BigTV English

Naga Vamsi : ఆ ముగ్గురు బడా నిర్మాతలకు ధీటుగా యువ నిర్మాత

Naga Vamsi : ఆ ముగ్గురు బడా నిర్మాతలకు ధీటుగా యువ నిర్మాత

Naga Vamsi : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ ప్రొడ్యూసర్స్ లో సూర్యదేవర నాగ వంశీ ఒకరు. ప్రముఖ బ్యానర్ హారిక హాసిని క్రియేషన్స్ నుంచి అనుసంధానంగా క్రియేట్ చేసిన బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్స్. ఈ బ్యానర్లో నాగవంశీ సినిమాలు నిర్మిస్తూ ఉంటారు. ప్రస్తుతం నాగ వంశీ గురించి ప్రత్యేకమైన పరిచయాల అవసరం లేదు. తన సినిమా ప్రమోషన్స్ లో మీడియాతో మాట్లాడే విధానం నాగవంశీని బాగా పాపులర్ చేసింది. ఒక వైపు సినిమాలు నిర్మిస్తూనే మరోవైపు డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తుంటారు.


ఇప్పటికే నాగ వంశీ పలు సినిమాలను డిస్ట్రిబ్యూషన్ చేశారు. ముఖ్యంగా దేవర సినిమా నాగవంశీకి మంచి లాభాలు తీసుకొచ్చి పెట్టింది. ఎన్టీఆర్ అంటే నాగ వంశీకి ఒక ప్రత్యేకమైన అభిమానం. పలు సందర్భాలలో ఆ మాటను చెబుతూ వచ్చాడు వంశీ. ఇప్పుడు ఎన్టీఆర్ కోసం భారీ రిస్క్ చేస్తున్నాడు. ఏకంగా ముగ్గురు నిర్మాతలతో ధీటుగా పోటీలోకి దిగుతున్నాడు.

బడా నిర్మాతలతో పోటీ 


ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్స్ లో దిల్ రాజు, ఏసియన్ సునీల్, సురేష్ బాబు వీళ్ళ పేర్లు ఖచ్చితంగా వినిపిస్తాయి. అయితే ప్రస్తుతం సురేష్ ప్రొడక్షన్స్ సినిమాలో తొందరగా చేసేయకుండా ఆచితూచి అడుగులు వేస్తూ నిర్మిస్తుంది. అయితే కొన్ని అద్భుతమైన సినిమాలను సురేష్ ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. ఇక ప్రస్తుతం దిల్ రాజు, సునీల్, సురేష్ బాబు కలిసి రజనీకాంత్ సినిమా కూలీని తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఈ సినిమాకి మంచి క్రేజ్ ఉండటం వలన వీళ్ళ ముగ్గురు కలిసి ఈ సినిమాను కొనుక్కున్నారు. ఆగస్టు 14న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. అదే రోజున వార్ 2 సినిమా కూడా ప్రేక్షకులు ముందుకు రానుంది.

Also Read : Ratsasan 2 : థ్రిల్లర్ లవర్స్ కు అదిరిపోయే ట్రీట్, వెన్నులో వణుకు పుట్టడం ఖాయం

బిగ్గెస్ట్ వార్ 

అయితే వార్ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో నాగ వంశి రిలీజ్ చేయనున్నారు. ఒకవైపు రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ వంటి భారీ స్టార్ కాస్ట్ ఉన్న సినిమా కూలి. అటువంటి సినిమాకు పోటీగా వార్ 2 సినిమా విడుదలవుతుంది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమా మీద కూడా కొద్దిపాటి అంచనాలు ఉన్నాయి. ముగ్గురు నిర్మాతలు ఆ సినిమాతో ముందుకు వస్తుంటే ఈ యంగ్ ప్రొడ్యూసర్ మాత్రం వార్ సినిమాతో వార్ కు ఇన్వైట్ చేస్తున్నాడు. బాక్స్ ఆఫీస్ వద్ద ఏ సినిమా ఎంత సక్సెస్ సాధిస్తుంది అని ఆగస్టు 14న తేలనుంది.

Also Read : Court Sridevi: కోర్టు భామపై కోలీవుడ్ కన్నేసింది

Related News

Coolie & War2 : డబ్బింగ్ సినిమాలకు కూడా టిక్కెట్ హైక్, ఇలా అయితే కష్టమే

Nidhi Agarwal Car Issue : నిధి అగర్వాల్ కారు కాంట్రవర్సీపై పవన్ రియాక్షన్ ఇదే

Rashi Singh: హైదరాబాద్‌లో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన హీరోయిన్ రాశీ సింగ్.. ఇవిగో వీడియో ప్రూఫ్స్

Akkineni Nagarjuna : కూలీ సినిమా 100 బాషా లతో సమానం

Shruti Haasan: ముంబైలో శ్రుతీ ఇల్లు చూశారా? గోడకు రంగుల్లేవు, లోపల సగం కట్టి వదిలేసిన ఇటుక గోడ..

SSMB 29 : బాబు లుక్ అదిరింది, మహేష్ బాబు ఫ్యాన్స్ లో జోష్ నింపిన కార్తికేయ 

Big Stories

×