E-Paper
Advertisement

సినిమాల్లో నల్గొండ గద్దర్ హవా.. ఒక్క పాటకు ఎంత తీసుకుంటాడంటే?

సినిమాల్లో నల్గొండ గద్దర్ హవా.. ఒక్క పాటకు ఎంత తీసుకుంటాడంటే?
Advertisement

Nalgonda Gaddar Remuneration:నల్గొండ గద్దర్ .. తెలంగాణ ఫోక్ సాంగ్స్ తో ఆడియన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ స్టార్ సింగర్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అవుతున్న సంగతి తెలిసిందే .

ముఖ్యంగా తెలంగాణ యాసలో పాడే నల్గొండ గద్దర్ఆలియాస్ నరసన్న గొంతుకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అయితే ఈ మధ్య వరుస సినిమాలతో బిజీ అయిన నల్గొండ గద్దర్ అలియాస్ నరసన్న ఒక్కో పాటకి ఎంత తీసుకుంటాడు అంటూ ఆరా తీస్తున్నారు ఫోక్ లవర్స్.

Advertisement

సినిమాల విషయానికి వస్తే

నల్గొండ గద్దర్ పాడిన సినిమాల విషయానికి వస్తే నాని నటించిన దసరా సినిమాలోని ధూంధాం దోస్తాన్ పాటని తనదైన గొంతుతో ఎంత బాగా పాడాడో చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఇందులోని తెలంగాణ పల్లె పదాలు ఆడియన్స్ కి మంచి కిక్ ఇచ్చాయి.ఇక తాజాగా కొరియన్ కనకరాజు సినిమాలోని రాసాగుమ్మాడి, అలాగే శ్రీ విష్ణు నటించిన కామ్రేడ్ కళ్యాణ్ సినిమాలోని ఎత్తర ఎత్తు వంటి పాటలతో ఆడియన్స్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు నల్గొండ గద్దర్.

Advertisement

పారితోషికం విషయానికి వస్తే

అయితే ప్రస్తుతం నల్గొండ గద్దర్ ఒక్కోపాటకి తీసుకుంటున్న పారితోషికం విషయానికి వస్తే ఆడియన్స్ లో ఆయనకి ఉన్న క్రేజ్ కారణంగా ఒక్కోపాటకి దాదాపు రెండు నుండి మూడు లక్షల లోపల పారితోషికం తెలుస్తుంది .అయితే ఇది కేవలం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల ఆధారంగానే అని తెలుసుకోవాలి.

ఏకంగా దాదాపు 5 నుండి 6 లక్షల లోపు

ఇక సినిమాల సంగతి అలా ఉంటే బయట ప్రైవేట్ సాంగ్స్ కి నల్గొండ గద్దర్ ఎంత ఫేమసో చెప్పక్కర్లేదు. ఇక ఈ పాటల కోసం నల్గొండ గద్దర్ ఏకంగా దాదాపు 5 నుండి 6 లక్షల లోపు వసూలు చేస్తాడని తెలుస్తుంది. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది అఫీషియల్ గా నల్గొండ గద్దర్ బయట పెడితేనే తెలుస్తుంది.

నల్గొండ గద్దర్ ఎలా రియాక్ట్ అవుతాడో !

ఇక నల్గొండ గద్దర్ కి సినిమా పాటలు జానపదాలు కాకుండా భక్తి సాంగ్స్ ద్వారా కూడా మంచి గుర్తింపు ఉందని చెప్పక్కర్లేదు. ముఖ్యంగా యూట్యూబ్ లో రిలీజ్ అయ్యే ఆయన పాటలు, ప్రైవేట్ ఈవెంట్లు, స్టేజ్ షోల ద్వారా మరింత ఆదాయాన్ని నల్గొండ గద్దర్ వెనకేస్తున్నాడని వినిపిస్తుంది .మొత్తానికి నల్గొండ గద్దర్ ఒక్కో సినిమాకి ఒక పాటకి లక్షల్లోనే తీసుకుంటూ వినిపిస్తున్న వార్త. చూడాలి మరి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వార్తలపై నల్గొండ గద్దర్ ఎలా రియాక్ట్ అవుతాడో !

ALSO READ :గ్లామర్‌తో అదరగొడుతోంది.. కానీ సినిమాల సంగతేంటి నభా?

Tags

Related News

గ్లామర్‌తో అదరగొడుతోంది.. కానీ సినిమాల సంగతేంటి నభా?

తమిళనాడు సీఎం విజయ్ ను కలిసిన విజయ్ దేవరకొండ రష్మిక దంపతులు!

మోక్షజ్ఞ సినిమాలపై ఒత్తిడి.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన బాలయ్య చిన్నల్లుడు!

అనుపమకు ఆ సినిమా అంటే అంత పిచ్చా..50 సార్లు చూసానంటూ!

నానిని బావ అని ఎందుకు పిలుస్తానో తెలుసా? స్నిగ్ధ చెప్పిన అసలు విషయం ఇదే!

నితిన్ భార్యగా చేస్తున్న రుక్మిణి ఎవరో తెలుసా?

నాని ‘బ్లడీ రోమియో’ షూటింగ్ షూర్..ఫస్ట్ షెడ్యూల్ డీటెయిల్స్ ఇవే!

Big Stories

Advertisement
×