Real Estate Festival Discount| పండుగల సీజన్‌లో కొత్త ఇల్లు కొనాలనుకుంటున్నారా? అయితే రియల్ ఎస్టేట్ బిల్డర్లు భారీగా డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. దీంతో చాలామంది కొత్త ఇల్లు కొనుగోలు చేసేందుకు ఆకర్షితులవుతారు. ఫ్లాట్ కొనుగోలుపై లక్షల రూపాయల తగ్గింపు, ఉచిత మాడ్యులర్ కిచెన్, స్టాంప్ డ్యూటీ బెనిఫిట్స్, బంగారు నాణేలు వంటి గిఫ్ట్స్ అందిస్తామని కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు ప్రకటిస్తుంటాయి.
అయితే ఈ ఆఫర్ల వల్ల నిజంగానే డబ్బు ఆదా అవుతుందా? లేక అసలు ధరలో మార్పు లేకుండా కేవలం గిఫ్ట్స్ ఆశగా చూపిస్తూ ఆకర్షిస్తున్నారా? ఇల్లు బుక్ చేసే ముందు కొన్ని విషయాలను తప్పనిసరిగా పరిశీలించాలి.
రియల్ ఎస్టేట్ సంస్థలు పండుగల సమయంలో కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తాయి. ఉదాహరణకు రూ.కోటి విలువైన ఫ్లాట్‌పై రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ప్రయోజనాలు అందిస్తున్నట్లు చెప్పవచ్చు. కొన్ని కంపెనీలు ఫ్లోర్ రైజ్ ఛార్జీలను మాఫీ చేస్తాయి. మరికొన్ని మాడ్యులర్ కిచెన్, ఉచిత గృహోపకరణాలు లేదా సులభమైన చెల్లింపు పథకాలను అందిస్తాయి. అయితే ఇవన్నీ ఇంటి అసలు ధరను తగ్గించకపోవచ్చు.
అందుకే అదే ప్రాంతంలోని ఇతర ప్రాజెక్టుల ధరలతో పోల్చాలి. పండుగలకు ముందు కూడా ఇలాంటి ఆఫర్లు ఉన్నాయా అని తెలుసుకోవాలి. అప్పుడే నిజమైన పొదుపు ఎంత ఉంటుందో అంచనా వేయగలం.
పండుగల సమయంలో చాలామంది కొత్త ఇల్లు కొనడానికి ఆసక్తి చూపుతారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని నిర్మాణ సంస్థలు అమ్మకాలను పెంచుకోవడానికి ప్రయత్నిస్తాయి. రాయల్ గ్రీన్ రియల్టీ మేనేజింగ్ డైరెక్టర్ యశాంక్ వాసన్ మీడియాతో మాట్లాడుతూ.. పండుగ ఆఫర్లు ఆకర్షణీయమైన ధరలు, సులభమైన చెల్లింపు పథకాలు, అదనపు బెనిఫిట్స్ అందిస్తాయని తెలిపారు.
అమ్మకాలను పెంచుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు లేదా అమ్ముడుపోని ఫ్లాట్లను విక్రయించాలనుకున్నప్పుడు కొన్ని కంపెనీలు బేరసారాలకు ఎక్కువ అవకాశం ఇస్తాయి. అయితే ప్రతి ప్రాజెక్టులోనూ ఒకే రకమైన బెనిఫిట్స్ లభించవు.
ఖర్మాస్ సమయంలో చాలామంది హిందూ కుటుంబాలు శుభకార్యాలు, పెద్ద కొనుగోళ్లకు దూరంగా ఉంటారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల కొనుగోళ్లపై ఆసక్తి తగ్గవచ్చు. ఈ సమయంలో కొనుగోలుదారులు ధర తగ్గింపు, సులభమైన చెల్లింపులు లేదా ఇతర ప్రయోజనాల కోసం బిల్డర్లతో బేరసారాలు జరపవచ్చు.అయితే ఖర్మాస్‌లోనే తక్కువ ధరకు ఇల్లు దొరుకుతుందని హామీ లేదు. MAPSKO రియల్ ఎస్టేట్ కంపెనీ గ్రూప్ డైరెక్టర్ రాహుల్ సింగ్లా ప్రకారం.. తాత్కాలిక ఆఫర్ల కంటే ఇంటి స్థానం, ప్రాజెక్టు నాణ్యత, చెల్లింపు విధానం ముఖ్యమైనవి.
హబ్‌టౌన్ లిమిటెడ్ మార్కెటింగ్ కమ్యూనికేషన్ అండ్ బ్రాండ్ హెడ్ రూపమ్ డే సూచించినట్లుగా, బేస్ ప్రైస్‌తో పాటు GST, స్టాంప్ డ్యూటీ, ఇతర ఛార్జీలను కూడా పరిశీలించాలి. కార్య్‌న్ గ్రూప్ డైరెక్టర్ వరుణ్ గార్గ్ కూడా కొనుగోలుదారులు తమ అవసరాలకు సరిపోయే చెల్లింపు పథకాలను పరిశీలించాలని సూచించారు. అన్ని ఛార్జీల వివరాలను రాతపూర్వకంగా తీసుకోవాలి. ఉచిత గిఫ్ట్స్ విలువను లెక్కించాలి. గృహ రుణ వాయిదాలు భరించగలమో లేదో కూడా చూసుకోవాలి.
Also Read: భర్తకు లక్షల్లో పెరిగిన ఆదాయం.. రెట్టింపు భరణం కావాలన్న భార్య.. కోర్టు ఏం చెప్పిందంటే
పండుగ ఆఫర్ ఉందని వెంటనే ఫ్లాట్ బుక్ చేయకూడదు. ధరలు పోల్చి, సాధ్యమైనంత వరకు బేరసారాలు చేయాలి. ఇంటి స్థానం, నిర్మాణ నాణ్యత, భవిష్యత్తులో దాని విలువ పెరిగే అవకాశాలను పరిశీలించాలి.
Also Read: రూ. కోట్లు ఖర్చు చేసి కారు పార్కింగ్ స్థలాలు కొనుగోలు చేసిన మహిళ.. డబుల్ ఆదాయం
ఇన్‌సెంటివ్స్, గిఫ్ట్స్ ఎక్కువగా ఉన్న ఆఫరే మంచి డీల్ కాదు. మీ బడ్జెట్‌కు సరిపోయే ధరలో, అవసరాలకు తగిన ఇల్లు లభించడమే నిజమైన ప్రయోజనం.