BigTV English

Naga Vamsi: ఈ కంపారిజన్ చేస్తే ఆడియన్స్ నన్ను తంతారు

Naga Vamsi: ఈ కంపారిజన్ చేస్తే ఆడియన్స్ నన్ను తంతారు

Naga Vamsi: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ప్రత్యేకమైన నిర్మాతలలో నాగ వంశీ ఒకరు. ఒకప్పుడు దిల్ రాజు వర్క్ లో ఎంత అగ్రెసివ్ గా కనిపించే వాళ్ళో, ఈ రోజుల్లో నాగ వంశీ అలా కనిపిస్తాడు. ఈ విషయాన్ని మనం చెప్పడం కాదు ఒక సందర్భంలో దిల్ రాజు కూడా చెప్పారు. రీసెంట్ ఇంటర్వ్యూస్ లో దిల్ రాజు సోదరుడు కూడా మాట్లాడుతూ నాగ వంశీని ఆకాశానికి ఎత్తేసాడు.


సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో నాకు వంశీ సినిమాలు నిర్మిస్తూ ఉంటారు. అంతేకాకుండా హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లు నిర్మితమయ్యే త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలకు కీలకపాత్ర వహిస్తారు. పెద్దపెద్ద ప్రాజెక్టులు, కాంబినేషన్స్ సెట్ చేస్తూ ఉంటాడు. ఒక దర్శకుడిని ఎక్కువకాలం వెయిట్ చేయించకుండా, ఏదో ఒక ప్రాజెక్టు చేయిస్తూనే ఉంటాడు. అనగనగా ఒక రాజు సినిమా లేట్ అవుతుంది అనే తరుణంలో మ్యాడ్ అనే సినిమాతో కళ్యాణ్ శంకర్ ను దర్శకుడిని చేసేసాడు.

అలా చెప్తే ఆడియన్స్ తంతారు 


ఇక నాకు మంచి విషయానికి వస్తే కొన్ని ఇంటర్వ్యూస్ లో తన మాట్లాడే మాటలు విపరీతంగా వైరల్ అవుతాయి. అలానే కొన్ని ప్రెస్ మీట్స్ లో కూడా మీడియాకు అదిరిపోయే సమాధానం ఇస్తుంటారు. ఇక రీసెంట్గా F1 సినిమా నుంచి సంచలమైన వ్యాఖ్యలు చేశారు. నేను f1 అనే సినిమా చూశాను. నాకు సినిమా పిచ్చిపిచ్చిగా నచ్చింది. కానీ సినిమా చివర్లో ఆ సినిమా నాకు జెర్సీ సినిమాలనే అనిపించింది. బహుశా నేను జెర్సీ సినిమాను నిర్మించడం వలన కావచ్చు నాకు ఆ సినిమా కూడా జెర్సీ లాగా అనిపించింది. వాళ్లు మన నుంచి కాపీ కొడుతున్నారని నేను చెప్పను. నాకు అలా అనిపించింది జెర్సీలో ఉన్న చాలా సిమిలర్ పాయింట్స్ ఈ సినిమాలో ఉన్నాయి అంటూ తెలిపారు.

కాన్ఫిడెన్స్ మిస్ అవ్వలేదు 

నాగ వంశీ విషయానికి వస్తే ఒక సినిమా అవుట్ పుట్ చూసి అది ఏ స్థాయి వరకు ఆడుతుందో గెస్ చేయగలడు. అలానే సినిమా రిలీజ్ కి ముందు చాలా కాన్ఫిడెన్స్ గా కనిపిస్తారు. గతంలో కూడా లక్కీ భాస్కర్ వంటి సినిమా విడుదలవుతున్న తరుణంలో ఈ సినిమా అద్భుతంగా ఉండబోతుంది. దీంట్లో ఎటువంటి లొసుగులు లేవు అంటూ చెప్పుకొచ్చాడు. మ్యాడ్ స్క్వేర్ సినిమా రిలీజ్ అయినప్పుడు మాత్రం దీనిలో మీరు పెద్దగా కథ గురించి వెతకొద్దు. థియేటర్ కు వచ్చి సినిమా చూసి హాయిగా నవ్వుకొని వెళ్లిపోండి అని చెప్పాడు. అలానే ఇప్పుడు కింగ్డమ్ సినిమా గురించి కూడా చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. విజయ్ దేవరకొండ ఈ సినిమాతో ఒక స్ట్రాంగ్ కం బ్యాక్ ఇస్తాడు అని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Kothapalli lo okappudu : రానా నాయుడు ఎఫెక్ట్ తోనే, ఈ సినిమాలో కూడా బూతులు ఎంకరేజ్ చేశారా.?

 

Related News

Bollywood: బాలీవుడ్ లో దిగ్బ్రాంతి, ఆ ప్రముఖ నటుడు దూరమయ్యారు

Ar Muragadoss: ఇంక రిటైర్మెంట్ ఇచ్చేయండి బాసు, పెద్ద డైరెక్టర్లు వరుస ఫెయిల్యూర్స్

Nag Ashwin: ప్రధానికి నాగ్ అశ్విన్ కీలక రిక్వెస్ట్.. కొత్త జీఎస్టీ‌లో ఆ మార్పు చెయ్యాలంటూ…

Siima 2025 Allu Arjun: సైమా ఈవెంట్లో అల్లు అర్జున్, లుక్ అదిరింది భాయ్

17 Years of Nani : మామూలు జర్నీ కాదు, ఈ తరానికి నువ్వే బాసు

Sujeeth: సుజీత్ కరుడుగట్టిన కళ్యాణ్ అభిమాని.. ఏం చేశాడంటే?

Big Stories

×