Indian Railway Viral Video: ప్రయాణీకులకు భారతీయ రైల్వే ఎన్నో సౌకర్యాలను కల్పిస్తుంది. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆహ్లాదకరంగా ప్రయాణం చేయడానికి తగిన చర్యలు తీసుకుంటుంది. రైల్వే కోచ్ లలో బెడ్ షీట్లు, దిండ్లతో పాటు ఛార్జింగ్ సాకెట్లను అందిస్తుంది. ప్రయాణ సమయంలో ఇబ్బంది లేకుండా వాష్ రూమ్ సౌకర్యాన్నికల్పించింది. అయితే, కొంత మంది కారణంగా ఇప్పుడు ఆ టాయిలెట్లు మిస్ యూజ్ అవుతున్నాయి. ఓ జంట టాయిలెట్ లో ఆ పనులు చేస్తూ కెమెరాకు చిక్కారు. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న వీడియోలో ఏం ఉందంటే?
ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువతి, యువకుడు రైల్వే కోచ్ లోని టాయిలెట్ నుంచి బయటకు వస్తూ కనిపించారు. ముందుగా బ్లాక్ టీ షర్ట్ ధరించి మాస్క్ పెట్టుకున్న టాయిలెట్ నుంచి బయటకు వస్తాడు. వస్తూ వస్తూ డోర్ క్లోజ్ చేసి వస్తాడు. కాసేపటి తర్వాత ఆ టాయిలెట్ నుంచి టీషర్ట్, జీన్స్ ప్యాంట్ ధరించిన యువతి బయటకు వస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Indian railway became OYO hotels now! pic.twitter.com/PEJwp1xv57
— Voice of Hindus (@Warlock_Shubh) August 18, 2025
నెటిజన్లు ఏం అంటున్నారంటే?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇలాంటి పనులు చేస్తున్న వారి విషయంలో రైల్వే కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొంత మంది ఆ అమ్మాయి వీడియోను షేర్ చేయడం తప్పంటూ కామెంట్స్ పెడుతున్నారు. “అనుమతి లేకుండా ఆమె వీడియోను షేర్ చేసి తన జీవితాన్ని నాశనం చేయడం నిజంగా సిగ్గుచేటు. వారు తప్పు చేశారని అర్థమైంది. కానీ, ఆ అమ్మాయి వీడియో వైరల్ అవుతుంది. ఇకపై ఆమెను బయట చూసిన వాళ్లు ఏం అంటారో తెలుసా?” అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొంత మంది ఈ వీడియో ఫేక్ వీడియో అయి ఉండవచ్చని కామెంట్ చేస్తున్నారు. “నిజంగా ఈ వీడియో షేర్ చేయడం సిగ్గులేని పని. ఆ వీడియోలో ఉన్నది నిజమో? కాదో? తెలియకుండా ఓయో రూమ్ అని ఎలా కన్ఫార్మ్ చేస్తావు? ఎవరైనా ఈ వీడియోను ఎడిట్ చేసి ఉండవచ్చు కదా? ఈ వీడియోను పరిశీలించి చూస్తే కచ్చితంగా ఎడిట్ చేసినట్లుగానే ఉంది” అని ఇంకో వ్యక్తి రాసుకొచ్చాడు. “ఈ వీడియో 100 శాతం ఎడిట్ చేసిందని అర్థం అవుతుంది. కచ్చితంగా ఇది నిజం కాదు. ఈ వీడియోను షూట్ చేసిన వారితో పాటు సోషల్ మీడియాలో షేర్ చేసిన వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని మరో వ్యక్తి డిమాండ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియోపై నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది.
Read Also: తెలంగాణలో కొత్త రైల్వే స్టేషన్.. ప్రారంభం ఎప్పుడంటే?