దీని పేరులో ఉన్న ‘180’ సంఖ్య దీని ఫీల్డ్ ఆఫ్ వ్యూను సూచిస్తుంది. అంటే ఇది చాలా ప్రాంతాన్ని కవర్ చేయగలదు.

TP-Link Tapo C230

Advertisement

రూ.4000 వేల బడ్జెట్ లో అన్ని రకాల ఫీచర్లు కోరుకునే వారికి టాపో C230 సెక్యూరిటీ కెమెరా బెస్ట్ ఆప్షన్. ఇది 2K రిజల్యూషన్‌లో వీడియోలను రికార్డ్ చేస్తుంది. లైట్లు ఆరిపోయిన తర్వాత కలర్ నైట్ విజన్‌కు ఇది ఆటోమేటిగ్గా మారిపోతుంది. దీనిలోని ఏఐ టెక్నాలజీ మనుషులకు, కర్టెన్ల కదలికలకు మధ్య తేడాను స్పష్టంగా గుర్తించగలదని కంపెనీ చెబుతోంది. దీనివల్ల అర్ధరాత్రి వచ్చే తప్పుడు అలారాలను ఈజీగా నివారించవచ్చని స్పష్టం చేస్తోంది.

Godrej Eve Pro 3 Pan Tilt Smart WiFi

గోద్రెజ్ లాంటి పేరున్న బ్రాండ్ నుంచి రూ. 2,410 ధరకే ఈ కెమెరా లభిస్తుంది. ఈ ఈవ్ ప్రో 3 కెమెరాను ఫోన్ ద్వారా ఈజీగా కంట్రోల్ చేయవచ్చు. ఒక మూలలో ఉండి గది మొత్తాన్ని స్కాన్ చేసే సామర్థ్యం దీనికి ఉంది. ఆఫీసులో ఉన్నప్పుడు లివింగ్ రూమ్ ని పర్యవేక్షించడానికి లేదా వేరే ఊరిలో ఉన్న తల్లిదండ్రుల గదిని చూసుకోవడానికి ఇది సరిగ్గా సరిపోతుంది.

CP PLUS CP-Z45Q

Advertisement

దేశంలో అత్యధిక మంది వినియోగిస్తున్న సీసీటీవీ బ్రాండ్లలో సిపి ప్లస్ ఒకటి. దీని ధర రూ. 3,899. స్థానిక టెక్నీషియన్లకు ఈ కెమెరాలపై పూర్తి అవగాహన ఉంటుంది. కాబట్టి విడిభాగాలు (spare parts) సర్వీసింగ్ సులభంగా లభిస్తాయి. దీని పేరులోని Z-సిరీస్ పాన్ అండ్ టిల్ట్ చేసే సామర్థ్యాన్ని సూచిస్తుంది. లుక్స్ పరంగా ఈ కెమెరా సాధారణంగా అనిపించినా.. ఇంటి భద్రతకు కావాల్సిన పనిని మాత్రం ఇది సమర్థవంతంగా చేస్తుంది.

Also Read: రూ.20,000 ఉంటే.. సొంతూళ్లలోనే దర్జాగా చేసుకునే వ్యాపారాలు.. ఇక సిటీ ఊసే అక్కర్లేదు!

HIKVISION 2MP ColorVu Audio PT 360°

రూ.2,499కి అందుబాటులో ఉన్న ఈ సీసీటీవీ కెమెరా.. నైట్ విజువల్స్ రికార్డింగ్ కు ఎంతో పేరుగాంచింది. రాత్రి వేళ ఇతర సీసీటీవీలు బ్లాక్ అండ్ వైట్ లో విజువల్స్ ను రికార్డు చేస్తాయి. కానీ ఇది మాత్రం కలర్వు ఫీచర్ సాయంతో మసక చీకటిలోనూ రంగుల్లో రికార్డ్ చేస్తుంది. రాత్రిళ్లు దొంగ ఇంట్లోకి ప్రవేశిస్తే అతడు వేసుకున్న జాకెట్, వాహనం రంగును సైతం పోలీసులకు స్పష్టంగా చెప్పడానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే ఇందులో 2MP సెన్సార్ మాత్రమే ఉండటం వల్ల రిజల్యూషన్ 1080p వరకు మాత్రమే వస్తుంది. అయినప్పటికీ తక్కువ ధరలో 360 డిగ్రీల రొటేషన్, కలర్ నైట్ విజన్ కోరుకునే వారికి ఇది మంచి ఛాయిస్.

Also Read: రూ. 10 లక్షల పెట్టుబడి.. సింగిల్ ఎఫ్‌డీ vs మల్టిపుల్ ఎఫ్‌డీలు.. అధిక రాబడికి ఏది బెస్ట్?

 

Tags

Related News

ఎయిర్‌టెల్ కస్టమర్లకు షాక్.. పెరిగిన ధరలు.. కానీ, ఫస్ట్ టైమ్ ఫ్రీగా ఆ సేవలు!

కొత్త ఫోన్ కొన్న తర్వాత ఎంతసేపు ఛార్జింగ్ పెట్టాలి? అసలు నిజం ఇదే!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న100 ఇంచుల టీవీ..ఇంతవరకూ ఏ టీవీలో లేని ఫీచర్లు

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో..అదిరిపోయే డిష్‌వాషర్లు,ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు

మెుబైల్ పాస్‌వర్డ్ లేదా పాటర్న్ మర్చిపోయారా? ఆందోళన వద్దు.. ఇంట్లోనే ఇలా అన్‌లాక్ చేయండి!

జియో సూపర్ డూపర్ ప్లాన్స్.. రూ. 449 vs రూ. 500.. దేని బెనిఫిట్స్ ఎంత?

సీసీ కెమెరా కొనాలనుకుంటున్నారా ?ఈ మోడల్స్‌ని మించినవి లేవు తెలుసా?

Big Stories

Advertisement
×