Los Angeles 2028 Olympics Schedule: క్రీడా అభిమానులకు బిగ్ అలర్ట్. 2028 సంవత్సరంలో జరగాల్సిన ఒలంపిక్స్ షెడ్యూల్ వచ్చేసింది. ఈ మేరకు ఒలంపిక్స్ షెడ్యూల్ ను రిలీజ్ చేశారు. 2028 సంవత్సరంలో….. లాస్ ఏంజెల్స్ లో (Los Angeles ) ఒలంపిక్స్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఒలంపిక్స్ లో క్రికెట్ ( Cricket) కూడా నిర్వహించనున్నారు. ఇలా క్రికెట్ తొలిసారిగా… ఒలంపిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో ఈ ఒలంపిక్స్ షెడ్యూల్ తాజాగా రిలీజ్ అయింది. ఈ షెడ్యూల్ లో క్రికెట్ మ్యాచ్లకు సంబంధించిన అప్డేట్ కూడా వచ్చేసింది.
ఒలంపిక్స్ షెడ్యూల్ ఇదే
లాస్ ఏంజెల్స్ ఒలంపిక్స్ 2028 షెడ్యూల్ (Los Angeles 2028 Olympics Schedule ) కాసేపటి క్రితమే రిలీజ్ అయింది. ఈ షెడ్యూల్ ప్రకారం జూలై 14వ తేదీ నుంచి జూలై 30వ తేదీ వరకు ఈ ఈవెంట్ జరగనుంది. 2028 ఒలంపిక్స్ లో క్రికెట్ కూడా జరగనుంది. జూలై 12వ తేదీ నుంచి జూలై 29వ తేదీ వరకు జరిగే ఈ పోటీలలో ఆరు క్రికెట్ జట్లు పాల్గొనబోతున్నాయి. ఇందులో టీమిండియా కూడా ఉంది. అలాగే ఆర్చరీ గేమ్స్ జూలై 21వ తేదీ నుంచి జూలై 28వ తేదీ వరకు కొనసాగుతాయి.
అథ్లెటిక్స్ క్రీడాలు జూలై 15వ తేదీ నుంచి జూలై 30వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇక బ్యాడ్మింటన్ కు సంబంధించిన మ్యాచులు జూలై 15వ తేదీ నుంచి జూలై 24వ తేదీ వరకు కొనసాగుతాయి. బాక్సింగ్ షెడ్యూల్ వచ్చేసరికి జూలై 15 నుంచి జూలై 30వ తేదీ వరకు ఉంటాయి. జులై 12వ తేదీ నుంచి జూలై 29వ తేదీ వరకు హాకీ జరగనుంది. ఇక జూలై 15వ తేదీ నుంచి జూలై 25వ తేదీ వరకు షూటింగ్ క్రీడాలు జరుగుతాయి. జులై 15వ తేదీ నుంచి జూలై 24వ తేదీ వరకు స్క్వాష్ గేమ్స్ ఉంటాయి. జులై 15వ తేదీ నుంచి జూలై 29వ తేదీ వరకు టేబుల్ టెన్నిస్… జూలై 19వ తేదీ నుంచి 28వ తేదీ టెన్నిస్ క్రీడాలు ఉంటాయి. అలాగే వెయిట్ లిఫ్టింగ్ క్రీడాలను జూలై 25వ తేదీ నుంచి జూలై 29 తేదీ వరకు నిర్వహిస్తారు. చివరగా జూలై 24వ తేదీ నుంచి జూలై 30వ తేదీ వరకు రెజ్లింగ్ పోటీలు జరుగుతాయి.
LA 2028 ఒలింపిక్స్ షెడ్యూల్ (Los Angeles 2028 Olympics Schedule )
జూలై 15 నుండి 30 వరకు లాస్ ఏంజిల్స్‌లో మ్యాచ్ ల వివరాలు
ఆర్చరీ 20-28
అథ్లెటిక్స్ 15-24
బ్యాడ్మింటన్ 15-24
బాక్సింగ్ 15-30
క్రికెట్ 12-29
హాకీ 12-29
షూటింగ్ 15-25
స్క్వాష్ 15-24
టేబుల్ టెన్నిస్ 15-29
టెన్నిస్ 19-28
వెయిట్ లిఫ్టింగ్ 25-29
రెజ్లింగ్ 24-30