E-Paper
Advertisement

నామినేషన్ హీట్ మధ్య నరేష్ రిలీఫ్ వర్డ్స్.. లవ్ స్టోరీ అదుర్స్?

నామినేషన్ హీట్ మధ్య నరేష్ రిలీఫ్ వర్డ్స్.. లవ్ స్టోరీ అదుర్స్?
Advertisement

Bigg boss 10:ఒకవైపు కంటెస్టెంట్స్ మధ్య నామినేషన్ పోరు నువ్వా నేనా అన్నట్టు సాగుతుంటే.. మరొకవైపు నరేష్ ఈ నామినేషన్ హీట్ ను తగ్గించి, తన మాటలతో రిలీఫ్ కలిగించారని తాజా ప్రోమో చూస్తే తెలుస్తోంది. ఇక బిగ్ బాస్ ఇంట్లో ఆరవ వారం నామినేషన్ సెగ బాగా పెరిగేలా ఉంది. ఈ క్రమంలోనే రోహిత్, వంశీని నామినేట్ చేశాడు. ముఖేష్ అమన్ ని నామినేట్ చేశాడు . శాలిని దెబ్జానీ ని సోమవారం నాటి ఎపిసోడ్ లో నామినేట్ చేసింది. ఇక మంగళవారం నాటి ఎపిసోడ్ లో వర్షినినీ నామినేట్ చేసిందని ప్రోమోను బట్టి తెలుస్తోంది..ఇకపోతే శాలిని చేసిన రెండు నామినేషన్ లో వర్షిని నామినేషన్ ను నీతూ ఆమోదించినట్లుగా అనిపిస్తోంది.

నామినేషన్ హీట్ మధ్య ఆకట్టుకున్న నరేష్ కామెడీ..

ఇదంతా కాస్త పక్కన పెడితే తాజాగా విడుదల చేసిన ప్రోమోలో నరేష్ చేసిన కామెడీ కాస్త రిలీఫ్ గా అనిపించింది. ప్రోమో మొదలవగానే.. మీకు ఏ ప్లేస్ బాగా నచ్చింది అని నీతూ ని నరేష్ అడుగుతాడు. నాకు కిచెన్ నచ్చిందని నీతూ చెబుతుంది. నరేష్ మాత్రం నాకు బాత్రూం నచ్చిందని చెబుతాడు. నీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి? అని శ్వేతాని అడుగుతాడు. నీ హార్ట్ అని శ్వేత అంటే. అందులో నువ్వు పట్టావేమో అని నరేష్ కామెడీ చేశాడు. ఇక తర్వాత శ్వేతతో అక్కడ ఉన్న కొంగలను చూపిస్తూ.. ఇవి మా ఇంట్లో కొంగలు..ఎప్పుడూ చక్కగా ఉండవు.

ఆకట్టుకున్న ట్రయాంగిల్ లవ్ స్టోరీ..

Advertisement

ఇది అబ్బాయి, ఇది అమ్మాయి.. నువ్వు నాకు నచ్చలేదు అని చెప్పడంతో ఆ కొంగ చిన్న బోయింది అని నరేష్ చెబుతుంటే.. ముఖేష్, వర్షిని, దెబ్జానీ ట్రాక్ చూపిస్తూ ఉంటాడు ఎడిటర్. వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు.. నన్నెవరూ పట్టించుకోవట్లేదని ఈ కొంగ ఫీలవుతోంది. కొంగ కొంగ వీడో పెద్ద దొంగ అంటూ అమన్ ను చూసి కామెంట్ చేశాడు నరేష్.. అలా నామినేషన్ హీట్ మధ్య నరేష్ చేసిన కామెడీ కాస్త రిలీఫ్ గా అనిపించింది.

వర్షిణి – షాలిని మధ్య ఫుల్ ఫైర్..

నామినేషన్స్ విషయానికి వస్తే వర్షిని – శాలిని వాగ్వాదాన్ని చూపించారు. నువ్వు డ్రాగర్స్ కోసం దారుణంగా తోసేసావు.. నీకు మానవత్వం లేదు.. మళ్ళీ నువ్వు మానవత్వం గురించి మాట్లాడుతావు అని శాలిని అంటుంది ఇక వర్షిని మాట్లాడుతూ ఒక్క అమ్మాయి మీద నలుగురు పడ్డారు నేను వెళ్లి కాపాడాను. అక్కడ వెళ్లకపోతే నాకు మానవత్వం లేనట్టు నా టీం లోని అమ్మాయిని కాపాడుకునే బాధ్యత నాకు ఉంటుంది అంటూ వర్షిని అంటుంది. నన్ను చాలా రూడ్ గా తోసేశారు అని శాలిని అంటే . శాలిని చాలా ట్రిక్స్ ప్లే చేస్తుంది అని వర్షిని అంటుంది. నేను ఎక్కడ ట్రిక్స్ ప్లే చేశాను చెప్పు అని శాలిని అడుగుతుంది.

Advertisement

also read:నామినేషన్స్ లో పెద్ద గొడవ.. ఈ వారం వారికి రెడ్ కార్డ్ తప్పదా?

శాలిని, రోహిత్ రిలేషన్ పై పెరుగుతున్న నెగిటివిటీ..

ఇక వర్షిని శాలిని మధ్యలోకి మొదట రోహిత్ వచ్చాడు. వీళ్లు ఎందుకు వచ్చారు? అసలేం మాట్లాడుతున్నారు ? టాపిక్ ఏంటి ? అన్నది ప్రోమోలో మాత్రం ఏం అర్థం కాలేదు. పైగా మధ్యలో త్రిగుణ్ కూడా ఎంట్రీ ఇవ్వడం గమనార్హం. ఈ గొడవ గురించి పూర్తి క్లారిటీ రావాలి అంటే ఎపిసోడ్ వరకు ఎదురు చూడాల్సిందే. మొత్తానికైతే శాలిని , రోహిత్ ట్రాక్ కి మరోసారి నెగిటివ్ఇమేజ్ వచ్చేసిందని చెప్పాలి.

 

Related News

నామినేషన్స్ లో పెద్ద గొడవ.. ఈ వారం వారికి రెడ్ కార్డ్ తప్పదా?

విడాకులు తీసుకున్న నవ్య స్వామి వదిన.. పోస్ట్ వైరల్!

Gundeninda GudiGantalu Today episode: ఇదేం ట్విస్ట్ స్వామి.. అడ్డంగా బుక్కయిన విల్లా విజయ్.. రోహిణికి షాక్..

Podarillu Today Episode : బాధపడ్డ మాధవ్.. జమునకు నారాయణ స్ట్రాంగ్ వార్నింగ్.. ఇంతమోసమా..?

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. కమల్, అవని అరెస్ట్.. పల్లవికి స్ట్రాంగ్ వార్నింగ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 13th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని వైజయంతి వదిలేసినట్టేనా..?  

Illu Illalu Pillalu Today Episodes: సాగర్ కు నర్మద వార్నింగ్.. సుక్కుకు ప్రేమ వార్నింగ్.. వల్లి నెక్స్ట్ ప్లానేంటి..?

Big Stories

Advertisement
×