Nabha Natesh:నభా నటేష్.. నన్ను దోచుకుందువటే అంటూ సుధీర్ బాబు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ టాప్ లీగ్ లోకి వెళ్ళడం ఖాయం అనుకున్నారు.అన్నట్టుగానే ఇష్మార్ట్ శంకర్ ని పట్టేసి లీగ్ లో దూసుకుపోతున్నట్టే కనిపించింది.కానీ ఏమైందో ఏమో ఉన్నపళంగా రేసు నుండి వెనకపడిపోయింది ఈ ముద్దుగుమ్మ.అయితేనేం సినిమాలలో వేగం తగ్గించినా,సోషల్ మీడియాలో మాత్రం వరుస అప్ డేట్స్ తో షేక్ చేస్తుంది.
అభిమానులని మరోసారి ఫిదా
ఈ క్రమంలోనే తాజాగా ‘Celestine’ లుక్‌లో మెరిసిన నభా తన గ్లామరస్ స్టైల్‌తో అభిమానులని మరోసారి ఫిదా చేసేసింది. వైట్ కలర్ షిమ్మరీ డ్రెస్‌లో, స్టైలిష్ జ్యువెలరీతో నెట్టింట్లో దర్శనమివ్వడంతో మెస్మరైజ్ అవుతున్నారు ఫాలోవర్స్. అయితే ఈ ఫోటోల కంటే కూడా ఇప్పుడు ఆమె తెలుగు సినిమా కెరీర్ గురించే కొందరు ఆసక్తిగా మాట్లాడుకోవడం విశేషం.
టాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పేశారా?
ఒకప్పుడు టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో సందడి చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు తెలుగు సినిమాల్లో ఎందుకు పెద్దగా కనిపించడం లేదు? నిజంగానే టాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పేశారా? లేక మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్నారా? అన్న డౌట్స్ రైజ్ అవుతున్నాయి.
ముందుగా గుర్తొచ్చే సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’
నిజానికి నభా నటేష్ పేరు చెప్పగానే చాలామంది తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చే సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకోవడంతో నభాకు కూడా టాలీవుడ్‌లో మంచి క్రేజ్ వచ్చింది.
ఒక రకంగా ఈ భామకి మైనస్
రవితేజతో కలిసి ‘డిస్కో రాజా’ సాయిధరమ్ తేజ్‌తో కలిసి ‘సోలో బ్రతుకే సో బెటర్’లో బెల్లంకొండ శ్రీనివాస్‌తో ‘అల్లుడు అదుర్స్’, నితిన్‌తో ‘మాస్ట్రో’ సినిమాల్లోనూ నభా నటించిన సంగతి తెల్సిందే. అయితే ఎన్ని సినిమాలు చేసినా ‘ఇస్మార్ట్ శంకర్’ లాంటి మరో భారీ కమర్షియల్ హిట్ పడకపోవడం ఒక రకంగా ఈ భామకి మైనస్ అనే చెప్పాలి.
మంచి సినిమాలతో ఆడియన్స్ ని అలరిస్తుందో లేదో !
అయితే కొంతకాలం పాటు సినిమాల్లో పెద్దగా కనిపించని నభా, 2024లో ‘డార్లింగ్’ సినిమాతో మళ్లీ ప్రేక్షకులని పలకరించింది. ప్రియదర్శితో కలిసి నటించిన మెప్పించినప్పటికీ సినిమా బకెట్ తన్నేయ్యడంతో మళ్ళీ లైమ్ లైట్ లోకి రావడానికి యుద్ధం చేయాల్సిన పరిస్థితి.ఇక ఈ మధ్యే విడుదలైన ‘నాగబంధం’ భారీ బడ్జెట్ తో వచ్చినప్పటికీ సోసో గా ఆడటం ఈ భామకి మరో మైనస్.చూడాలి మరి ముందు ముందు ఏమైనా మరిన్ని మంచి సినిమాలతో ఆడియన్స్ ని అలరిస్తుందో లేదో !
ALSO READ :సుధీర్‌కు అంత క్రేజ్ ఉన్నా.. హీరోగా ఎందుకు సక్సెస్ కావట్లేదంటే ?